Karthika Deepam 2 Serial October 28th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌తో వ్రతం చేయాలి అంటే శ్రీధర్ మామయ్య రావాల్సిందే.. కోడలి కోసం సవతి గడప తొక్కిన కాంచన!
Karthika Deepam 2 Serial Episode కార్తీక్‌తో కలిసి వ్రతం చేయాలి అంటే కాంచనతో పాటు శ్రీధర్ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పడం కాంచన శ్రీధర్ ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode సుమిత్ర గుడి నుంచి ఇంటికి వచ్చే సరికి పారిజాతం ఎదురుగా కూర్చొని ఉంటుంది. నన్ను కూడా పిలిచి ఉంటే గుడికి వచ్చేదాన్ని కదా అని అంటే నేను ప్రశాంతత కోసం వెళ్లివచ్చానని సుమిత్ర అంటుంది. నేను వస్తే మనస్శాంతి ఉండదు అనే కదా అని అంటుంది. ఇలాంటి మాటలు చెప్పే మీరు నా కూతురి మనసు మార్చేశారు అందుకే నేను తన కోసం మొక్కుకోవడానికి వెళ్లానని సుమిత్ర చెప్తుంది. నన్ను ఎన్నిమాటలు అన్నావే సుమిత్ర నువ్వు నాకు దొరుకుతావు అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుంటుంది.
కాంచన: దీప ఏముంది అనసూయ.
అనసూయ: మీతో మాట్లాడుతా అంటుంది.
కాంచన: దీప నిన్ను ఓ విషయం అడగాలి.
దీప: నేను ఆ విషయం గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను. రాత్రి అత్తయ్య చెప్పింది మీరు సత్యన్నారాయణ వ్రతం చేయాలని చెప్పారు కదా. కార్తీక్ బాబు భార్యగా నేను పీటల మీద కూర్చొంటా మీరు ఎప్పుడు అంటే అప్పుడు వ్రతం చేసుకుంటా.
కాంచన: నువ్వు మా ఇష్టాన్ని కాదు అనవని నాకు తెలుసు. రేపే వ్రతం చేస్తా.
దీప: కానీ ఒక షరతు. కాదు నా కోరిక భార్యభర్తలు వ్రతం చేసుకుంటే అత్తామామలు దీవించాలి. అత్తగా మీరు ఉన్నారు మామగా శ్రీధర్‌గారు ఉండాలి కదా. మీ భార్యాభర్తలు ఇద్దరూ పక్కపక్కన నిల్చొని మమల్ని దీవిస్తానంటే మేం వ్రతం చేసుకుంటాం.
కార్తీక్: అర్థం లేని కోరికలు కోరకు దీప. ఆ మనిషికి మాకు ఏం సంబంధం లేదు.
దీప: నేను అడిగింది ఆశీర్వాదం.
కార్తీక్: దానికైనా ఆ ఇంటి గడప తొక్కాలి కదా
దీప: అవన్నీ నాకు తెలీదు బాబు. పెళ్లి అయిన దంపతులకు పద్ధతి ప్రకారం వ్రతం చేయాలని కాంచన గారు చెప్పారు నేను ఆ ప్రకారమే అడుగుతున్నాను. అత్తయ్యగారు పుణ్యస్త్రీ అందుకే జంటగా దీవించాలి అని నేను అనుకుంటున్నా.
కాంచన: దీప నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటున్నా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది నువ్వు వెళ్లు.
కార్తీక్: మా ఇద్దరితో వ్రతం చేయించడానికి నువ్వు ఎవర్ని బతిమాలడం నాకు ఇష్టం లేదు అమ్మ.
కాంచన: బతిమాలడం కాదురా నన్ను మోసం చేసినందుకు భర్తగా నేను వద్దు అనుకున్నా కానీ తండ్రిగా అతనికి మిమల్ని ఆశీర్వదించే హక్కు ఉంది. ఇది నా సంతోషం కోసం జరుగుతున్న కార్యక్రమంరా నువ్వు మీ నాన్నకి కాల్ చేసి ఫోన్ చేసి చెప్పు మనం వెళ్దాం.
