Yediyurappa Granddaughter Dead: మాజీ సీఎం మనవరాలు ఆత్మహత్య.. కారణమిదే!
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మనవరాలు సౌందర్య (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
The postmortem of Soundarya, the granddaughter of former Karnataka CM BS Yediyurappa's granddaughter, is underway at Bowring and Lady Curzon Hospital in Bengaluru. She was found hanging at a private apartment in Bengaluru.
— ANI (@ANI) January 28, 2022
Visuals from the hospital. pic.twitter.com/tgBW52E9Rt
బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సౌందర్య ఉరి వేసుకున్నట్లు సమాచారం. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటి లభించలేదని స్పష్టం చేశారు.
యడియూరప్ప కుమార్తె అయిన పద్మావతి కూతురు సౌందర్య. ఆమె కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా డిప్రెషన్లో ఉన్నట్లు సమాచారం. డాక్టర్ అయిన సౌందర్య 2018లో డా. నీరజ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఆరు నెలల పాప కూడా ఉంది.
దర్యాప్తు మొదలు..
Bengaluru's High Grounds Police Station begins investigation into the death of former Karnataka CM BS Yediyurappa's granddaughter Soundarya who was found hanging at a private apartment today.
— ANI (@ANI) January 28, 2022
ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద కేసుగానే నమోదు చేసినట్లు తెలిపారు.
Also Read: Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!