Unstoppable With NBK 2 : అన్‌స్టాపబుల్ - రెండో సీజన్ ఎప్పట్నించి స్టార్ట్ అవుతుందంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' ఇప్పుడు రెండో సీజన్‌కు రెడీ అయ్యింది. రెండో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్ విడుదలకు స్పెషల్ డేట్ సెలెక్ట్ చేశారట.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లో చిలిపితనాన్ని, ఆయన ఎంత సరదాగా ఉంటారు? అనే విషయాన్నీ ప్రేక్షకులకు తెలిసేలా చేసింది 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable With NBK). 'ఆహా' ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో రెండో సీజన్‌కు బాలకృష్ణ, ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అయ్యారు.
విజయ దశమికి సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్!
విజయ దశమికి నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే... ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళింది. అలాగని, నట సింహం ఫ్యాన్స్ నిరాశ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2' (Unstoppable With NBK Season 2) రూపంలో కానుక రెడీగా ఉంది. ఈ రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను విజయ దశమికి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట!
చిరంజీవితో సెకండ్ సీజన్ స్టార్ట్?
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి, రష్మికా మందన్నా తదితరులు సందడి చేశారు.
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2'లో ఎవరెవరు సందడి చేయనున్నారు? అనే ఆసక్తి వీక్షకులలో ఉంది. అంత కంటే ముందు... ఎవరితో స్టార్ట్ కానుంది? అనే విషయం కూడా క్యూరియాసిటీ కలిగిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... తొలి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారట (Unstoppable With NBK 2 To Start With Chiranjeevi Episode). ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. అందువల్ల, ఆయన్ను తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ సీజన్‌లో చిరంజీవి సందడి చేయాల్సి ఉంది. అయితే... మిస్ అయ్యింది.
ఫస్ట్ ఎపిసోడ్ కంటే ముందు స్పెషల్ ప్రోగ్రామ్?
విజయ దశమి కంటే ముందు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సెకండ్ సీజన్ గురించి వివరించాలని 'ఆహా' ఓటీటీ బృందం భావిస్తోందట. కర్టైన్ రైజర్ తరహాలో! దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మహేష్, బన్నీ... రెండోసారి?
తొలి సీజన్‌లో సందడి చేసిన మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు రెండో సీజన్‌లో కూడా సందడి చేయనున్నారని టాక్. ఫస్ట్ సీజన్ సాధించిన విజయం కారణంగా రెండో సీజన్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. అందువల్ల, ఈసారి మరింత వినోదాత్మకంగా, కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
Also Read : రాజశేఖర్ - పవన్ సినిమా మొదలు
సినిమాలకు వస్తే... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అంగీకరించారు.
Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