అన్వేషించండి

Upcoming Movies: 'పొన్నియిన్ సెల్వన్', 'విక్రమ్ వేద' - ఈ వారం థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్!

ఈ వారం కొన్ని భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

గత వారం 'అల్లూరి, 'కృష్ణ వ్రింద విహారి' లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. ఇక ఈ వారం కొన్ని భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

'నేనే వస్తున్నా':

తమిళ టాప్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు.  తెలుగులో  'నేనే వ‌స్తున్నా' అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు.  తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను నిర్మించారు. ధ‌నుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్ర‌మ్ హీరోయిన్‌ గా నటిస్తోంది. సెల్వ రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల (సెప్టెంబర్) 29న ఈ సినిమా విడుదల కాబోతుంది.

'పొన్నియిన్ సెల్వన్':

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలుడిగా, జయం రవి అరుణ్ మొళి వర్మగా, ఇంకా కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయరాం, ప్రకాష్ రాజ్, పార్తిబన్ ఇలా భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమా సొంతం. ఇప్పుడున్న ప్యాన్ ఇండియా ట్రెండ్ కు మణిరత్నం సత్తా ఏంటో చాటే మంచి అవకాశంగా సినీ విశ్లేషకులు 'పొన్నియిన్ సెల్వన్'ను భావిస్తున్నారు. 

విక్రమ్ వేద:

కోలీవుడ్ లో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన 'విక్రమ్ వేద'(Vikram Vedha) సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిగిలిన భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో కూడా సినిమా రీమేక్ అవుతుందని అన్నారు. అయితే ముందుగా హిందీ రీమేక్ మొదలైంది. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్నారు. భూషణ్ కుమార్ టీసీరీస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్, ఎస్‌.శ‌శికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఓటీటీ రిలీజెస్:

కెప్టెన్:

తమిళ హీరో ఆర్య నటించిన చిత్రమిది. ఆయన ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు.ఈ సినిమాలో సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. సెప్టెంబర్ 30న జీ5లో ఈ సినిమాలో ప్రసారం కానుంది. 

కోబ్రా:

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా నటించిన సినిమా 'కోబ్రా' (Cobra Movie). ఇందులో 'కెజియఫ్ 2' (KGF 2 Movie) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. ఆగస్టు 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 28న సోనీ లివ్ లో విడుదల కానుంది. 

777 చార్లి:

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం '777 చార్లి'. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. ప్రతి భాషలోనూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. జూన్ 10న విడుదలైన సినిమా కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లింది. దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. 

ఇక నెట్ ఫ్లిక్స్ లో 'బ్లాండీ' సెప్టెంబర్ 28న, 'ప్లాన్ A ప్లాన్ B' సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్ కానున్నాయి. 

హాట్ స్టార్ లో 'కర్న్ యుద్ద్' అనే వెబ్ సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget