Trinayani Serial Today October 14th: 'త్రినయని' సీరియల్: వరసగా అదే అపశకునం.. నయనికి కనిపించని భవిష్యత్.. అసలేం జరుగుతోంది?
Trinayani Today Episode నయని విశాల్‌లు మానసాదేవి ఆలయం నుంచి తిరిగి రావడం వాళ్లకు హారతి ఇవ్వడం అది పదే పదే ఆరిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode తిలోత్తమ, వల్లభతో పాటు అందరూ విశాల్, నయని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో నయని, విశాల్ ఇంటికి వస్తారు. ఇద్దరూ రావడంతో తనకు ఆస్తిలో వాటా రాదని సుమన మూతి మాడ్చుకుంటుంది. గజగండని సాక్ష్యాత్తు అమ్మవారే పొడిచేశారని విశాల్ చెప్తాడు. దాంతో వల్లభ అమ్మవారా అని చాలా భయపడతాడు. తిలోత్తమ కూడా టెన్షన్ పడుతుంది.
నయని: ఆ తల్లిని కళ్లారా చూడగలిగే భాగ్యం మాకు దక్కింది అని నయని చెప్తే హాసిని దిష్టి తీస్తానని వెళ్లబోతే హారతి పళ్లెం కింద పడిపోతుంది. దాంతో సుమన ఎదైనా కీడు జరుగుతుందా అని అంటుంది. దాంతో దురంధర మరోసారి దిష్టి తీస్తే ఏమవుతుందని చెప్పి హారతి వెలిగిస్తుంది. కడుపుతో ఉన్న దురంధర దిష్టి తీయొద్దని అంటే తిలోత్తమ దిష్టి తీస్తుంది. ఇంతలో మరోసారి హారతి ఆరిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు.
దురంధర: సుమన ఈ సారి నువ్వు హారతి ఇవ్వవే.
సుమన: నేను ఇవ్వను సడెన్‌గా ఈ సారి హారతి ఆరిపోతే మా ఆయన ముందూ వెనక ఆలోచించకుండా నన్ను కొట్టేసేలా ఉన్నారు.
నయని: దిష్టి తీయడం ఏం వద్దులే.
విక్రాంత్: వదినా వద్దు వీళ్లు ఇవ్వకపోతే ఏంటీ మగాళ్లు దిష్టి తీయకూడదు అని ఎక్కడా లేదు కదా నేను తీస్తా. ఈ సారి విక్రాంత్ తీయగా కూడా హారతి ఆరిపోతుంది. అందరూ బిత్తరపోతారు.
తిలోత్తమ: ఆశ్చర్య పడమంటారా అనుమానించమంటారా
దురంధర: అదే ఏం అర్థం కావడం లేదు.
విక్రాంత్: వదినా మీరు వెళ్లండి పాజిటివ్‌గా ఉండండి.
నయని చీర కట్టుకుంటే విశాల్ దగ్గరకు వచ్చి చాలా మంచిగా చీరకట్టుకున్నావ్ అంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అంటే నయనిని విశాల్ దగ్గరకు తీసుకుంటాడు. ఇక హారతి గురించి నయని మాట్లాడుతుంది. అవన్నీ వదిలేయమని విశాల్ అంటాడు. మరోవైపు సుమన విపరీతంగా మేకప్ వేసేసుకుంటుంది. విక్రాంత్ అక్కడికి వస్తాడు. నయని వదిన వాళ్లకి అంతలా నువ్వే దిష్టి పెట్టావని అంటాడు. దానికి సుమన నన్ను ఏం అనొద్దని అంటాడు. కనీసం వాళ్లు మంచి పని చేశారని కూడా అని నీ నోట వెంట రాదా అని సుమనని విక్రాంత్ అంటాడు. సుమన మాత్రం పంచకమణి, భుజంగ మణి దేవుడి గుడిలో పెట్టడానికి వాళ్లకి బుద్ధి లేదని వజ్రాలు వైడూర్యాలు ఉన్న రాళ్లను ఎందుకు వదిలేశారని మాటలు మాట్లాడుతుంది. విక్రాంత్ భార్యకి ఫుల్లుగా గడ్డి పెడతాడు.
ఇక సుమన అందరినీ హాల్‌లోకి పిలిచి పండగకి ఎవరికి ఏం కావాలో చెప్పమని అంటుంది. సుమన వచ్చి నగో నట్రో కావాలి అని అంటే అడుక్కుంటే ఇస్తారని విక్రాంత్ అంటాడు. ఇంతలో నయని మంచి నీరు తీసుకొని వచ్చి విశాల్‌కి ఇస్తే గ్లాస్ కింద పడిపోతుంది. దానికి సుమన హారతి పళ్లెం పడిపోయినట్లే మంచి నీళ్ల గ్లాస్ కూడా పడిపోయిందని అంటుంది. దీని వెనక ఏదో ఉందని అందరూ అంటారు. విక్రాంత్ ఏం ఉండదు అంటే నయని ఉంది అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఏదో కీడు జరగబోతుందని నా మనసుకి తెలుస్తుందని నయని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.