By: ABP Desam | Updated at : 28 Jun 2022 07:33 PM (IST)
మాధవన్ 'రాకెట్రీ' - తెలుగు సాంగ్స్ విన్నారా?
కోలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్.మాధవన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులు. కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు మాధవన్. 'సవ్యసాచి' సినిమాతో నేరుగా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారాయన. ఇప్పటివరకు నటనకు మాత్రమే పరిమితమైన మాధవన్ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మొన్నామధ్య సినిమా ట్రైలర్ ను కూడా వదిలారు. ఇప్పుడు జూలై 1న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి రెండు పాటలను విడుదల చేశారు. 'అలజడి', 'నా జన్మకి' అంటూ సాగే ఈ రెండు పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలను ఆదిత్యరావు ఆలపించగా.. కె రామ్ మనోహర్ లిరిక్స్ అందించారు.
ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని ఇప్పటికే పలుసార్లు చెప్పారు మాధవన్. ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశామని.. అన్ని ప్రాంతాల వారిని కదిలించే విధంగా సినిమా ఉంటుందని ఇదివరకే ఆయన చెప్పారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, సూర్య ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్ గా సెట్స్ లో సూర్య వీడియోను మాధవన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
SSMB28Update: మహేష్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ - సమ్మర్లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!
Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!
Viruman: ప్రభాస్ ఫ్లాప్ సినిమా పాయింట్‌తో కార్తీ సినిమా - సూపర్ హిట్ అయిందే!
Jinthaak Song: దుమ్మురేపుతున్న రవితేజ ఊరమాస్ సాంగ్ 'జింతాక్', స్టెప్పులు అదుర్స్!
Liger: 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!
Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?
Bandi Sanjay : భౌతిక దాడులు ఖాయం - బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక !
AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !
RBI on Payment Systems: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్‌బీఐ సర్వే!