News
News
X

Tamannaah Vijay Varma : తమన్నా బాయ్ ఫ్రెండ్ కామెంట్ చూశారా?

తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరూ లిప్ లాక్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ టాపిక్ ఏంటంటే... విజయ్ వర్మ చేసిన కామెంట్!

FOLLOW US: 
Share:

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah), హైదరాబాదీ యువకుడు & హిందీ సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారా? అంటే... 'ఓ యస్', 'అవును అవును' అని ముంబై జనాలు చెబుతున్నారు. గోవాలో 2023కి ఈ జోడీకి వెల్కమ్ చెప్పారు. వాళ్ళిద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత ఇద్దరి లవ్ గురించి బయటకు వచ్చింది.
 
తాము ప్రేమలో ఉన్నట్లు ఇటు తమన్నా గానీ, అటు విజయ్ వర్మ గానీ చెప్పలేదు. తమ గురించి వస్తున్న వార్తల పట్ల స్పందించలేదు. అయితే... 'లస్ట్ స్టోరీస్ 2' ఈ జోడీ మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైందని బాలీవుడ్ టాక్. అందులో ఇద్దరు నటిస్తున్నారు. గోవా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇటీవల ఓ కార్యక్రమానికి ఇద్దరు అటెండ్ అయ్యారు. అది పక్కన పెడితే... విజయ్ వర్మ చేసిన ఓ కామెంట్ కారణంగా మళ్ళీ ఇద్దరూ వార్తల్లోకి వచ్చారు.
 
తమన్నా వీడియోకి ఫైర్ ఎమోజీలు ఇటీవల తమన్నా ఓ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కింద విజయ్ వర్మ కామెంట్ చేశారు.

రెండు ఫైర్ ఎమోజీలు విజయ్ వర్మ పోస్ట్ చేశారు. వాటి పక్కన మంటల్ని ఆర్పే సిలిండర్ ఒకటి, పక్కన ఫైర్ ఇంజిన్ ఒకటి పోస్ట్ చేశారు. తమన్నా వేడి పెంచేస్తున్నారని, వాటిని ఆర్పడానికి ఫైర్ ఇంజిన్లు కావాలనేది ఆయన ఉద్దేశం. 
విజయ్ వర్మ కామెంట్ కింద వింత వింత రియాక్షన్లు వస్తున్నాయి. 'తమన్నాను వదిలేయ్ రా బాబు' అని ఒకరు రిప్లై ఇస్తే... 'విజయ్ వర్మను వదిలేయ్' అంటూ తమన్నాకు సలహా ఇచ్చారు ఒకరు. కొంత మంది 'డార్లింగ్స్' అంటున్నారు. ఒకరు విజయ్ వర్మను బావ అన్నారు కూడా!

Also Read : విజయ్ దేవరకొండకు గట్టిగా ఒక్కటి ఇచ్చిన రష్మిక?

హిందీలో 'పింక్' సినిమాతో విజయ్ వర్మ గుర్తింపు తెచ్చుకున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన 'గల్లీ బాయ్‌'లో కూడా ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. గత ఏడాది ఆలియా భట్‌కు జోడీగా నటించిన 'డార్లింగ్స్‌' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అందులో శాడిస్ట్‌ ప్రేమికుడు, భర్తగా విజయ్‌ వర్మ నటన జనాలను ఆకట్టుకుంది. అతడు పుట్టింది, పెరిగిందీ ఇక్కడే. అతడిది మార్వాడీ ఫ్యామిలీ. సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. నాని హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో విలన్ రోల్ చేశాడు. విజయ్ వర్మ నటించిన తెలుగు సినిమా అదొక్కటే. తమన్నా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు పదేళ్ళుగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. వీ

పెళ్ళి వార్తలు ఖండించిన తమన్నా!
తమన్నా త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారని, ముంబైకు చెందిన ఓ యువ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించారు. ''ఏంటి? నేను పెళ్లి చేసుకోబోతున్నానా? సీరియస్‌లీ??'' అని తమన్నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తొలుత తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరో స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ''నాకు కాబోయే భర్త, వ్యాపారవేత్తను పరిచయం చేస్తున్నాను. చూడండి'' అని వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎవరు ఉన్నారో తెలుసా? 'ఎఫ్ 3'లో కొంత సేపు ఆమె మగరాయుడి వేషం వేశారు కదా! ఆ గెటప్ అది! దాంతో తమన్నా పెళ్లి అంటూ వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు మాత్రమేనని ఆవిడ స్పష్టం చేసినట్టు అయ్యింది.

Also Read : హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంటే చెప్పు - రాజమౌళికి 'అవతార్' డైరెక్టర్ ఆఫర్

ప్రస్తుతం తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' చేస్తున్నారు. అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న చిత్రమిది. తమిళంలో రజనీకాంత్ 'జైలర్' సినిమాలో నటిస్తున్నారు. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు. 

Published at : 21 Jan 2023 03:54 PM (IST) Tags: Tamannaah Vijay Varma Vijay Varma Comment Tamannaah Vijay Varma

సంబంధిత కథనాలు

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Rashmika Mandanna: ఔను, ఇద్దరం వెకేషన్‌కు వెళ్లాం, కానీ - విజయ్‌తో ప్రేమాయణంపై రష్మిక కామెంట్స్

Rashmika Mandanna: ఔను, ఇద్దరం వెకేషన్‌కు వెళ్లాం, కానీ - విజయ్‌తో ప్రేమాయణంపై రష్మిక కామెంట్స్

టాప్ స్టోరీస్

Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ

Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ

Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక

Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక

Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్

Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్