News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vijay Devarakonda: 'నాతో బెడ్ షేర్ చేసుకుంది ఎవరో తెలుసా..?' విజయ్ ట్వీట్ వైరల్.. 

తాజాగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఓపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా 'పుష్పక విమానం' అనే సినిమాను నిర్మించాడు విజయ్ దేవరకొండ. దీంతో కొన్ని రోజులుగా 'పుష్పక విమానం' ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు మన రౌడీ హీరో. దీపావళి రోజు బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ పై ఈ సినిమాను ప్రమోట్ చేశారు. రీసెంట్ గా దేవరకొండ బ్రదర్స్ ఇద్దరూ కలిసి సరదాగా చాట్ లో పాల్గొన్నారు. ఈ సెషన్ లో విజయ్ తనకు బ్రేకప్ జరిగిందని చెప్పి వార్తల్లో నిలిచాడు. 

Also Read: 'శ్యామ్ సింగరాయ్' రీమేక్ లో హృతిక్ రోషన్.. నిజమేనా..?

ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ఓ పోస్ట్ పెట్టారు. 'Guess who is sharing the bed with me today' అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో విజయ్ తో పాటు మరొక వ్యక్తి బెడ్ పై ఉన్నాడు. నవంబర్ 8, వైజాగ్ లో ఒక హోటల్ లో నాతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా అంటూ ఆనంద్ దేవరకొండని చూపించాడు విజయ్. 'హే సుందర్.. నీ పెళ్లామేది.. ఇక్కడేం చేస్తున్నావ్..?' అంటూ పడుకున్న ఆనంద్ ని నిద్రలేపే ప్రయత్నం చేశాడు విజయ్. దీంతో ఇరిటేట్ అయిన ఆనంద్.. స్టాప్ ఇట్ అంటూ మళ్లీ పడుకోబోయాడు. కానీ విజయ్ మళ్లీ మళ్లీ 'నీ వైఫ్ ఎక్కడ..? ఈ బెడ్ పై ఎందుకు ఉన్నావ్..?' అని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. దీంతో ఆనంద్ దేవరకొండ 'లేచిపోయిందిరా బయ్' అంటూ బదులిచ్చాడు. సినిమా ప్రమోషన్స్ కోసం వెరైటీగా ప్లాన్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 

'దొరసాని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. ఆ తరువాత 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో హిట్ అందుకున్నాడు. ఈసారి 'పుష్పక విమానం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబరు 12న ఈ సినిమా విడుదల కానుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. 

Published at : 09 Nov 2021 05:57 PM (IST) Tags: Vijay Devarakonda Pushpaka Vimanam anand devarakonda Pushpaka Vimanam movie Pushpaka Vimanam Promotions

ఇవి కూడా చూడండి

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా రనౌత్‌ పోటీ చేస్తుందా? వైరలైన పోస్టర్‌, మరి అసలు నిజం ఏమిటి?

Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా రనౌత్‌ పోటీ చేస్తుందా? వైరలైన పోస్టర్‌, మరి అసలు నిజం ఏమిటి?

టాప్ స్టోరీస్

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!

Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!