Radhe Shyam Pre Release: అదీ ప్రభాస్ రేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు యంగ్ హీరో & హాట్ బ్యూటీ రష్మీ యాంకరింగ్!
సుమ, ఉదయభాను, మంజూష, శ్రీముఖి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కు యాంకరింగ్ చేయడం కామన్. ఫర్ ఏ ఛేంజ్... ప్రభాస్ సినిమాకు ఓ యంగ్ హీరో, హీరోయిన్ యాంకరింగ్ చేయనున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'రాధే శ్యామ్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురువారం సాయంత్రం రామౌజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. సాధారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కు సుమ, ఉదయ భాను, మంజూష, శ్రీముఖి వంటి వారు యాంకరింగ్ చేస్తారు. అప్పుడప్పుడూ ప్రదీప్ మాచిరాజు వంటి మేల్ యాంకర్స్ కూడా యాంకరింగ్ చేస్తున్నారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు ఓయంగ్ హీరో, హాట్ బ్యూటీ యాంకరింగ్ చేయనున్నారు.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అతడు 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యాంకర్. అతడితో పాటు హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ కూడా యాంకరింగ్ చేయనున్నారు. రష్మీ ఇలా యాంకరింగ్ చేసిన ఫంక్షన్స్ చాలా అరుదు. ఆమెను తీసుకోవడం వల్ల కొత్త కళ వస్తుందని చెప్పవచ్చు. నవీన్ పోలిశెట్టి తెలుగుకు మాత్రమే కాదు, హిందీ ప్రేక్షకులకూ తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా 'చిచ్చోరే'లో ఆయన నటించారు. ఇంకా మోనోలాగ్ వీడియోలతో పాపులర్ అయ్యారు. రష్మీకి హిందీ, ఇంగ్లిష్ వచ్చు కాబట్టి... నేషనల్ లెవల్ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఫంక్షన్ డిజైన్ చేశారట. అవార్డు ఫంక్షన్లకు హీరోలు యాంకరింగ్ చేస్తుంటారు. ప్రభాస్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఓ హీరో యాంకరింగ్ చేస్తుండటంతో అదీ ప్రభాస్ రేంజ్ అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అన్నట్టు... 'జాతి రత్నాలు' ట్రైలర్ ప్రభాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
పూజా హెగ్డే కథానాయికగా నటించిన 'రాధే శ్యామ్'ను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: పవన్ కల్యాణ్ హీరోగా మేనల్లుడి సినిమాకు సీక్వెల్?
Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి