అన్వేషించండి

Veeranjaneyulu ViharayatraTrailer: గోవాలో అస్తికలు కలపడం ఏంటి గురూ, నవ్విస్తూనే, కంటతడి పెట్టిస్తున్న ‘వీరాంజనేయులు విహార యాత్ర’ ట్రైలర్‌

సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజాగా చిత్రం ‘వీరాంజనేయులు విహార యాత్ర’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. నవ్విస్తూనే, ఏడిపిస్తూ ఆకట్టుకుంటుంది.

Veeranjaneyulu ViharayatraTrailer Out: సీనియర్ నటుడు వీకే నరేష్, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరాంజనేయులు విహార యాత్ర’.  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రానికి  అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నన ఈ సినిమా.. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరోలు వెంకటేష్, శ్రీవిష్ణు, సందీప్ కిషన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  

నవ్విస్తూనే ఏడిపించిన ‘వీరాంజనేయులు విహార యాత్ర’ ట్రైలర్

'ప్రియాతిప్రియమైన కుటుంబ సభ్యులకు మీ వీరాంజనేయులు ప్రేమతో రాయునది. ఆఖరి కోరికగా కుటుంబం అంతా గోవాలో నా ఆస్తికలు కలుపుతారని నమ్ముతున్నాను' అంటూ వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ షురూ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, కథలోని ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించారు. కుటుంబ సభ్యులంతా కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ అనురాగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక నిమిషం పాటు ఈ ట్రైలర్ సరదా సరదాగా కొనసాగుతుంది. ఆ తర్వాత అసలు ట్విస్టులు మొదలవుతాయి. అప్పటి వరకు నవ్వించిన ట్రైలర్, సీరియస్ నెస్ క్రియేట్ ఏస్తుంది. ఇంతకీ అసలు ఆ ట్విస్ట్ ఏంటి?  తండ్రి అస్తికలను కలపడానికి నరేష్ గోవాకే ఎందుకు వెళ్లాలనుకుంటాడు? అనేది సినిమాలో చూపించనున్నారు.

ఫీల్ గుడ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కలిగిస్తున్న ట్రైలర్

ఇక ఈ ట్రైలర్ లో నరేష్ సహజ నటన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్‌ పాత్రలు కూడా ఆసక్తికరంగా సాగాయి. మ్యూజిక్, విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ బ్రహ్మానందం వాయిస్ హైలైట్ గా నిలుస్తోంది. మొత్తానికి ఫ్యామిలీ ఫన్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ రూపొందించిన ఈ మూవీ ఆడియన్స్ కి ఒక ఫీల్ గుడ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతున్నట్లు అర్థం అవుతోంది.  

‘వీరాంజనేయులు విహార యాత్ర’ ట్రైలర్ గురించి వెంకటేష్ ఏమన్నారంటే?  

‘వీరాంజనేయులు విహార యాత్ర’ ట్రైలర్ సీనియర్ నటుడు వెంకటేశ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. “అస్తికలు గోవాలో కలపడం ఏంట్రా నాయనా? ట్రైలర్ చూస్తుంటే ఫన్ బ్లాస్ట్ లా కనిపిస్తోంది” అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. “మేము ట్రెజర్ కోసం బంగ్లాకి వెళ్తే.. మీరు ఆస్తి(కలు) కోసం గోవా వెళ్తారా?” యంగ్ హీరో శ్రీవిష్ణు ట్రైలర్ షేర్ చేశారు.

Read Also: వారసత్వం అనేది సక్సెస్ ఇవ్వదు- సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Spirit: దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
Janakiram Marella: 'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
Horror Thriller OTT : సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Survival Thriller OTT : ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget