అన్వేషించండి

Amardeep Chowdary: హీరోగా అమర్‌దీప్ చౌదరి కొత్త సినిమా - బిగ్ బాస్ తర్వాత సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్‌తో...

Naa Nireekshana Movie: టీవీ సీరియల్స్, బిగ్ బాస్ షోతో తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అమర్‌దీప్ చౌదరి. ఇప్పుడు ఆయన హీరోగా తన కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

అమర్‌ దీప్ చౌదరి (Amardeep Chowdary) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తొలుత యూట్యూబ్ ఫిలిమ్స్ చేశారు. అయితే, 'జానకి కలగనలేదు' సీరియల్ ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్', డ్యాన్స్ రియాలిటీ షో, 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో మరింత దగ్గర అయ్యారు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేయడం మీద కాన్సంట్రేషన్ చేశారు. అమర్ దీప్ చౌదరి హీరోగా కొత్త సినిమా దసరాకు ప్రారంభం అయ్యింది.  

అమర్ దీప్ చౌదరి హీరోగా 'నా నిరీక్షణ'
Naa Nireekshana Movie: తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, 'దిల్' రాజు చేతుల మీదుగా విజయదశమికి 'నా నిరీక్షణ' సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

'నా నిరీక్షణ'ను పికాక్ మూవీ మేకర్స్ పతాకంపై పి. సంతోష్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమర్ దీప్ చౌదరి సరసన యంగ్ హీరోయిన్ లిషి గణేష్ కల్లపు నటిస్తున్నారు. చైతన్య వర్మ, రమ్య ప్రియ ప్రధాన తారాగణం. సాయి వర్మ దాట్ల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు ఆశీస్సులతో ముహూర్తపు కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి 'దిల్' రాజు క్లాప్ ఇవ్వగా... చిత్ర బృందానికి నటుడు రాజా రవీంద్ర స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

బిగ్ బాస్ తర్వాత ఎంపిక చేసిన కథ!
'నా నిరీక్షణ' ప్రారంభోత్సవంలో అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ... ''ఈ సినిమా కథ మీద దర్శక నిర్మాతలు ఏడు నెలలు పని చేశారు. 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎంపిక చేసుకున్న మొదటి కథ ఇది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు. అమర్ దీప్ చౌదరి, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీతా నాయుడు జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?


విజయదశమి రోజున తమ చిత్ర బృందాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు, 'దిల్'కు దర్శకుడు సాయి వర్మ దాట్ల థాంక్స్ చెప్పారు. కథ గురించి ఇప్పుడు చెప్పలేనని, తాము ఓ మంచి చిత్రాన్ని చేస్తున్నామని తెలిపారు. కథానాయికగా తనకు రెండో చిత్రమిదని, తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ లిపి గణేష్ కల్లపు థాంక్స్ చెప్పారు. నటుడు చైతన్య వర్మ మాట్లాడుతూ... ''ఇంతకు ముందు నన్ను 'హిట్', 'ఝాన్సీ', 'సరెండర్' సినిమాల్లో  ప్రేక్షకులు చూశారు. ఈ సినిమాలో మరో మంచి పాత్ర చేస్తున్నాను. ప్రేక్షకులు మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.

Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??


అమర్‌ దీప్ చౌదరి, చైతన్య వర్మ, లిషి గణేష్ కల్లపు, రమ్య ప్రియ తదితరులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మాటలు: తిరుమలేష్ బండారు, ఛాయాగ్రహణం: వి. రవి కుమార్, సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర, నిర్మాణ సంస్థ: పీకాక్ మూవీ మేకర్స్, నిర్మాత: పి. సంతోష్ రెడ్డి, కథ - కథనం - దర్శకత్వం: సాయి వర్మ దాట్ల.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget