అన్వేషించండి

చలికాలంలో ఈ ఆహారాలు అస్సలు వద్దు, తింటే ఏమవుతుందంటే..

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి. కొన్ని రకాల పదార్థాలకు శీతాకాలంలో దూరంగా ఉండాల్సి ఉంటుంది. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం.

చల్లని చలికాలంలో వేడి వేడిగా ఏదైనా తింటే భలే బాగుంటుంది కదూ. అయితే, ఈ కాలంలో ఏది పడితే అది తినేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వద్దని, దానివల్ల రోగ నిరోధక శక్తి బలహీనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, మీరు రెగ్యులర్‌గా తీసుకొనే ఈ కింది ఆహారపానీయలకు సైతం ఈ కాలంలో దూరంగా ఉండటం మంచింది. అవేంటో చూసేయండి మరి. 

వెచ్చవెచ్చని కాఫీ

చలి కాలంలో వెచ్చగా కాఫీ గొంతులోకి దిగుతుంటే చాలా బావుంటుంటుంది. ఎవరైనా కాఫీ ఆఫర్ చేస్తే వద్దని అనలేము. కానీ కాఫీ ఎక్కువ సార్లు తాగాలని అనిపించినపుడల్లా తాగడం మంచిది కాదని అంటున్నారు నిపుణులు, ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది, చలికాలంలో ముందు వాతావరణమే చాలా పొడిగా ఉంటుంది, అందుకు తోడు నీళ్లు ఎక్కువ తాగరు అందువల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంటుంది. వెచ్చదనం కోసం తరచుగా కాఫీ తాగితే అందులోని కెఫిన్ వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ కావచ్చు. అందుకే వేడిగా కాఫీ తాగడం కంటే కాస్త వెచ్చగా నీళ్లు తాగడం మంచిది.

టమాట

టమాట లేకుండా వంట పూర్తి చెయ్యడం కష్టం. టమాట ఇష్టపడని వారు చాలా తక్కువ మంది. ఏ వంటకంలో నైనా ఇట్టే కలిసి పోయే టమాట అందరి ఫెవరేట్. అయితే వేసవి చివరి కాలంలో వచ్చే టమాటలు చాలా రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో ఎర్రగా అందంగా కనిపిస్తాయి. కానీ అంత రుచిగా ఉండవు. శీతాకాలంలో టమాటాలు తినకపోవడమే మంచిది.

స్ట్రాబెర్రీ

వేసవితో పోలిస్తే చలికాలంలో స్ట్రాబెర్రీలు లేతగా ఉంటాయి. స్ట్రా బెర్రిలో ఫైటోన్యూట్రియెంట్స్ పరిమాణం దాని రంగు మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రంగు అంటే ఎక్కువ పోషకాలు కలిగినది అని అర్థం. కనుక వీటిని వేసవిలో తినటమే మంచిది.

బేక్డ్ పదార్థాలు

కప్పు హాట్ చాక్లెట్ తో రెండు కుకీలు తినడం ఒక మంచి ఫీల్. కానీ చలికాలంలో సాచ్యూరేటెడ్ కొవ్వులను జీర్ణం చేసే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల శరరీంలో కొవ్వు పేరుకుంటుంది. చలికాలంలో జీవక్రియల వేగం కూడా నెమ్మదిస్తుంది. కనుక వీలైనంత వరకు బెక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.

మిరపకాయలు

చలికాలంలో స్పైసీ ఫూడ్ ఎంత రుచిగా అనిపిస్తుందో చెప్పలేం. బ్లాక్డ్ నోస్ తెరుచుకునేందుకు బాగా పనిచేస్తుంది.  మిరపకాయలు సైనస్ లు క్లియర్ చేసేందుకు దోహదం చేస్తాయి. కానీ అవి కడుపుకు మంచివి కావు. చలి కాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. చలికాలం వెచ్చగా తినడం మంచిదే కానీ కారంగా మాత్రం కాదు. మిరపకాయలకు బదులుగా నల్ల మిరియాలు, అల్లం ఎక్కువగా వాడడం మంచిది.

ప్యాక్డ్ గ్రీన్స్

చలికాలం ఆకుకూరలు పుష్కలంగా దొరకుతాయి. అందుకే ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యదాయకం. తాజాగా దొరికే ఆకుకూరలనే వాడుకోవాలి. ముందుగా కడిగి, కోసి ప్యాక్ చేసిన ఆకుకూరలు వాడుకునేందకు సౌకర్యంగా ఉంటాయి కానీ వాటిలో పోషకాల నష్టం జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ప్యాక్డ్ కూరగాయలు కొనకపోవడమే మంచిది.

Also Read: వేడి నీళ్లతో స్నానం ప్రమాదకరమా? ఈ సమస్యలు వస్తాయ్, జాగ్రత్త!

టాప్ హెడ్ లైన్స్

Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Bone Density : ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బోన్ డెన్సిటీ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బోన్ డెన్సిటీ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Dementia Risk Factors : వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
Fenugreek Seeds : జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?
జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget