Diabetes Control Tips: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? డైలీ ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ సొంతం
Diabetes: ఈ రోజుల్లో షుగర్ చాలామందికి కామన్ అయిపోతుంది. కారణం తీసుకునే ఫుడ్. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తెలెత్తుతాయి. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
10 diet tips to control sugar spikes: ఈ రోజుల్లో చాలామందికి షుగర్ కామన్ అయిపోతుంది. అందుకే, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలవర్చుకోవడంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం తినే ఫుడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉందో చూసుకోవాలి. అధిక GI ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు, బరువు తగ్గాలి అనుకున్నవాళ్లు దీన్ని కచ్చితంగా చూసుకోవాలి. అందుకే, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. షుగర్-స్పైకింగ్ ఫుడ్స్ కాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
హోల్ గ్రెయిన్స్ తీసుకుంటే మంచిది..
వీలైనప్పుడల్లా హోల్ గ్రెయిన్స్, రిఫైండ్ గ్రెయిన్స్ ఆహారంగా తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు నిపుణులు. బ్రౌన్ రైస్, క్వినావో, ఓట్స్, గోధుమలు లాంటి వాటిల్లో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అది బ్లడ్ లో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. దాని ద్వారా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అవుతుంది.
గింజలు తింటే మంచిది..
బీన్స్, పెసలు, శనగలు లాంటి గింజెల్లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. గింజలని లంచ్ తో పాటుగా తీసుకుంటే.. షుగర్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా.. మనకు ఎనర్జీ లభిస్తుంది. కడుపు నిండా తిన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది.
హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి..
అవకాడో, ఆలివ్ ఆయిల్, నట్స్, సీడ్స్ లో ఉండే హెల్దీ ఫ్యాట్ ఆరోగ్యానికి చాలా మంచిది. గ్లైసిమిక్ రెప్సాన్స్ ని తగ్గిస్తుంది. ఫ్యాట్ డైజషన్ ప్రాసెస్ ని నిదానం చేస్తుంది. దాని ద్వారా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.
ప్రొటీన్ రిచ్ ఫుడ్ ముఖ్యం..
మాంసం, చేపలు, టోషూ, గ్రీక్ యోగర్ట్ ఫుడ్ తినాలి. అవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్లో చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా చేస్తాయి. ప్రొటీన్ గ్లైసిమిక్‌ను కంట్రోల్ చేస్తుంది.
ఆకుకూరలు తినాలి
ఆకుకూరలు, బ్రకోలీ, కాలిఫ్లవర్, మిరియాలు లాంటి వాటిలో కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు బ్లడ్ షుగర్ మీద తక్కవ ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకే, ఎంత ఎక్కువ తింటే అంత మంచిది.
షుగర్ ఉన్న పదార్థాలు తక్కువ తినాలి..
సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్, కేకులు, ప్రాసెస్ ఫుడ్స్ తినడం తగ్గించాలి. ఈ ఫుడ్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే, వాటికి బదులుగా ఫ్రెష్ ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే నోటికి తియ్యగా తగులుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ఎంత తింటున్నాం?
ఎంత తింటున్నాం అనేది తెలుసుకోవాలి. తినేదానిపై కంట్రోల్ ఉండాలి. ఎక్కువగా తినడాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చిన్నచిన్న ప్లేట్లు, బౌల్స్ లో తింటే తక్కువ తినే ఛాన్స్ ఉంటుంది. ఎంత తక్కువ తింటే.. షుగర్ అంత కంట్రోల్ లో ఉంటుంది.
బ్యాలెన్స్ మీల్స్ తినాలి
కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ కాంబినేషన్ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు డైజషన్ ప్రాసెస్ నిదానంగా జరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెల్లిగా కంట్రోల్ అవుతాయి.
నీళ్లు ఎక్కువగా తాగాలి..
బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచాలి. కచ్చితంగా నీళ్లు తాగాలి. ఆరోగ్యానికి చాలామంచిది. అంతేకాకుండా.. షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిది.
Also Read: తల్లే కాదు, తండ్రి ఆహారపు అలవాట్లు కూడా పిల్లలకు ప్రమాదమే - ఇదిగో ఇలా!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.