అన్వేషించండి

Manushi Chhillar: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ పెళ్లైన వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందా?

మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్.. ఇప్పటికే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తాజాగా ఈమె ఓ పెళ్లైన వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

2017లో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుని ఒక్కసారిగా పాపులర్ అయ్యిది మానుషి చిల్లర్. హర్యానాకు చెందిన మానుషి 67వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఇండియా తరఫున ఈ కిరీటం అందుకున్న ఆరో బ్యూటీగా నిలిచింది. మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్షయ్ కుమార్ తో కలిసి ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ అనే సినిమా చేసింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.   

తెలుగులో ఛాన్స్ కొట్టేసిన మానుషి!

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఓ టాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా కోసం తనను ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.   వరుణ్ తేజ్ కెరీర్ లో 13వ సినిమాగా ఈ చిత్రం రూపొందబోతోంది. వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. భారతీయ వాయుసేన కథాంశంతో, వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ అధికారికగా కనిపించనున్నాడు. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌‌‌‌ సంస్థ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది.  అటు ఈ సినిమాతో పాటు మానుషి ప్రస్తుతం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘తెహ్రాన్‌’ అనే సినిమాల్లో నటిస్తోంది.

వ్యాపారవేత్తతో కామత్ తో మానుషి డేటింగ్

కాసేపు ఈమె సినిమాల గురించి పక్కన పెడితే ఆమెకు సంబంధించిన ఓ వార్త సినీ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వ్యాపారవేత్త నిఖిల్ కామత్‌ తో ఈమె డేటింగ్  చేస్తున్నట్లు సమాచారం. 2021 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. మానుషి- నిఖిల్ చాలా కాలంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారట. ప్రస్తుతం మానుషి సినిమా కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తన ప్రేమ గురించి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అంతేకాదు, వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబ సభ్యులకు తెలుసట. అంతేకాదు, వారు వీరి పెళ్లికి కూడా అంగీకారం చెప్పినట్లు కొన్ని న్యూస్ పోర్టల్స్ వెల్లడిస్తున్నాయి.

పెళ్లై విడాకులు తీసుకున్న నిఖిల్ కామత్

వాస్తవానికి మానుషి- నిఖిల్ చాలా కాలంగా ప్రేమలో ఉండటంతో పాటు తరుచుగా ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. తాజాగా ఈ జంట రిషికేష్ ను సందర్శించింది.   అయితే, కామత్ కు ఇప్పటికే పెళ్లై విడిపోయాడు.  2019లో ఇటలీలోని ఫ్లోరెన్స్‌ లో అమండా పురవంకరను వివాహం చేసుకున్నారు. కేవలం ఏడాది కాలంలోనే వీరి సంసార జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కామత్ మానుషితో డేటింగ్ చేస్తున్నాడట.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikhil Kamath (@nikhilkamathcio)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Dragon Movie - NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Dragon Movie - NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
Amazon Black Friday Sale 2024: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Pushpa 2 Pre Release Event: హైదరాబాద్‌లో పుష్ప 2 భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్... పోలీస్ పర్మిషన్ వచ్చేసింది - ఎప్పుడు? ఎక్కడ అంటే?
హైదరాబాద్‌లో పుష్ప 2 భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్... పోలీస్ పర్మిషన్ వచ్చేసింది - ఎప్పుడు? ఎక్కడ అంటే?
Raj Kundra News: చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
Embed widget