అన్వేషించండి

Vijay Deverakonda – Rashmika: ‘బేబీ’కి రౌడీ బాయ్, రష్మిక మద్దతు, టీజర్ బాగుందంటూ ప్రశంసలు!

ఆనంద్ దేవరకొండ తాజా మూవీ ‘బేబీ’పై రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. టీజర్ షేర్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ ఫెయిర్ గా నిలిచిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరు కలిసి సూపర్ డూపర్ హిట్ మూవీ ‘గీత గోవిందం’తో పాటు ‘డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. వీరిద్దరు వెండి తెరపై చక్కటి నటన కనబర్చారు. తమ అందంతో పాటు అభినయంతో రష్మిక ప్రేక్షకులను ఎంతో అలరించింది. కొంత కాలంగా ఈ జంటపై అనేక రూమర్స్ వస్తున్నాయి. ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని, ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై విజయ్, రష్మిక ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే, ఈ ఊహాగానాలు నిజమే అనేలా ఉంది ఈ జంట తీరు. తాజాగా వీరిద్దరు కలిసి మాల్దీవులు వెకేషన్ లో ఎంజాయ్ చేశారు. తరుచుగా వీరిద్దరు కలిసి మీడియా కంట పడుతూనే ఉన్నారు.

బేబీకి విజయ్, రష్మిక ఆల్ ది బెస్ట్

తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘బేబీ’. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ప్రేక్షకుల నుంచి ఈ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ‘బేబీ’ సినిమా టీజర్ లింక్ ను షేర్ చేశాడు. ‘ సో ఎగ్జైటెడ్ ఫర్ దిస్ బేబీ’ అని క్యాప్షన్ పెట్టాడు.   అటు రష్మిక మందన్న కూడా ‘బేబీ’ సినిమా టీజర్ ను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఆనంద్ దేవరకొండతో పాటు, సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. ‘యు గైజ్ దిస్ ఈజ్ సో గుడ్. ఆల్ ది బెస్ట్’ అని రాసింది.

ఇక ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమాలో పట్టణ యువకుడి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్యారెక్టర్లు చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. వీరి ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సినిమాలు

పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ చివరిసారిగా కనిపించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కొద్ది రోజులుగా విరామంలో ఉన్నాడు. ప్రస్తుతం సమంతాతో కలిసి రొమాంటిక్ కామెడీ సినిమా ‘కుషీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అటు రష్మిక మందన్న ‘పుష్ప’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘పుష్ప-2తో పాటు ‘వారిసు’ సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ  సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం’ మిషన్ మజ్ను’, ‘యానిమల్‌’ సినిమాల్లో నటిస్తోంది.

Read Also: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ పెళ్లైన వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget