Rajasekhar Pawan Movie : రాజశేఖర్ - పవన్ సినిమా మొదలు
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, పవన్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఆ సినిమా ప్రారంభమైంది.
![Rajasekhar Pawan Movie : రాజశేఖర్ - పవన్ సినిమా మొదలు Rajasekhar Pavan Movie Officially Launched Action Genre Film Titled As Monster Rajasekhar 92nd Movie Rajasekhar Pawan Movie : రాజశేఖర్ - పవన్ సినిమా మొదలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/7495dd72a20a8d4d02d75b04b3a480bb1661238616076313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) యాక్షన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadineni) తో ఆయన ఒక సినిమా చేస్తున్నారు. అది రాజశేఖర్‌కు 92వ సినిమా (RS92 Movie Update). సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
రాజశేఖర్, పవన్ సాధినేని కలయికలో సినిమా గురించి కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినబడుతోంది. ఇప్పుడు ఆ సినిమాను దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. యాంగ్రీ స్టార్‌తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతే కాదు... 'టైటిల్ ఏంటో చెప్పుకోండి చూద్దాం' అంటూ ప్రేక్షకులకు పజిల్ విసిరారు.
''నేను 'సేనాపతి' సినిమాతో యాక్షన్ ఫ్లేవర్ రుచి చూశా. నాకు అది నచ్చింది. ఇప్పుడు యాక్షన్ మీద నాకు మరింత ప్రేమ పెరిగింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌తో నేను చేయబోయే సినిమా యాక్షన్ ప్రేమికులకు పండగ. డాక్టర్ రాజశేఖర్ గారు తన పూర్వ వైభవం కోసం, దాన్ని మళ్ళీ తీసుకు రావాలనే కోపంతో తిరిగి వస్తున్నారు'' అని పవన్ సాధినేని పేర్కొన్నారు.
Rajasekhar New Movie Titled As Monster : రాజశేఖర్ - పవన్ సాధినేని సినిమాకు 'మాన్‌స్టర్' టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. దర్శకుడు విడుదల చేసిన పోస్టర్‌లో 'Monster' అక్షరాలను హైలైట్ చేశారు. మల్కాపురం శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : విజయ్ దేవరకొండకు రింగ్ తొడిగింది, హగ్ చేసుకుని ఏడ్చింది - రౌడీ బాయ్‌కు దిష్టి తగలకూడదని
జిబ్రాన్ సంగీతంలో...
రాజశేఖర్ 92వ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. 'రన్ రాజా రన్' ద్వారా తెలుగులో ఆయన పాపులర్ అయ్యారు. ఆయన సంగీతం అందించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదం అయ్యాయి. ఆ తర్వాత ప్రభాస్ 'సాహో' సహా కొన్ని తెలుగు సినిమాలకూ సంగీతం అందించారు. ఇప్పుడు రాజశేఖర్ సినిమాకు పని చేస్తున్నారు.
'శేఖర్'తో ప్రయోగం చేసిన రాజశేఖర్
కరోనా తర్వాత రాజశేఖర్ నుంచి 'శేఖర్' సినిమా వచ్చింది. అందులో ఆయన పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో నటించగా... శ్రీమతి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. మలయాళ సినిమా ఆధారంగా రూపొందిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే... రాజశేఖర్ మేకోవర్ ప్రేక్షకుల దృష్టిలో పడింది. అందులో ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు. యాక్షన్ ఇమేజ్ పక్కన పెట్టి సినిమా చేశారు. ఈసారి మాత్రం తనకు విజయాలతో పాటు ఇమేజ్ తీసుకు వచ్చిన యాక్షన్ జానర్ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో యువ హీరో రాజ్ తరుణ్, రాజశేఖర్ కుటుంబ సభ్యులు సందడి చేసినట్లు తెలిసింది.
ఇప్పుడు రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ కలిసి ఒక ఓటీటీ ప్రాజెక్ట్ 'అహ నా పెళ్ళంట' చేస్తున్నారు. ఆల్రెడీ ఆ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - బాయ్‌కాట్‌పై విజయ్ దేవరకొండ
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)