అన్వేషించండి

Ammayi garu Serial Today October 9th: అమ్మాయి గారు సీరియల్: దీపక్ ఇద్దరి పెళ్లాల కొట్లాట.. కారులో రాజు, రూపలను సూర్యప్రతాప్ చూసేస్తాడా!

Ammayi garu Today Episode రూప ఇంట్లో జరిగిన గొడవ తెలుసుకున్న రాజు రాత్రి పూజ రూపని కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు, ముత్యాలు అందరూ విరూపాక్షిని తీసుకొని ఇంటికి వస్తారు. పెద్దవాళ్ల కోపాలకు పిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుందని విరూపాక్షి అంటుంది. అర్థం పర్థం లేని నా నిర్ణయాల వల్ల పిల్లల్ని ఇబ్బంది పెట్టానని బంగారం లాంటి కోడల్ని ఇబ్బంది పెట్టానని ముత్యాలు అంటుంది. రాజు, అమ్మాయి గారి కోసం ఏమైనా చేస్తానని అంటుంది. 

రాజు: అమ్మగారు ఇప్పుడు రాఘవ ఎక్కడున్నాడో తెలిస్తే కానీ మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. 
విరూపాక్షి: అవును రాజు. కానీ రాఘవని ఎవరు తీసుకెళ్లారో ఏంటో.
రాజు: రాఘవని తీసుకెళ్లే అవసరం విజయాంబిక, దీపక్‌లకు తప్ప ఇంకెవరికీ ఉండదు. వాళ్లని ఫాలో అయితే చాలు  అమ్మగారు. 
అప్పలనాయుడు: ఇక అందరం రాఘవని వెతికే పనిలో ఉందాం.

రూప, రాజులు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. రూప దగ్గరకు పిన్న సుమ, మందారం వస్తారు. ఉదయం నుంచి ఏం తినలేదని మీ నాన్నకి తెలిస్తే బాధ పడతారని అంటారు. దానికి రూప పిన్ని అందరికీ నాన్న బాధే కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించడం లేదా అని అంటుంది. నాలో నేనే కుమిలిపోతున్నా అని అంటుంది. రూప తినలేదని ఇంట్లో ఎవరూ తినలేదని మందారం చెప్తుంది. కానీ విజయాంబిక, దీపక్‌లు సంతోషంగా తింటుంటారు. రూప తన పిన్నితో ఇక్కడ మీరు అక్కడ అమ్మావాళ్లు కూడా నా కోసం తినకుండా ఉంటారని అంటుంది. ఇక రాజు దగ్గరకు ముత్యాలు వస్తుంది. గతంలో తాను రూపతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. 

ముత్యాలు: అమ్మాయి గారిని ఒకప్పుడు దేవతలా చూసుకున్నా ఇప్పుడు మాత్రం బద్ధ శత్రువులా చూశాను. నాయనా నన్ను క్షమించురా.
రాజు: అమ్మా నీ పరంగా నువ్వు చేసింది కరెక్టే ఏమో అయిపోయింది మరి ఇప్పుడెందుకమ్మా పెద్దయ్య గారు మనల్ని అర్థం చేసుకుంటారు. నువ్వు వెళ్లి పడుకో అమ్మా. 

రాజు రూపకి కాల్ చేస్తాడు. రూప మాత్రం లిఫ్ట్ చేయదు. దాంతో సుమ రాజుకి కాల్ చేసి జరిగింది రాజుతో చెప్తుంది. దాంతో రాజు నేను ఇప్పుడే ఇస్తానని అంటాడు. వద్దని సుమ చెప్పినా వినడు. ఇంట్లో చెప్పి వెళ్తాడు. ముత్యాలు వాళ్లు వద్దని పెద్దయ్య గారు కోపంగా ఉన్నాడని అంటారు. కానీ విరూపాక్షి వచ్చి వెళ్లనివ్వండని చెప్పి రూప కోసం పాయసం చేసి ఇస్తుంది.  మరోవైపు దీపక్ రావడం లేదని హారతి చాలా టెన్షన్ పడుతుంది. దీపక్‌కి కాల్ చేస్తుంది. ఆ ఫోన్ మందారం చూసి బాబీ అని ఉండటం చూసి ఎవరు అనుకుంటుంది. ఎవరో అని నేనే లిఫ్ట్ చేస్తా అని మందారం లిఫ్ట్ చేస్తుంది. ఇక మందారం హారతి ఒకర్ని ఒకరు నువ్వు ఎవరు అంటే నువ్వు ఎవరు అని అనుకుంటారు. ఒకర్ని ఒకరు తిట్టుకుంటారు.

ఇంతలో దీపక్ వచ్చి ఫోన్ తీసుకొని వెళ్లిపోతాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసింది పని మనిషి అని కవర్ చేస్తుంది. ఇక హారతి మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామని అడుగుతుంది. తర్వాత మాట్లాడుతా అని దీపక్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక రాజు రూప కోసం రాత్రి పూట ఇంటికి వస్తాడు. రూప బయటకు వచ్చి చూస్తుంది. వెళ్లిపోమంటే రాజు రూపని రమ్మని చెప్తాడు. రూప వెళ్తుంది. రాజు కారులోనే కూర్చొంటుంది. విరూపాక్షి ఇచ్చిన పాయసం రూపకి తినిపిస్తాడు. ఇక ఫోన్ మాట్లాడుతూ ఉన్న సూర్య ప్రతాప్ కారులో లైటింగ్ రావడం  చూస్తాడు. కారు దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మామని ఇచ్చి పడేసిన జ్యోత్స్న.. అమ్మా, అత్తల్ని కలపడానికి దీప చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
Karthika Deepam 2 Serial Today August 10th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సంచలన నిర్ణయం! సూరజ్ మీద ప్రేమ కారణమా?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సంచలన నిర్ణయం! సూరజ్ మీద ప్రేమ కారణమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget