Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!
ఉర్ఫీ జావెద్ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె తన చేతిలో ఉన్న పువ్వును పడేయబోయి.. ఫోన్ పడేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇండియాలో అత్యంత చెత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే మోడల్, నటి ఎవరని అడిగితే.. వెంటనే వచ్చే సమాధానం.. ఉర్ఫీ జావెద్. ఈమెకు బుల్లితెర నటి కంటే.. ఈ చిత్ర విచిత్ర దుస్తులతోనే ఎక్కువ గుర్తింపు లభించింది. ఈ పాపులారిటీ వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమెకు రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సరికొత్తగా ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఈమెకు ఎవరూ పోటీ రాలేరు. అందుకే, 2021లో హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది.
సాధారణంగా ఎక్స్‌పోజింగ్ దుస్తులు వేసుకొనే మోడల్స్ ర్యాంప్ మీద క్యాట్ వాక్‌కే పరిమితం అవుతారు. ఉర్ఫీకి మాత్రం అలాంటి దుస్తులు ధరించి నేరుగా పబ్లిక్‌లోకే వచ్చేస్తుంది. ఆమె ఫోటోలను కెమేరాలో బందించేందుకు బాలీవుడ్ మీడియాకు చెందిన ఫోటోగ్రాఫర్లు బారులు తీరుతారు. తాజాగా ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఉర్ఫీ.. ఒక చేత్తో ఫోన్, మరో చెత్తో గులాబీ పువ్వు పట్టుకుంది. పువ్వుతో సెల్ఫీలు తీసుకుంది. ఆ తర్వాత పువ్వను పడేయాలని అనుకుంది. కానీ, పువ్వుకు బదులు తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను పడేసింది. ఆ వెంటనే ఓ స్కూటీ వచ్చి ఆమె ఫోన్‌ను తొక్కుకుంటూ వెళ్లిపోయింది. అయితే, అది నిజంగా జరిగిందా? లేదా తన వీడియో వైరల్ అవ్వడం కూడా వేసిన ట్రిక్కా అనేది ఉర్ఫికే తెలియాలి. కానీ, నెటిజన్స్ మాత్రం అదంతా డ్రామా అని కొట్టిపడేస్తున్నారు. కొందరు మాత్రం సెల్ఫీ పిచ్చి ముదిరితే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు.
View this post on Instagram