Trinayani, November 23: ఓరినీ.. ప్రసాదంలోకి ఆవు పేడ కలిపి ఇంట్లోవారికి పెట్టిన నయని.. ఆ తర్వాత సీన్ అదుర్స్!
Trinayani serial Today Episode : ఇంట్లో కొత్త చిచ్చు పెట్టడానికి తిలోత్తమ గట్టి ప్లానింగ్ లో ఉండడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Trinayani November 23 Episode : ఈరోజు ఎపిసోడ్ లో నా కూతుర్నే తీసుకెళ్లి పోతావా నీకు ఎంత ధైర్యమే అని అమాంతం పెద్ద బొట్టమ్మ మెడ పట్టుకుంటుంది సుమన.
డమ్మక్క: చిన్నపుత్ర ఈ ఇద్దరి తల్లుల వివాదాన్ని నువ్వే ఆపగలవు
విక్రాంత్: నేనేం చేయగలను?
హాసిని: ఉలూచిని పెద్ద బొట్టమ్మకు ఇచ్చింది నువ్వే కదా ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యు అని అనగా సోఫా మీద పెట్టిన ఆ ఐదు గవ్వలని పట్టుకుందాం అనుకుంటాడు విక్రాంత్. కానీ అందులో ఒక గవ్వ సోఫా కింద పడిపోతుంది దాన్ని డమ్మక్క తీసి ఇస్తుంది. విక్రాంత్ ఐదు గవ్వలని చేతిలో పట్టుకున్న వెంటనే పెద్ద బొట్టమ్మ అందరి కళ్ళ ముందు నుంచి మాయమైపోతుంది.
సుమన: ఏది? ఎక్కడికి మాయమైపోయింది? ఈ రోజు దాని ప్రాణం తీయకుండా వదిలిపెట్టను నా కూతురిని తీసుకెళ్దామని చూస్తుందా?
డమ్మక్క: ఇంక త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు నాగమ్మ అని పెద్ద బొట్టమ్మతో చెప్పగా పెద్ద బొట్టమ్మ కిందకు వెళ్ళిపోతుంది. తన వెనకనే విక్రాంత్ కూడా వస్తాడు.
విక్రాంత్: ఈ తాడు తీసి వెళ్ళు పెద్ద బొట్టమ్మ అని తన చేతిని చూపిస్తాడు.
పెద్ద బొట్టమ్మ: క్షమించు బాబు ఏదో సహాయం చేస్తావని అడిగాను కాని విశాల్ బాబు నిన్నలా కొట్టేస్తారు అని అనుకోలేదు
విక్రాంత్: ఏం పర్లేదులే నీ కూతురు కోసమే కదా అడిగావు
పెద్ద బొట్టమ్మ: ఉలూచి మీ బిడ్డ కూడా కదా బాబు
విక్రాంత్: తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సుమన కూడా ఉంచుకుంటుంది కేవలం డబ్బు కోసం మాత్రమే అని అనగా ఇంతలో నయని, డమ్మక్కలు అక్కడికి వస్తారు
నయని: అంతేనా విశ్రాంత్ బాబు నీకు ఉలూచి కి ఏమాత్రం సంబంధం లేదా? ఒకప్పుడు నా కూతురిని తీసుకొని నీ భార్యకి ఇచ్చి నీ కూతురేనని నమ్మించావు. ఎందుకు ఇలా చేశావు అని అంటే నీ భార్య బాధపడుతుంది అని చెప్పావు. ఇప్పుడు ఏమైపోయిందా బాధ నా చెల్లికి అన్యాయం చేస్తావా? అయినా నువ్వేంటి పెద్ద బొట్టమ్మ నాకు చెప్పకుండా నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు.
పెద్ద బొట్టమ్మ: ఏదో పాపని చూద్దామని ఆత్రుత వచ్చి మమకారంతో ఇలా చేశానమ్మ
డమ్మక్క: నీకు ఎప్పుడూ పాప నీ చూడాలనిపించిన నయనమ్మకు చెప్పు తని ఏదో విధంగా ఏర్పాటు చేస్తాది ఇంక నువ్వు బయలుదేరు అని చెప్పి పెద్ద బొట్టమ్మ ని అక్కడి నుంచి పంపించేస్తుంది.
ఆ తర్వాత సీన్లో వల్లభ హాల్లో జరిగిన సంఘటన అంతటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తిలోత్తమ వస్తుంది.
వల్లభ: మమ్మీ! మమ్మీ! మంచి మసాలా ఎపిసోడ్ ని మిస్ అయిపోయావు మమ్మీ. అసలు విశాల్ విక్రాంత్ ని కొడతాడని కలలో కూడా అనుకోలేదు
తిలోత్తమ: అవునురా. ప్రస్తుతానికి ఎలాగున్నా సరే సుమన పెద్ద బొట్టమ్మ మీద చాలా కోపంగా ఉంది. ఎప్పుడైతే పెద్ద బొట్టమ్మ ఉలూచి తన బిడ్డ కూడా అని చెప్పిందో అప్పటినుంచి మనసులో కోపం పెట్టేసుకుంది. ఇప్పుడు సుమనకి మనం తను ఊహించలేని ఐడియా ఇచ్చి చిచ్చు పెడదాం.
వల్లభ: ఏం ఐడియా మమ్మీ అది?
తిలోత్తమ: ఆ ఐడియా ఇంకా లేతగానే ఉంది రా ముదిరిన తర్వాత చెప్తాను అని అంటుంది తిలోత్తమ.
ఆ తర్వాత సీన్లో గదిలో సుమన బట్టలు కబోర్డ్ లో పెడుతూ ఉంటుంది. పక్కనే విక్రాంత్ కూర్చుంటాడు.
విక్రాంత్: దాహంగా ఉంది కొంచెం మంచినీళ్లు
సుమన: నేను తేను
విక్రాంత్: వినపడలేనట్టుంది వెళ్లి మంచినీళ్లు తే
సుమన: వినపడకపోతే తిరిగి బదులు ఎందుకు ఇస్తాను నేను తేను అని చెప్పి తన పని తను చేసుకుంటూ ఉంటుంది . ఇంతలో హాసిని గదిలోకి వచ్చి విశ్రాంత్ కి మంచినీళ్లు ఇస్తుంది.
సుమన: నా మొగుడు ఇప్పుడే నన్ను అడిగాడు అప్పుడే నీకెలా తెలిసింది. నీళ్ళు కావాలని నాతో మాట్లాడుతూనే ఫోన్లో మెసేజ్ చేసి నిన్ను అడిగాడా?
హాసిని: ఈ మధ్య నీకు అనుమానాలు ఎక్కువైపోతున్నాయి చెల్లి మీ ఇద్దరి సంభాషణ ని బయటనుంచి విన్నాను. మంచినీళ్లే కదా అని తెచ్చి ఇచ్చాను.
సుమన: మరి లేకపోతే నన్ను ఏం చేయమంటావ్ అక్క నా కూతుర్ని నాకే కానివ్వకుండా చేయబోయాడు
హాసిని: నీకు సారీ చెప్పాడు కదా చెల్లి. అప్పటికి విశాల్ అందరి ముందు కొట్టి పరువు పోయినంత పనైనా సరే నోరు కూడా విప్పకుండా భరించాడు. వదిలేయవచ్చు కదా?
సుమన: అక్కడ నష్టం జరిగింది నా బిడ్డకి. అయినా నీకు 50 కోట్లు ఉన్నాయి ఏం చేసినా హాయిగా బతికేయవచ్చు కానీ అక్కడ నా ఏడు కోట్లు తగలబడుతున్నప్పుడు ఏమైపోయారు అందరూ
విక్రాంత్: ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం అంటే అడిగితే ఎవరైనా సహాయం చేస్తారు
సుమన: అయితే అడుక్కోవాలా?
హాసిని: ఇంక ఆ విశాలాక్షి అమ్మవారే నిన్ను కాపాడాలి విక్రాంత్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హాసిని.
ఆ తర్వాత సీన్లో పవన మూర్తి గట్టిగా అరవగా మిగిలిన సభ్యులందరూ హాల్లోకి వస్తారు.
నయని: ఈరోజు గోపాష్టమి అందుకే ప్రసాదం చేశాను అని అందరికీ ఇస్తుంది.
తిలోత్తమా: అయినదానికి కాని దానికి ప్రతి విషయాన్ని పండగలా చేసుకుంటున్నారు. అష్టమి కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు?
డమ్మక్క: కార్తీక మాసంలో వస్తుంది ఈ అష్టమి. ఈ రోజునే గోపాలుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తాడు అందుకే ఈరోజు పూజ చేసి ప్రసాదం చేసింది నయని అని అనగా అందరూ ప్రసాదాన్ని తింటారు. ప్రసాదం రుచి చూసిన ఒక్కొక్కలి మొక్కలు రకరకాలుగా ఉంటాయి.
హాసిని: ఆవు పేడను కూడా ప్రసాదంగా ఇంత బాగా తింటారు అని నేను అనుకోలేదు చెల్లి అని అనగా ఒకేసారి తిలోత్తమ వాళ్ళందరూ దగ్గుతారు.
వల్లభ: ఆవు పేడేంటి?
నయని: గోపాలుడికి ఇష్టమైన గోమూత్రంతో కలిపి మిగిలిన నాలుగు పదార్థాలతో ఈ ప్రసాదాన్ని చేస్తారు. దీన్ని పంచగవ్వ అంటారు. ఇది చాలా మంచిది
సుమన: గోమూత్రం కూడా కలిసిందా ఇందులో?
నయని: ఈ పంచగవ్వ గురించి నీకు చిన్నప్పుడే తెలుసు కదా చెల్లి మరి ఎందుకు ఏం తెలియనట్టు మాట్లాడతావు?
సుమన: నాకేం తెలీదు
విక్రాంత్: చెంచాడు కాదే చెంబుతో తీసి నీ నోట్లో పెడితే మర్చిపోయినవన్నీ తిరిగి గుర్తుకువస్తాయి.
తిలోత్తమ: ఛీ ఛీ నోరుమూయ్ రా అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.