Onions: ఉల్లిపాయతో ఎన్ని ప్రయోజనాలో... అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు
ఉల్లిపాయలను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలకు దూరం అవ్వొచ్చో ఇప్పుడు చూద్దాం.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయలను నిత్యం మనం కూరల్లో వేసుకుంటాం. కొందరు ఉల్లి ప్రియులు పచ్చిగానే తింటుంటారు. అలాగే వేసవిలో చాలా మంది మజ్జిగలో ఉల్లిపాయ ఇష్టంగా తింటుంటారు. దీని వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఉల్లిపాయలను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలకు దూరం అవ్వొచ్చో ఇప్పుడు చూద్దాం.
Also Read: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి
* ఉల్లి రసం, తేనే కలిపి ఒక స్పూన్ మోతాదు చొప్పున రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.
* ఉల్లిపాయ, కీరదోస, టమాట, క్యారెట్, కొత్తిమీరను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. తర్వాత ఈ పేస్టుకి నిమ్మ రసం జత చేసి రోజులో ఒకసారి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ కోశం శుభ్రమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* మధుమేహంతో బాధపడేవారు ఉల్లి రసంలో తేనె కలుపుకుని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
* భోజనం చేసిన తర్వాత ఉల్లి కాడలను నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది.
* రెండు స్పూన్ల ఉల్లి రసం, 2 స్పూన్ల తేనె, ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి రోజూ భోజనం తర్వాత తాగాలి. ఇలా చేయడం వల్ల ఆయాసం, దగ్గు తగ్గుతాయి.
* కీళ్ల నొప్పులు తగ్గాలంటే... కొంచెం ఆవ నూనె తీసుకుని ఉల్లి పాయ ముక్కలు వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఈ పేస్టును నొప్పులు ఉన్న చోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.
* ఉల్లిపాయ రసాన్ని వేడి చేసి 4 లేదా 5 చుక్కలు చెవిలో వేస్తే... చెవి నొప్పి తగ్గుతుంది.
Also Read: రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలి? ఎలా తినాలి? కలిగే ప్రయోజనాలంటి?
* జుట్టు బాగా పెరగాలంటే... 2 లేదా 3 ఉల్లిపాయలను మిక్సీలో వేసి నీళ్లు పోసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లో వడగట్టుకుని.. ఆ రసాన్ని తలకి పట్టించి, బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
* జుట్టు రాలటం తగ్గాలంటే... కొద్దిగా కరివేపాకు పేస్టుకు ఒక స్పూన్ ఉల్లి రసాన్ని చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మార్పును గమనించవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి