Ranbir Kapoor & Alia Bhatt: నువ్వెవరు?... రణ్‌బీర్ కపూర్‌ను ప్రశ్నించిన ఆలియా!
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్... ఇద్దరూ లవ్ బర్డ్స్! మరి, రణ్‌బీర్ కపూర్‌ను 'నువ్వెవరు?' అని ఆలియా భట్ ఎందుకు ప్రశ్నించారు? పూర్తి వివరాలకు న్యూస్ చదవండి!
![Ranbir Kapoor & Alia Bhatt: నువ్వెవరు?... రణ్‌బీర్ కపూర్‌ను ప్రశ్నించిన ఆలియా! When Alia Bhatt questioned Ranbir Kapoor 'Who Are You'? Ranbir Kapoor & Alia Bhatt: నువ్వెవరు?... రణ్‌బీర్ కపూర్‌ను ప్రశ్నించిన ఆలియా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/986edca0db1be818403e2c67bec7e474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్... ఇద్దరూ లవ్ బర్డ్స్! ఇద్దరి ప్రేమ కహానీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో 'మీ జీవితం ఆర్ అనే అక్షరం స్పెషల్ కదా' అని విలేకరి అనేసరికి ఆలియా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గు పడింది. అటువంటిది రణ్‌బీర్ కపూర్‌ను 'నువ్వెవరు?' అని ఆలియా భట్ ఎందుకు ప్రశ్నించారు? అంటే... 'బ్రహ్మాస్త్ర' మోషన్ పోస్టర్ దగ్గరకు వెళ్లాలి.
'బ్రహ్మాస్త్ర' మోషన్ పోస్టర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. అందులో రణ్‌బీర్ కపూర్‌ను సూపర్ హీరో శివగా పరిచయం చేశారు. "భూమ్మీద ఏదో అద్భుతం జరగబోతోంది ఇషా! సామాన్య మనుషుల ఊహా శక్తికి అతీతంగా... ఏదో శక్తి, ఏదో అస్త్రం వస్తోంది" అని రణ్‌బీర్ చెబుతారు. అప్పుడు ఆలియా భట్ "ఇదంతా నీకే ఎందుకు కనిపిస్తోంది? తుమ్ హో కౌన్ శివ (నువ్వెవరు శివ)?" అని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత రణ్‌బీర్ చేతిలో జ్వలిస్తున్న త్రిశూలం, అతని వెనుక శివుడు... మొత్తం మీద మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
రణ్‌బీర్ కపూర్, ఆలియాతో పాటు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దీనికి నిర్మాత. 'వేకప్ సిద్', 'ఏ జవానీ హై దివానీ' సినిమాల తర్వాత రణ్‌బీర్ కపూర్ హీరోగా అతని స్నేహితుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రమిది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్టు మోషన్ పోస్టర్ లో వెల్లడించారు. మూడు భాగాలుగా 'బ్రహ్మాస్త్ర'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ రోజు విడుదల అయింది ఫస్ట్ పార్ట్ మోషన్ పోస్టర్.
View this post on Instagram
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: ఎందుకీ తెల్లగెడ్డం రాజమౌళి? నాతో సినిమా ఎప్పుడు? - బాలకృష్ణ ప్రశ్న! మీసం తిప్పిన రాజమౌళి!
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)