దశరథ్: నువ్వు చెప్పింది నాకు అర్థం అయింది సుమిత్ర కానీ దీప చిన్న పిల్ల కాదు అలా అని అమాయకురాలు కాదు కదా కార్తీక్ బలవంతంగా తాళి కడితే తాను ఎదుర్కొవాలి కదా. తనేంటో తన స్థాయి ఏంటో తనకు అర్థం కావాలి కదా. నువ్వు దీపని నమ్ముతావేంటో కానీ నేను నమ్మను సుమిత్ర
పారిజాతం: అది అలా చెప్పు. మనం ఆ దీపని వదిలేయొద్దురా ఏదో ఒకటి చేయాలి
దశరథ్: ఆ కార్తీక్, దీప, మా బావ అందరూ నన్ను నా కూతుర్ని మోసం చేశారు. ఇంక మనం ఆ కార్తీక్ గురించి ఆ మనుషుల గురించి మాట్లాడుకోవడం అనవసరం.
సుమిత్ర: ఈ గొడవలు అన్నీ వదిలేయండి. మీరు ఊరికే మనుషుల్ని రెచ్చగొట్టొద్దు.
పారిజాతం: ఈ అనార్థాలు అన్నీంటికీ కారణం అయిన దీపని వదలను. ఇంత బాధ పడుతున్న కూతుర్ని వదిలి ఇంకా సుమిత్ర దీప గురించే ఆలోచిస్తుంది.
కార్తీక్, తల్లి, అనసూయని తీసుకొని శ్రీధర్ ఇంటికి వెళ్తుంటారు. ఇక పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఈ ఆస్తి మీ తాత పేరు మీద ఉంది ఇది మీ తాత ఆస్తి కాబట్టి కాంచనకు సగం ఇవ్వాలి ఇవ్వకపోవచ్చు అంతా మీ తాత ఇష్టం. ఇప్పుడు మీ తాత వాళ్లకి ఎంతో కొంత ఇచ్చి తెగ తెంపులు చేసుకుంటాడు. కూతురికి అన్యాయం చేయడు కాబట్టి ఆ అన్యాయం మనమే చేసేలా చేయాలి. దానివల్ల మీ తాతకి వాళ్లకి గొడవ అయ్యేలా చేయాలి లేదంటే ఆస్తి వద్దు అని మీ బావ వాళ్లు అనుకునేలా చేయాలి అని పారిజాతం అంటుంది. దీప వల్లే ఆస్తి పోగొట్టుకున్నానని కార్తీక్ అనుకునేలా చేయాలని అనుకుంటారు. ఆస్తి కావాలి అంటే నన్ను పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెడతా అని జ్యోత్స్న అంటుంది. దీప దగ్గర ఏం లేదు కాబట్టి అందరినీ పోషించాలి అంటే కచ్చితంగా ఆస్తి కావాలి కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాడు బావ. దాంతో దీపని మళ్లీ ముత్యాలగూడెం పంపేస్తా అని చెప్తుంది. నీ ఐడియా సూపర్ గ్రానీ మనం ఈ రెండు కుటుంబాల మధ్య కాదు గ్రానీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలి. నా మీద బావకి సింపతీ వచ్చేలా చేయాలి అని జ్యోత్స్న అంటుంది.
కార్తీక్, కాంచన వాళ్లు శ్రీధర్ ఇంటికి వెళ్తారు. కావేరి, శ్రీధర్‌లు కాంచన వాళ్లు మన ఇంటికి ఎందుకు వస్తున్నారు అని అంటుంది. మనసు మారి మిమల్ని తీసుకెళ్తారా ఏంటి అనుకుంటారు. ఇంతలో కాంచన వచ్చి పిలవడానికి వచ్చానని చెప్పి అనసూయతో గుమ్మానికి బొట్టు పెట్టిస్తుంది. కార్తీక్, దీపలతో గుడిలో వ్రతం చేయిస్తున్నాను అని కొడుకుని ఆశీర్వదించడానికి పిలుస్తుంది. నేను అవసరం లేనప్పుడు నా ఆశీర్వాదం ఎందుకు రాను అని శ్రీధర్ అంటాడు. ఒక్క శ్రీధర్‌నే పిలుస్తున్నారా అని కావేరి అంటే జంటగా వస్తారో ఒంటిగా వస్తారో అది మీ ఇష్టం నేను అయితే ఇద్దరినీ పిలుస్తున్నాను అంటుంది. నేను వ్రతానికి రాకపోతే అని శ్రీధర్ అడిగితే కార్తీక్ తండ్రిగా మీరు వస్తారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సీఎం ఇంటి అల్లుడిగా అడుగుపెట్టిన జీవన్.. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకున్న రూప, జీవన్!