మీరు ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే నాలుగో డోస్ అవసరం లేదు - తేల్చిన కొత్త అధ్యయనం
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ నాలుగో డోస్ కోవిడ్ వ్యాక్సిన్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి.
కరోనా పూర్తిగా ప్రపంచం నుంచి తుడిచిపెట్టుకుపోలేదు. కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతూనే ఉంది. ప్రస్తుతం ఒమిక్రమ్ BF.7 వేరియంట్ చైనాలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. అక్కడ మరణాలు అధికంగానే నమోదవుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానిస్తోంది. చైనా సాధారణంగా తమ దేశం నుంచి ఏ విషయాన్ని బయటికి రానివ్వదు. అందుకే అక్కడ ఉన్న నిజ పరిస్థితి బయటికి తెలియడం లేదు. అంతే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనా కోవిడ్ వల్ల కలుగుతున్న నష్టమేంటో చెప్పమని అడిగింది. అయినా చైనా నోరు విప్పడం లేదు. ఈ BF.7 వేరియంట్ వల్ల చైనాలో భారీగా మరనాలు సంభవిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ చైనా మాత్రం నోరు మెదపడం లేదు. చైనా ఆ వేరియంట్ ఇతర దేశాలకు కూడా పాకింది.
ఈ వ్యాక్సిన్ వేసుకుంటే...
మనదేశంలో కూడా BF.7 కరోనా వేరియంట్ కేసులు కనిపించాయి. ఆ వేరియంగ్ చాలా మొండిదని, టీకా వేసుకున్న వారిపై కూడా దాడి చేసి ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తోందని ఇప్పటికే ఎంతో వైద్య శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కూడా భయం మొదలైంది. ఇప్పటికే ఎంతో రెండు డోసులతో పాటూ మూడో బూస్టర్ డోసును కూడా తీసుకున్నారు. అయిదే BF.7 వేరియంట్ తట్టుకోవాలంటే నాలుగో బూస్టర్ డోస్ కూడా అవసరమనే వాదన ఉంది. ఒక కొత్త అధ్యయనం మాత్రం కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి నాలుగో డోసు అవసరం లేదని చెబుతోంది. మనదేశంలో ఎక్కువ మంది వేసుకున్న టీకా కోవీషీల్డ్. ఎంతో మంది బూస్టర్ డోస్ కూడా పొందినవారు ఉన్నారు. వారు నాలుగో డోస్ వేసుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటకలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్’ పరిశోధకులు చేసిన అధ్యయనం చెబుతోంది
ఈ అధ్యయనంలో భాగంగా 350 మంది వాలంటీర్లపై అధ్యయనం నిర్వహించారు. వీరంతా కూడా బూస్టర్ డోస్ తీసుకున్న వారే. అంటే మూడుసార్లు టీకా వేసుకున్నవారు. వీరంతా కూడా కోవిషీల్డ్ టీకానే వేసుకున్నారు. అయితే వీరికి నాలుగవ డోస్ అవసరమా కాదా అన్న అంశంపై పరిశోధన చేశారు. ఈ వాలంటీర్లంతా వైద్యులు, నర్సులు, వార్డు సహాయకులు అంటే ఆసుపత్రులలో పని చేసే సిబ్బంది. వీరి వయస్సు 19 నుండి 60 సంవత్సరాల వరకు ఉంది. వీరిలో 148 మంది పురుషులు, 220 మంది మహిళలు ఉన్నారు. వీరిపై చేసిన అధ్యయనంలో కోవిషీల్డ్ వేసుకున్న వీరందరిలో యాంటీ బాడీలు పుష్కలంగా ఉన్నాయని తేలింది. వీరిలో 99.4% మంది తగినంత న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలను కలిగి ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి ఎవరైతే కోవీషీల్డ్ టీకా వేసుకుంటారో వాళ్,ళు నాలుగోసారి బూస్టర్ డోస్ వేసుకోవలసిన అవసరం లేదు అని చెబుతున్నారు అధ్యయనకర్తలు.
Also read: చికెన్ VS ఫిష్: బరువు తగ్గే ప్రయాణంలో ఏది తింటే మంచిది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.