అన్వేషించండి

Trinayani Serial Today October 30th: 'త్రినయని' సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్ విక్రాంత్‌కి నయని తొలిబిడ్డ గురించి తెలుసా.. ఆ కాంతి అర్థమేంటి?

Trinayani Today Episode పునర్జమ్మలో ఉన్న గాయత్రీ దేవి గురించి విక్రాంత్‌కి తెలుసని అమ్మవారు కాంతి విక్రాంత్ మీద వేయడం నయని విక్రాంత్ కాలర్ పట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode అందరూ గుడి దగ్గర ఉంటారు. గాయత్రీ పాప పసి బిడ్డగా ఎలా ఉందో ఇంట్లో వాళ్లకి తెలుసని అహల్య చెప్తుంది. విశాల్, హాసిని చాలా టెన్షన్ పడతారు. ఇప్పటి వరకు చెప్పలేదు  అంటే ఇప్పుడు చెప్తారు అని గ్యారెంటీ ఏంటి అని విశాల్ అడుగుతాడు. తెలిసి కూడా చెప్పకుండా ఉన్నారు అంటే అన్యాయమని మన పట్ల ఎంత ద్వేషం ఉందని నయని విశాల్‌తో అంటుంది.

విక్రాంత్: మనలో మనం ఎన్ని అనుకున్నా లాభం లేదు. నిజం చెప్తామని ముందుకు రావాల్సింది నిజం తెలిసిన వాళ్లే.
నయని: దయచేసి మీలో ఎవరికి తెలుసో నిజం చెప్పండి.
సుమన: అక్కా నువ్వు బాధ పడకు అహల్య అత్తయ్య గారు ఏం చేయాలో మీరే చెప్పండి.
అహల్య: కొబ్బరి కాయ కట్టి హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారు దారి చూపిస్తుంది.
నయని: కొబ్బరి కాయ పట్టుకొని అమ్మా ఇన్నాళ్లు ఎదురు చూసినా సరే బిడ్డ జాడ తెలియలేదు. మావాళ్లలో ఒకరికి తెలిసి కూడా చెప్పలేదు అంటే మా పట్ల ఎందుకు అసూయ పడుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్లు ఎవరో తెలీడం లేదు వాళ్లు ఎవరో నాకు తెలిసేలా చేయమ్మా బుజ్జగించో బతిమాలో నా కన్న బిడ్డ జాడ తెలుసుకుంటాను. అని కొబ్బరి కాయ కొడుతుంది. ఆ నీరు గాయత్రీ పాప మీద పడతాయి. 

అమ్మవారి దగ్గర కొబ్బరి చిప్పలు పెట్టి దండం పెట్టుకుంటుంది. అమ్మవారికి నయని హారతి ఇస్తుంది. హాసిని మనసులో నా వైపు చూపించినా, విశాల్ వైపు చూపించినా ఇరుక్కుపోతామని అనుకుంటుంది. ఇక విశాల్ మనసులో ఇప్పుడు నేను నిజం చెప్పేస్తే అనుకొని అందరూ అపార్థం చేసుకుంటారని ఆగిపోతాడు. హాసిని ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. దాంతో అమ్మవారి పూనినట్లు నటిస్తుంది. నయని పెద్ద కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు తెలుసు అని నాకు తెలుసే అని హాసిని అమ్మవారి రూపంలో తిలోత్తమని ఇరికించేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ నాకు తెలీదు అంటుంది ఒట్టు వేస్తుంది. విశాల్ కూడా నీకు తెలుసని అమ్మవారు చెప్తుంది కదా అని అంటాడు. అబద్ధాలు ఆడితే చంపేస్తా నీకే తెలుసు అని హాసిని అంటుంది. అందరూ తిలోత్తమ మీద ఒత్తిడి తెస్తారు. ఇంతలో హాసినికి ఫోన్ వస్తుంది. దాంతో హాసిని డ్రామా అందరికీ తెలిసిపోతుంది. అందరూ హాసినిని కోపంగా చూస్తారు. తిలోత్తమ హాసినిని వాయించేస్తుంది. అమ్మవారు పూనినట్లు నటించి నన్ను ఇరికించిందని అంటుంది. 

నయని: నువ్వు ఈ విషయంలో తమాషా చేసినా సరదాగా తీసుకొనే వాళ్లం కానీ నేను ఇక్కడికి వచ్చింది నా కన్న కూతురి కోసం నేను ఆరాధించే గాయత్రీఅమ్మగారి పునర్జనమ్మ కోసం అమ్మవారి సన్నిధిలో నాకు ఉపశమనం కలుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పుకానీ తెలియని వాళ్లకి తెలుసు అని చెప్పి నా ప్రయత్నాన్ని ఆవేదనని తప్పుదారి పట్టించకు అక్క.
హాసిని: సారీ చెల్లి.
అహల్య: వాళ్లని వీళ్లని అడిగి ప్రయోజనం లేదు అమ్మవారినే అడుగు నయని.
నయని: అమ్మ పరమేశ్వరి నీ సన్నిధికి వచ్చాను. ఈ రోజు నా బిడ్డ ఆచూకి తెలుస్తుందని గాయత్రీ అమ్మగారు కూడా చెప్పారు. తను ఏ రూపంలో ఉందో ఎక్కడుందో నువ్వు చూపించకపోయినా తన గురించి ఎవరికి తెలుసో వాళ్లని అయినా చూపించు తల్లీ. ఇవాళ  నా బిడ్డ దీక్ష తెలీయకపోతే ఇక్కడ నుంచి వెళ్లను. ఆమరణ నిరాహార దీక్ష తీసుకుంటాను. 

అమ్మవారి దగ్గర గుంటలు మోగి అమ్మవారి నుంచి కాంతి ప్రసరిస్తుంది. అది విక్రాంత్‌ దగ్గరకు చేరుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. విశాల్, హసిని కూడా బిత్తర పోతారు. తర్వాత కాంతి మాయం అయిపోతుంది. విక్రాంత్ మీద కాంతి పడి మాయం అయిందేంటి అనుకుంటారు. విశాల్ మనసులో నన్ను, వదినను పట్టిస్తుంది అమ్మవారు అనుకుంటే విక్రాంత్ మీద పడింది ఏంటి అనుకుంటాడు. నయని విక్రాంత్ దగ్గరకు వెళ్లి విక్రాంత్ బాబు మీకు నా కూతురి గురించి తెలుసా అని విక్రాంత్ కాలర్ పట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget