Vicky Katrina Wedding: ఇప్పటికే భార్యాభర్తలుగా మారిపోయిన విక్కీ- కత్రినా?
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ఇద్దరు అధికారికంగా మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు.
![Vicky Katrina Wedding: ఇప్పటికే భార్యాభర్తలుగా మారిపోయిన విక్కీ- కత్రినా? Vicky-Katrina who have already become husband and wife? Vicky Katrina Wedding: ఇప్పటికే భార్యాభర్తలుగా మారిపోయిన విక్కీ- కత్రినా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/06/11ef7b756b33f6e100794190304948ef_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బాలీవుడ్‌లో హీరోహీరోయిన్లు జంటలుగా మారడం సహజమే. ఇప్పటికే ఎన్నో జంటలు ఉన్నాయి. కాజోల్ - అజయ్ దేవగణ్, దీపికా పడుకునే-రణ్ వీర్, అభిషేక్ - ఐశ్వర్య, సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్ ఇలా చాలా మంది పెళ్లి చేసుకున్నారు. అతి త్వరలో వీరి జాబితాలోకి విక్కీ-కత్రినా జంట కూడా చేరిపోనుంది. డిసెంబర్ 9న వీరిద్దరి వివాహం రాజస్థాన్లో జరగనుంది. అయితే ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు సమాచారం. అంటే వివాహ సమయానికి వీరిద్దరూ అధికారికంగా భార్యభర్తల కిందే లెక్క.
విక్కీ తండ్రి శ్యామ్ కౌశల్ ఇప్పటికే తన ఇంటి వెలుపల ఉన్న ఫోటోగ్రాఫర్లకు, తెలిసిన వారికి రిజిస్టర్ మ్యారేజ్ అయిన సందర్భంగా స్వీట్ బాక్సులు పంచిపెట్టినట్టు సమాచారం. వివాహ నమోదు ప్రక్రియ పూర్తయిన సందర్భంగానే ఆయన స్వీట్లు పంచినట్టు భావిస్తున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ తాలూకు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి విక్కీ-కత్రినా జంట కోర్టును ఆశ్రయించినట్టు గత వారమే వార్తలు వచ్చాయి. అయితే కోర్టు చుట్టూ మీడియా హడావిడి ఎక్కువగా ఉండడంతో రిజిస్ట్రార్‌ను విక్కీ ఇంటికి పిలిపించి తతంగం పూర్తి చేసినట్టు సమాచారం. గత వారం కత్రినా, తన తల్లి, చెల్లితో విక్కీ ఇంట్లోకి వెళుతూ కనిపించింది.
విక్కీ-కత్రినా కలిసి డిసెంబర్ 6 తరువాత కుటుంబసభ్యులతో కలిసి రాజస్థాన్ కు వెళ్లనున్నారు. వీరిద్దరి వివాహం ఈ ఏడాది బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ కానుంది. అయితే పెళ్లి వివరాలను గోప్యంగా ఉంచడం మాత్రం అభిమానులను నిరాశపరుస్తోంది. వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్ లో జరగనుంది.
డిసెంబర్ 7న సంగీత్, 8వ తేదీన మెహెందీ ఫంక్షన్, 9న వివాహం జరగనుంచి . 10న రిసెప్షన్ తో పెళ్లి వేడుక పూర్తి కానుంది. Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్
Also Read: విలన్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)