అన్వేషించండి

Virupksha Trailer: ఉత్కంఠభరితంగా ‘విరూపాక్ష’ ట్రైలర్ - ఈసారి సాయి ధరమ్‌కు హిట్ పక్కానా?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ ప్రేక్షకుల్లో..

Virupksha Trailer: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ట్రైలర్ రానే వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే హైదరాబాద్‌ లోని ప్రసాద్స్ మల్టీ ప్లెక్స్‌ లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..  ట్రైలర్ చాలా అద్బుతంగా ఉంది. టీజర్ తోనే మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ట్రైలర్ మరింత అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లో రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథలా కనిపిస్తుంది. చాలా వివరాలను చెప్పకుండానే ట్రైలర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచారు మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ట్రైలర్. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ గ్రామంలో ఆకస్మికంగా జరిగే మరణాలు వెనక గల కారణాన్ని కనుగొనే అన్వేషణలో ఉన్నట్లు కనిపిస్తోంది. స్థానికుల మరణాలకు కారణాలు ఏంటి? దీని వెనక ఎవరు ఉన్నారు? వాటిని హీరో ఎలా కనుగొన్నారు వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈసారి సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇక ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండటంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ మధ్య సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి మంచి సూపర్ హిట్ లను అందుకున్నారు. వారిలో బుచ్చిబాబు సనా ‘ఉప్పెన’ సినిమాతో మంచి హిట్ అందుకోగా రీసెంట్ గా శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ దండు వంతు వచ్చింది. అందుకే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాపై మంచి హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన మూవీలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో సాయి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెను కూడా సినిమాలో చాలా గ్లామర్ గా చూపించారు. అలాగే మూవీలో సునీల్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read : అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? షార్ట్ ఫిల్మ్‌కు సినిమాటోగ్రఫీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget