అన్వేషించండి

Satyabhama Serial Today October 29th: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!

Satyabhama Today Episode నందినిని కొందరు ఏడిపించడం వాళ్లకి కొట్టడానికి వెళ్లిన హర్ష వాళ్ల చేతిలో దెబ్బలు తినడం క్రిష్ వచ్చి వాళ్లని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మైత్రి కావాలనే స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి ఏం హర్షని పిలుస్తుంది. హర్ష మైత్రిని ఎత్తుకొని వచ్చి నేల మీద పడుకోపెట్టి లేపడానికి ప్రయత్నిస్తాడు. నందిని దూరం నుంచి చూసి కోపంతో ఉంటుంది. పక్కనున్న వాళ్లు కడుపు మీద ఒత్తమని సీపీఆర్ చేయమని చెప్తారు. హర్ష సీపీఆర్ చేయడానికి రెడీ అవ్వగానే నందిని ఆపి తాను చేస్తుంది. నందిని ఒత్తుడికు చచ్చేలా ఉన్నాననుకొని మైత్రి కళ్లు తెరిచేస్తుంది. ఇక తర్వాత నందిని కస్సుబుస్సులాడుతుంది. హర్ష నందినిని అరవొద్దని తర్వాత వాళ్లని వేరే దగ్గరకు తీసుకెళ్తాడు.  

సంజయ్: భయపడ్డావా.
సత్య: నీ లాంటి వాళ్లకు నేను ఎందుకు భయపడతాను. అయినా ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు. కామన్ సెన్స్ లేదా.
సంజయ్: కామన్ సెన్స్ ఉంది కానీ నీతో ఒంటరిగా మాట్లాడే అవకాశమే లేదు.
సత్య:  నాతో నువ్వు ఎందుకు ఒంటరిగా మాట్లాడాలి. 
సంజయ్: చూడు సత్య ఈ ముసుగులో గుద్దులాటలు నా వల్ల కాదు. నిన్ను చూడగానే నచ్చేసేవా నీ అందానికి ఫ్లాట్ అయిపోయా ఇన్నాళ్లు ఎలా గోలా ఓపిక పట్టా కానీ నిన్ను ఇలా తడి బట్టల్లో చూసే సరికి నా మనసు ఆగలేదు. దానిలో దాగున్న మాట చెప్పక తప్పలేదు.
సత్య: నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా.
సంజయ్: తెలుసు కానీ నువ్వు కూడా మొదట్లో క్రిష్‌ని దూరం పెట్టావు కదా తర్వాత ఇష్ట పడ్డావు కదా నా విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ విషయం ఇంకెవరికీ తెలీదు మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. 
సత్య: సంజయ్ చెంప మీద ఒక్కటి కొట్టి.. ఫారెన్‌లో పెరిగావ్ కదా వావి వరసలు లేకుండా తయారయ్యావ్. నేను మొదటి నుంచి నా భర్తకి చెప్తూనే ఉన్నా నీ క్యారెక్టర్ బాలేదని కానీ తనే వినిపించుకోవడం లేదు. ఈ సారి నేను ఒపిక పట్టలేను జరిగిందంతా క్రిష్‌కి ఇప్పుడే చెప్పేస్తా.

నందిని, హర్షలు కార్ల డ్రైవ్‌ చేస్తూ ఉంటారు. అందులో ఓ వ్యక్తి నందిని కావాలనే డాష్ ఇస్తాడు. దాంతో నందిని హర్షకి చెప్తే హర్షని వాళ్లు కొడితే తిరిగి వాళ్లు హర్షని కొడతారు. ఇంతలో నందిని క్రిష్‌ని పిలుస్తుంది. వాళ్లని క్రిష్‌చితక్కొడతాడు. ఇక సత్య వచ్చి క్రిష్‌ని ఆపుతుంది. నా వాళ్ల జోలికి వస్తే ఎవర్నీ వదలను అంటాడు. ఇంతలో సత్య సంజయ్ దగ్గరకు వెళ్లి నందినిని ఏడిపించారనే చితక్కొట్టాడు నా జోలికి వచ్చావంటే కాళ్లు చేతులు తీసేస్తాడని అంటుంది. చక్రవర్తి లాంటి మంచి వ్యక్తికి నువ్వు ఎలా కొడుకులా  పుట్టావని అంటుంది. సత్య అందరిలాంటి ఆడ పిల్ల కాదు వణికించడం తప్ప వణకడం తెలీదని వార్నింగ్ ఇస్తుంది. ఇక సంజయ్ వెళ్తూ వెళ్తూ సంధ్య జాయింట్ వీల్ దగ్గర ఫోన్ మాట్లాడటం చూస్తాడు. సత్యని తన దారిలోకి తెచ్చుకోవడానికి సంధ్యని వాడుకోవాలి అనుకుంటాడు.

ఇక నందిని, హర్ష ఓ చోట కూర్చొంటారు. నందిని తన అన్నని పొగిడితే హర్ష అలిగిపోతాడు. మరి హర్ష అని నన్ను ఎందుకు పిలిచావని అడుగుతాడు. దొంగ వెదవలు మా ఆవిడ మీద చేయి వేస్తే ఎలా ఊరుకుంటానని అంటాడు. దానికి నందిని నవ్వుతుంది. నా మీద నీకు చాలా ప్రేమ ఉందని అంటుంది. దానికి హర్ష నేను ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయలేను నందిని అంటాడు. ఇక మైత్రి దూరంగా చూసి నన్ను ప్రేమించిన హర్ష దీంతో మాట్లాడుతున్నాడని ఫీలయిపోతుంది. ఇక సంజయ్ సత్య దగ్గరకు వెళ్లి మీ అక్క కోసం నిన్ను బలి చేస్తున్నా ఏం అనుకోవద్దు అని సంధ్యని జాయింట్ వీల్ ఎక్కిస్తాడు. వెనకాలే తాను కూర్చొంటాడు. మరోవైపు సత్య క్రిష్ దగ్గరకు వెళ్తుంది.

అలిగి బుంగ మూతి పెట్టుకొని వేరో చోట కూర్చొంటుంది. అది చూసిన క్రిష్‌ మళ్లీ గొడవ అని అనుకొని సత్య దగ్గరకు వెళ్తాడు. తన మాటలతో సత్యని కూల్ చేస్తాడు. సత్య కావాలనే క్రిష్‌తో బతిమాలించుకోవాలి అనుకుంటుంది.  సత్య లేచి వెళ్లిపోతుంటే క్రిష్ బతిమాలుతాడు. సత్య పడిపోతుంటే పట్టుకుంటాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక అందరూ ఇంటికి బయల్దేరుతారు. ఇక సంజయ్ ఎక్కడున్నాడు అని క్రిష్ అడుగుతాడు. నీ కొట్టుడుకు భయపడి వెళ్లిపోయింటాడని అనుకుంటారు. ఇక సత్య తాను డ్రైవ్ చేస్తానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌తో వ్రతం చేయాలి అంటే శ్రీధర్‌ మామయ్య రావాల్సిందే.. కోడలి కోసం సవతి గడప తొక్కిన కాంచన!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
Embed widget