Bharat Biotech Booster Dose: టెన్షన్ వద్దు మిత్రమా.. చుక్కల మందు టీకా ట్రయల్స్‌కు అనుమతి వచ్చేసింది
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.
కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉన్న దశలో ఓ శుభవార్త వచ్చింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు'గా వినియోగించేందుకు అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో జరగనున్నాయి.
దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ బూస్టర్ డోసుపై మరోసారి చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు' కింద వినియోగించేందుకు సూత్రప్రాయంగా డీసీజీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
క్లినికల్ పరీక్షలకు ఓకే..
బూస్టర్ డోస్ ఇదేనా..
ఈ చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. ఇందులో సగం మందిని కొవాగ్జిన్, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది.
దేశంలో కేసులు..
మరోవైపు దేశంలో కొత్తగా 2,51,209 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. 627 మంది మృతి చెందారు. 3,47,443 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,80,24,771కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611గా ఉంది. రికవరీ రేటు 93.60గా ఉంది.
డైలీ పాజిటివిటీ రేటు 15.88గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 17.47గా ఉంది. నిన్న ఒక్కరోజే 15,82,307 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం 72.37 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!
Also Read: Yediyurappa Granddaughter Dead: మాజీ సీఎం మనవరాలు ఆత్మహత్య.. కారణమిదే!