Poonam Pandey: పూనమ్ పాండే జుట్టు పట్టుకుని గోడకోసి కొట్టిన భర్త, అరెస్టు.. ఎందుకు కొట్టాడంటే..
బాలీవుడ్ బాంబ్ షెల్ పూనమ్ పాండే మళ్లీ గృహహింసకు గురైంది. భర్త చేతిలో దారుణంగా హింసకు గురైంది.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఎప్పుడో ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈసారి ఆమె భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త సామ్ బాంబేను పోలీసులు అరెస్టు చేశారు. పూనమ్ తీవ్రగాయాలు పాలవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు పోలీసులు. ముఖం భాగంలోనే ఆమెకు తీవ్రంగా దెబ్బలు తాకాయి. అవి తగ్గడానికి చాలా రోజులు పడుతుందని చెబుతోంది పూనమ్. వీరిద్దరికీ పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుంచే మనస్పర్థలు మొదలయ్యాయి. అప్పట్నించి ఏదో ఒక విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి
సామ్ బాంబేకు రెండో భార్య పూనమ్. మొదటి భార్య అల్వీరాతో ఆయన తరచూ ఫోన్లు మాట్లాడేవాడు. ఆ విషయంలో పూనమ్ - సామ్ మధ్య గొడవలు పెరిగాయి. ఇలా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పూనమ్ భర్తతో గొడవపడగా, అతను కోపంతో ఆమె జుట్టుపట్టుకుని గోడకేసి కొట్టాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ ముఖంపై కళ్ల భాగంలో, తల భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆమె కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిరావచ్చు. పూనమ్ ఘటన జరిగిన వెంటనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వెంటనే సామ్ భర్తను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పూనమ్ ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ సామ్ తరచూ తనను కొడుతుంటాడని, తిడుతుంటాడని చెప్పింది. కొట్టాక తిరిగి సారీ చెప్పి తనను కూల్ చేస్తాడని, ప్రతిసారి ఇలాగే జరుగుతోందని చెప్పుకొచ్చింది. కానీ ఈసారి మాత్రం దాదాపు హత్య చేసినంత వరకు వచ్చాడని ఆమె కన్నీరు పెట్టుకుంది.
గతఏడాది సెప్టెంబర్1న పూనమ్-సామ్ ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయి వారం గడవక ముందే పూనమ్ పై చేయిచేసుకున్నాడు సామ్. అప్పుడు కూడా కేసు పెట్టింది పూనమ్. క్షమాపణలు చెప్పి రాజీ కుదుర్చుకోవడంతో ఆ కేసును తీసేసింది నటి. కానీ ఈసారి చావబాదడంతో ఆమె మళ్లీ కేసు పెట్టింది. వీరిద్దరూ దాదాపు రెండేళ్లు సహ జీవనం చేశాకే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు.
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి