By: ABP Desam | Updated at : 21 Jan 2023 02:00 PM (IST)
జేమ్స్ కెమరూన్, సుజీ, రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి హాలీవుడ్ సినిమా చేసే రోజు ఎంత దూరంలో లేదు. తాను త్వరలో చేయబోయే ఓ సినిమా కోసం ఆల్రెడీ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ సీఏఏతో ఆయన ఓ ఒప్పందం చేసుకున్నారు. అది సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా అని, దానికి హాలీవుడ్ రైటర్లు, టెక్నీషియన్లు వర్క్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
హాలీవుడ్ ఏజెన్సీని రాజమౌళి సంప్రదించడం కాదు... రాజమౌళికి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నుంచి ఆఫర్ వచ్చింది. ''హాలీవుడ్‌లో సినిమా చేయాలని ఉంటే చెప్పు... మాట్లాడుకుందాం'' అని రాజమౌళి చెవిలో జేమ్స్ కామెరూన్ చెప్పారు. అదీ సంగతి.
'టెర్మినేటర్', 'టైటానిక్' నుంచి లేటెస్ట్ 'అవతార్' వరకు జేమ్స్ కెమరూన్ తీసిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వేల కోట్ల రూపాయల వసూళ్ళు సాధించాయి. ఆయన నుంచి రాజమౌళికి ఆఫర్ రావడం అంటే చాలా గొప్ప విషయం. భారతీయ ప్రేక్షకులు గర్వించాల్సిన విషయం.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుకలో జేమ్స్ కామెరూన్, రాజమౌళి కాసేపు మాట్లాడుకున్నారు. తాను 'ఆర్ఆర్ఆర్' సినిమాను రెండుసార్లు చూసినట్టు కామెరూన్ వెల్లడించారు. ఆయన ప్రశంసతో రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. ఆ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి ఆ వీడియో చివర ఏం ఉందో... మళ్ళీ ఇంకో వీడియో వచ్చింది. అందులో ఈ ఆఫర్ గురించి ఉంది. అంతకు ముందు ఏం జరిగిందనే విషయంలోకి వెళితే...
Also Read : 'మిషన్ మజ్ను' రివ్యూ : రష్మిక 'మజ్ను' గురి తప్పిందా? బావుందా?
"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻
— RRR Movie (@RRRMovie) January 21, 2023
Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2
నమ్మలేకపోతున్నా : జేమ్స్ కెమరూన్ మీటింగ్ తర్వాత రాజమౌళి
''జేమ్స్ కామెరూన్ 'ఆర్ఆర్ఆర్' చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. తన భార్య సుజీని కూడా సినిమా చూడాలని చెప్పారు. ఆమెతో కలిసి రెండోసారి చూశారు. నాతో సినిమా గురించి విశ్లేషిస్తూ మాట్లాడారు. పది నిముషాలు మాట్లాడాను. మాకు ఆయన అంత టైమ్ ఇచ్చారనే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన చెప్పినట్టు నేను ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్నాను'' అని రాజమౌళి ట్వీట్ చేశారు.
నా సంగీతం గురించి మాట్లాడారు : కీరవాణి
'ఆర్ఆర్ఆర్' సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సైతం జేమ్స్ కామెరూన్ ప్రశంసించారు. ''జేమ్స్ కామెరూన్ నా నేపథ్య సంగీతం గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. నాలో సంతోషం, ఉత్సాహం సముద్రమంత ఉంది'' అని కీరవాణి ట్వీట్ చేశారు.
Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో రాజమౌళి, కీరవాణి ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ను కలిశారు. ఆయనతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ''నేను ఇప్పుడే దేవుడిని కలిశా'' అని సోషల్ మీడియాలో ఎస్.ఎస్. రాజమౌళి ఒక పోస్ట్ చేశారు. 'నాటు నాటు...' పాట నచ్చిందని స్టీవెన్ స్పీల్‌బర్గ్ చెప్పడం నమ్మలేకపోతున్నాని కీరవాణి ట్వీట్ చేశారు.
రెండు విభాగాల్లో ‘RRR’కు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు
దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ సినిమా, తాజా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుకల్లోనూ దుమ్మురేపింది. బెస్ట్ మ్యూజిక్ కేటగిరీతో పాటు, బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరీల్లో ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు’లను దక్కించకుంది.
MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్
Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్
Nani 30 Opening : ఫిబ్రవరిలో సెట్స్‌కు నాని మృణాల్ సినిమా - జనవరి 31న 30వ సినిమా ఓపెనింగ్
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?