(Source: ECI/ABP News/ABP Majha)
Ori Devuda: ఓరి దేవుడా... విశ్వక్‌ను అమ్మాయి ఎలా లాగుతుందో చూశారా?
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న సినిమాకు 'ఓరి దేవుడా' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
యువ హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమాకు 'ఓరి దేవుడా' టైటిల్ ఖరారు చేశారు. పి.వి.పి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ఉత్తరాది భామ మిథిలా పాల్కర్ హీరోయిన్. ఈ రోజు (మంగళవారం) హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 'పెళ్లిల్లు స్వర్గంలో నిశ్చయింపబడతాయి' - మోషన్ పోస్టర్ ప్రారంభంలో కనిపించిన లైన్ ఇది. ఆ తర్వాత సూటు, బూటులో విశ్వక్ సేక్ కనిపించారు. సీతాకోక చిలుకను పట్టుకోవడానికి ఆయన పైగి ఎగిరితే... ఆయన్ను పట్టుకుని వెనక్కి లాగుతున్న అమ్మాయిగా మిథిలా పాల్కర్ కనిపించారు.
"స్క్రీన్ నీది. బ్లాస్ట్ నాది. ఓ బ్యాంగ్‌తో పార్టీ స్టార్ట్ అవుతుంది. నా ఆరో సినిమా అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. #VS6 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇదిగో" అని విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. తమిళ సినిమాలో భగవంతుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. తెలుగులో ఎవరు ఆ పాత్ర చేశారో చూడాలి.
View this post on Instagram
తమిళంలో అశోక్ సెల్వన్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్ ఈ 'ఓరి దేవుడా'. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగు సినిమాకూ దర్శకత్వం వహించారు. 'ఓరి దేవుడా'కు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు. పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, 'దిల్' రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా విశ్వక్ సేన్‌కు 6వ సినిమా ఇది.
Also Read: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే.. థ్రిల్లే కాదు.. దిల్ కూడా దోచుకుంటాయ్!
Also Read: 'ఛత్రపతి' హిందీ రీమేక్... లెజండరీ బాలీవుడ్ కమెడియన్‌తో బెల్లంకొండ
Also Read: పూనమ్ పాండే జుట్టు పట్టుకుని గోడకోసి కొట్టిన భర్త, అరెస్టు.. ఎందుకు కొట్టాడంటే..
Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ!
AlsoRead: సిక్స్‌ప్యాక్ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంటకు డడన! 'బంగార్రాజు' లడ్డుండా!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి