Bichagadu: విజయ్ ఆంటోనీ అభిమానులకు గుడ్ న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘బిచ్చగాడు’
విజయ్ ఆంటోని బ్లాక్ బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’ రీరిలీజ్ కాబోతోంది. ఈ నెల 15న మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది.
తమిళ నటుడు విజయ్ ఆంటోనికి సౌత్ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా తెరకెక్కిన పలు సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. విజయ్ కి హీరోగా మంచి బూస్టింగ్ ఇచ్చిన సినిమా ‘బిచ్చగాడు’. 2016లో విడుదలైన ‘పిచ్చైకారన్’ అనే తమిళ చిత్రానికి ఇది తెలుగు అనువాదంగా వచ్చింది. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ హీరో, హీరోయిన్లుగా నటించారు.
సంచలన విజయాన్ని అందుకున్న ‘బిచ్చగాడు’
2016లో విడుదలైన ‘పిచ్చైకారన్’ సంచలన విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. భారీ విజయం సాధించింది. ఇదే మూవీని తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో విడుదల చేశాడు. విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసంతో విజయ్ మెప్పించాడు. ఆ టైటిల్ చూసి మొదట్లో అంతా ఇదేం పేరు అనుకున్నారు. కానీ, సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజయ్ నటనకు ఫిదా అయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందించారు.
సెప్టెంబర్ 15న ‘బిచ్చగాడు’ రీరిలీజ్
సంచలన విజయాన్ని అందుకున్న ‘బిచ్చగాడు’ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. చదలవాడ తిరుపతి రావు సమర్పణలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తమిళంలో మార్చి 4, 2016 న విడుదలైంది. తెలుగులో మే 13, 2016 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అందరినీ చక్కగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో విజయ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
An Exciting Update!!
— Sai Satish (@PROSaiSatish) September 9, 2023
The sensational #Bichagadu set for re-release in cinemas for #VinayakaChaturthi on Sep 15th@sttvfilms is bringing the massive blockbuster again for the Telugu audience#SriTirumalaTirupatiVenkateswaraFilms@vijayantony #SatnaTitus#DirectorSasi… pic.twitter.com/C0knIJVJqv
ప్రేక్షకులను అలరించిన ‘బిచ్చగాడు -2’
అటు ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘బిచ్చగాడు -2’ రీసెంట్ గా విడుదలైంది. హీరో విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్ పై ఆయనే స్వయంగా నిర్మించారు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది. విడుదలైన అన్ని చోట్లా అద్భుత విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ దుమ్మురేపింది. 'బిచ్చగాడు 2' చిత్రానికి అన్నీ తానై నడిపించాడు విజయ్ ఆంటోనీ. హీరోగా నటించడమే కాదు, స్వయంగా స్టోరీ రాసుకుని డైరెక్టర్ గా మారాడు. మ్యాజిక్, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. దేవ్ గిల్, రాధా రవి, వై జి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడి, జాన్ విజయ్, యోగి బాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఓం నారాయణ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Read Also: క్రేజీ న్యూస్ చెప్పిన ‘పెదకాపు’ మేకర్స్ - ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial