Trinayani Serial Today October 10th: 'త్రినయని' సీరియల్: ఒకరికి ఒకరు గన్ గురిపెట్టుకున్న అహల్య, తిలోత్తమ.. చావుకి సమరం మోగినట్లేనా, అహల్య మాటల అర్థమేంటి?
Trinayani Today Episode అహల్యని తిలోత్తమ చంపడానికి ప్రయత్నించడం అహల్య ఇంటి నుంచి వెళ్లిపోయి సాక్ష్యాలు సంపాదించే పనిలో ఉంటానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode అహల్య గాయత్రీ దేవి ఫొటో ముందు నిల్చొని అక్కా అసలు ఇక్కడేం జరుగుతుంది. ఇక్కడికి రాకముందు నాకు చాలా చెప్పారు. మీ గురించి ఎవరికి తెలుసో ఎవరికి తెలీదో నాకు ఏం అర్థం కావడం లేదని అహల్య ఫొటోతో చెప్పుకుంటుంది. ఇంతలో తిలోత్తమ అహల్య వెనక నుంచి వచ్చి అహల్య వీపు మీద గన్ పెడుతుంది.
అహల్య: నన్ను ఎందుకు టార్గెట్ చేశావ్ తిలోత్తమ.
తిలోత్తమ: ఇక్కడికి రాక ముందు ఎవరో నీకు ఏదో చెప్పారని గాయత్రీ అక్క ఫొటో చూసి చెప్పావు కదా అదేంటి అనేది నాకు చెప్పాకనే నువ్వు చనిపోవాలి.
అహల్య: అదేంటో చెప్పకపోతే నువ్వు చచ్చేలా ఉన్నావే. ఇంతలో సుమన వచ్చి ఆ సీన్ చూసి గట్టిగా అరుస్తుంది. తిలోత్తమ అటు తిరిగే లోపు అహల్య గన్ తీసుకొని తిలోత్తమకు గురి పెడుతుంది. ఇంట్లో అందరూ ఆ సీన్ చూసి షాక్ అయిపోతారు.
తిలోత్తమ: నన్నేం చేయకు అహల్య నేనేం చేశానని నాకు రివాల్వర్ గురి పెట్టావు.
సుమన: ఇదేంటి తిలోత్తమ అత్తయ్య ఇలా ప్లేట్ తిప్పేసింది.
నయని: అత్తయ్యను ఎందుకు షూట్ చేయాలనుకున్నారమ్మగారు.
అహల్య: నీ నాటకాలు ఆపు రివాల్వర్ తీసుకొచ్చి నన్ను చంపాలని చూసింది నువ్వు.
తిలోత్తమ: ఎందుకు అక్క అలా మాట మార్చేశావు. నేను అంటే నీకు ముందు నుంచి నచ్చడం లేదు ఈ ఇంట్లోనే కాదు ఈ లోకంలో ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావ్. అందుకే ఈ ఇంటికి వచ్చింది అందుకేనా.
నయని: అత్తయ్య గారు రివాల్వర్ దించడండి మీ మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ అది చేయాల్సింది వేరే వారు.
అహల్య: రివాల్వర్ నాకు గురి పెట్టింది తిలోత్తమ సుమన వచ్చి అరిచే సరికి నేను రివాల్వర్ తీసుకున్నా. సుమనను సాక్ష్యం అడగటంతో సుమన తిలోత్తమకు సపోర్ట్ చేస్తుంది. దాంతో అహల్య షాక్ అయిపోతుంది. అప్పుడే తిలోత్తమ రివాల్వర్ తీసుకొని అహల్యకు గురి పెడుతుంది. అహల్యని చంపేయాలని షూట్ చేయగా అందులో బులెట్ లేక పేలదు.
నయని: ఎన్ని సార్లు నొక్కినా అది పేలదత్తయ్య.
హాసిని: చెల్లి అందులో బులెట్లు తీసేసింది.
దురంధర: అంటే ఇలా జరగబోతుందని.
హాసిని: అవును నయని చెల్లి ముందే గ్రహించింది. తిలోత్తమ అత్తయ్య అహల్య అత్తయ్యని చంపడానికి వస్తుందని చెప్పి తెలివిగా అందులో బులెట్లు తీసేసింది.
విశాల్: అయితే తిలోత్తమ అమ్మ పిన్నిని చంపాలని ప్రయత్నించి అబద్ధం చెప్పిందన్నమాట.
నయని: సుమన కూడా చెప్పింది.
అహల్య: నేను అంటే తిలోత్తమకు గిట్టనట్లు నువ్వు అంటే సుమనకు గిట్టనంట్లుంది. గన్ తీసుకెళ్లి గాయత్రీ పాపకి ఇవ్వు తిలోత్తమ ఆడుకుంటుంది.
తిలోత్తమ: మనసులో బతికిపోయావ్ అహల్య ఈసారి చెప్తా నీ సంగతి.
ఇక ఒకర్ని ఒకరు ఎందుకు చంపుకున్నారో నయని తాను తెలుసుకుంటానని రివాల్వర్ జాగ్రత్తగా దాయమని విశాల్‌కు చెప్తుంది. మరోవైపు తిలోత్తమ కొంచెం ఉంటే అహల్యని లేపేసేదాన్ని అని వల్లభతో చెప్తుంది. అహల్యని ఏం చేయనందుకు పరువు పోయినట్లయిందని తిలోత్తమ అంటుంది. అహల్య దగ్గర రహస్యం ఎలా అయినా తెలుసుకోవాలని అంటుంది. ఇక హాసిని అందరినీ పిలిచి తిలోత్తమతో మీకు ప్రాణ గండం తప్పిందని అంటుంది. ఏమైందని అందరూ అంటే అహల్యని చూపిస్తుంది. దాంతో అహల్య బ్యాగ్ తీసుకురావడం అందరూ చూసి అహల్య వెళ్లిపోవడం వల్లే అలా అన్నానని తిలోత్తమతో అంటుంది. ఎందుకు అప్పుడే వెళ్లిపోతున్నావ్ అని నయని అడిగితే సాక్ష్యాలు సంపాదించడానికి వెళ్తున్నానని అంటుంది. గాయత్రీ అక్కని అన్యాయంగా చంపేసిన వాళ్లు చావడానికి ఏర్పాట్లు చేయడానికి వెళ్తున్నానని అంటుంది. దాంతో తిలోత్తమ చాలా కంగారు పడుతుంది. గాయత్రీ పాపతోనే సమరం మొదలవుతుందని అహల్య అంటుంది. అహల్య వెళ్తున్నా అని చెప్పి కబురు పెట్టినప్పుడు రా నీ తొలి బిడ్డను చూపిస్తానని అంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: దీపక్ ఇద్దరి పెళ్లాల కొట్లాట.. కారులో రాజు, రూపలను సూర్యప్రతాప్ చూసేస్తాడా!