అన్వేషించండి

Father's Diet: తల్లే కాదు, తండ్రి ఆహారపు అలవాట్లు కూడా పిల్లలకు ప్రమాదమే - ఇదిగో ఇలా!

Father's Diet: త‌ల్లి తీసుకునే ఆహారం, ఆమె ఆరోగ్యాన్ని బ‌ట్టి కడుపులో పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అంటారు. కానీ, తండ్రి తీసుకునే ఆహారం కూడా పుట్ట‌బోయే బిడ్డ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ట‌.

Father's Diet Impacts Health Of His Future Children: ప్రెగ్నెన్సీ రావాల‌న్నా, వ‌చ్చాక బిడ్డ‌ ఆరోగ్యంగా పుట్టాల‌న్నా, బిడ్డ ఆరోగ్యంగా పెర‌గాల‌న్నా త‌ల్లి తీసుకునే ఆహారం చాలా ముఖ్యం అంటారు. అందుకే స్త్రీలు మంచి ఆహారం తీసుకోవాల‌ని, ఆరోగ్యంగా ఉండాల‌ని సూచిస్తుంటారు పెద్ద‌లు. బిడ్డ పుట్టిన త‌ర్వాత రెండేళ్ల వ‌ర‌కు కూడా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, మంచి ఫుడ్ తీసుకోవాల‌ని చెప్తుంటారు. అయితే, కేవ‌లం త‌ల్లి మాత్ర‌మే కాదు.. తండ్రి కూడా క‌చ్చితంగా ఆరోగ్యంగా ఉండాల‌ని అంటున్నారు. తండ్రి ఆరోగ్యంగా లేకపోతే పుట్టే బిడ్డ‌ల‌పై ప్ర‌భావం ఉంటుంద‌ని చెప్పారు. తండ్రి డైట్ ప్లాన్ స‌రిగ్గా లేక‌పోతే పుట్టే బిడ్డ మెట‌బాలిజ‌మ్ స‌రిగ్గా ఉంద‌డ‌ని రీసెర్చ్ లో తేలిన‌ట్లు సైంటిస్టులు చెప్తున్నారు. పిల్ల‌ల‌కు రోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, వాళ్లలో కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని అంటున్నారు. ఎదుగుద‌ల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తుంద‌ని తేల్చారు. 

స్పెర్మ్ పై ప్ర‌భావం.. 

తండ్రికి తిండికి, బిడ్డ ఆరోగ్యానికి సంబంధం ఎందుకు అని చాలామందిలో డౌట్ క‌ల‌గొచ్చు. దానికి స‌మాధానం చెప్పారు డాక్ట‌ర్లు. లో ప్రొటీన్ ఫుడ్, హై కార్బ్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల స్పెర్మ్ హెల్త్‌పై ప్ర‌భావం ఉంటుంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. స్పెర్మ్ సెల్స్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని, దీనివ‌ల్ల పిల్ల‌ల్లో జ‌న్యు లోపాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఎలుక‌ల‌పై రిసెర్చ్ చేసి ఈ విష‌యాన్ని క‌నుక్కున్నార‌ట. త‌క్కువ ప్రొటీన్, ఎక్కువ కార్బొహైడ్రేట్స్ తినే వ్య‌క్తికి పుట్టే పిల్ల‌ల్లో యాంగ్జైటీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని గ‌మ‌నించిన‌ట్లు చెప్పారు డాక్ట‌ర్లు. 

ఆడ‌పిల్ల‌ల‌కీ ఇబ్బందే.. 

లావుగా ఉండే వ్య‌క్తుల‌కు పుట్టిన ఆడ‌పిల్ల‌ల‌కు కూడా ఇబ్బందులు వ‌స్తాయ‌ని అంటున్నారు సైంటిస్టులు. కొవ్వు ఎక్కువ‌గా ఉన్న వాళ్లకి పుట్టిన ఆడ‌పిల్ల‌ల్లో మెట‌బాలిక్ రోగాలు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. డ‌యాబెటిస్ లాంటివి వ‌స్తాయ‌ని చెప్తున్నారు. తండ్రి తినే ఆహారం పుట్టే బిడ్డ‌పై ప్రెగ్నెసీ రాకముందే ఉంటుంద‌ని, అందుకే ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ తీసుకోవాల‌ని చెప్తున్నారు డాక్ట‌ర్లు. 

అల‌వాట్లు మార్చుకుంటే మంచిది.. 

నిజానికి త‌ల్లి ఫుడ్ కీల‌కం అంటారు. కానీ, తండ్రి తినే ఆహారం కూడా పుట్ట‌బోయే బిడ్డ మీద ప్ర‌భావం చూపిస్తుంద‌ని తేలియ‌పోయింద‌ని అన్నారు ప్రొఫెస‌ర్ సింప్స‌న్. “ ప్రొటీన్, ఫ్యాట్, కార్బ్స్ తీసుకోవ‌డంలో స‌రిగ్గా ఉంటే.. పుట్ట‌బోయే బిడ్డ హెల్దీగా ఉంటుంది. అందుకే, ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ తినాలి” అని సూచించారు సిప్స‌న్. అందుకే, ఎంత తిన్నారు అని కాకుండా ఏం తిన్నారు? అనే విష‌యాన్ని మైండ్‌లో పెట్టుకోవాల‌ని చెప్తున్నారు డాక్ట‌ర్లు. తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్ లాంటివి స‌మంగా ఉండేలా చూసుకోవాల‌ని, అవి చాలా ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్‌కు పునాది వేసిన వాళ్లు అవుతారు అని అంటున్నారు. మ‌రోవైపు ఇది కేవ‌లం ఎలుక‌ల మీద జ‌రిపిన రిసెర్చ్ మాత్ర‌మే అని, మున్ముందు మరిన్ని పరిశోధనలు అవసరమని అంటున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఫాస్ట్ ఫుడ్‌ను లొట్టలేసుకుని తింటున్నారా? మీకే కాదు.. మీ ముందు తరాలకూ ముప్పే, ఏం జరుగుతుందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
Embed widget