అన్వేషించండి

Trinayani Serial Today January 25th - 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి చీరని టచ్‌ చేసిన తిలోత్తమకు చుక్కలు చూపించిన అమ్మవారు!

Trinayani Serial Today Episode: గాయత్రీ దేవి చివరి సారిగా కట్టిన చీరను గాయత్రీ పాప మీద వేయాలి అని తిలోత్తమ ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode: స్టోర్‌ రూంలో ఉన్న పెట్టెను తిలోత్తమ విశాల్ చేత ఓపెన్ చేయిస్తుంది. అందులో గాయత్రీ దేవి చీర ఉంటుంది. ఇంట్లో పెద్దత్తయ్య చీరలు అన్ని ఉండగా ఈ చీరను ఇంత భద్రంగా ఎందుకు దాచారు అని హాసిని అడుగుతుంది. దానికి విశాల్ అమ్మ చివరి సారిగా కట్టిన చీర ఇది అని చెప్తాడు. 

విక్రాంత్: బ్రో పెద్దమ్మ ప్రాణాలు వదిలినప్పుడు వంటి మీద ఉన్న చీర ఇదే కదా..
తిలోత్తమ: అవును అక్కడక్కడ రక్తపు మరకలు కూడా పడి ఉంటాయ్. ఏం నాన్న నన్ను పట్టుకోనివ్వు చీరని అని అడుగుతుంది. గాయత్రీ దేవి వస్తువులను తిలోత్తమ నేరుగా పట్టుకోకూడదు అని అఖండ స్వామి తిలోత్తమ చేతుల్లో ఏదో పొడి వేస్తారు. ఇక విశాల్ ఆ చీరని తిలోత్తమ చేతుల్లో పెడతాడు. 
నయని: గత జన్మలో అమ్మగారి ప్రాణాలు తీసిన ఈ రాక్షసికి మళ్లీ ఈ చీరను ముట్టుకోవడానికి మనసు ఎలా వచ్చిందో. 
సుమన: చీర తీసుకోగానే డల్ అయిపోయారు ఏంటి అత్తయ్య.
తిలోత్తమ: ఇన్నాళ్లు గాయత్రీ అక్కయ్య జ్ఞాపకాల్ని తలచుకునేవాళ్లం కదా సుమన ఇప్పుడు ఈ చీరని పట్టుకోగానే అక్కనే పట్టుకున్నట్లు అనిపిస్తుంది. 
డమ్మక్క: పట్టుకోవాలి అనే చీర పట్టుకున్నారు కదా అమ్మ.
తిలోత్తమ: దొంగ ఏడుపు ఏడుస్తూ.. అయ్యో అక్కా. మమల్ని వదిలేసి ఎలా వెళ్లిపోవాలి అనిపించింది నీకు. 
విశాల్: అమ్మా బాధ పడకు ఊరుకోండి.
నయని: మీరు కాబట్టి ఓదార్చుతున్నారు. నాకైతే ఈ హంతకురాలిని ఆ చీరతోనే ఉరి వేయాలి అనిపిస్తోంది. చూసింది చాలు అత్తయ్య ఇక బాబుగారికి ఇచ్చేయండి పెట్టెలో పెడతారు.
వల్లభ: తిరిగి ఇందులో పెట్టడానికి కాదు తీసుకురమ్మని లేదు పెద్ద మరదలా..
నయని: ఇంకేం చేద్దామని చివరి జ్ఞాపకాన్ని కూడా పాడు చేయకండి. 
గురువుగారు: సుమంగళిగా వెళ్లిపోయిన గాయత్రీ దేవి మళ్లీ పునర్జన్మ ఎత్తింది. తాను పెరిగి పెద్దదై ఈ చీర మళ్లీ కట్టుకోవాలి. 
తిలోత్తమ: మంచి మాట చెప్పారు గురువుగారు. అయితే అక్కయ్య ఎప్పుడు వస్తుందో ఏంటో కానీ ఈ పుష్య పౌర్ణమి అయిన ఈ రోజు ఈ గాయత్రీ పాపనే గాయత్రీ  అక్కయ్యగా అనుకోమన్నారు కాబట్టి ఈ పాప మీదే ఈ చీర వేస్తే అక్క ఒంటి మీద వేసినట్లు సంతోషపడతాం కదా. అందరూ షాక్ అవుతారు. 
సుమన: నాకు నచ్చలేదు.. ఈ పిల్లకి గాయత్రీ దేవి గారి పేరు ఉన్నంత మాత్రానా జాతకం బాగుంది అని అన్నంత మాత్రాన మనకి మనమే పొంగిపోతే మనవాళ్ల కన్నా బయటి వాళ్లకే ఎక్కువ విలువ ఇచ్చినట్లు ఉంటుంది.
గురువుగారు: సుమన అన్నదాంట్లో తప్పు ఏం కనిపించడం లేదు.
తిలోత్తమ: అదేంటి గురువుగారు సుమన ఏమన్నా అభ్యంతరం చెప్పేవారు కదా ఇలా అంటున్నారు ఎందుకు.  
గురువుగారు: విడిచిన బట్టని పసిబిడ్డ మీద వేయడం ఎందుకు.
తిలోత్తమ: రక్తం పడింది అని మైల పడింది అనుకోం గురువుగారు. ఇది అక్క చీర. 
విశాల్: అమ్మా గాయత్రీ పాప మీద చీర వేయడం దేనికి.  
తిలోత్తమ: అమూల్యమైన చీరని పాప మెడలో అలా వేసి ఇలా తీస్తాను. విశాల్ క్షణికానందం అయినా నా జీవితంలో ఉండకూడదా..
వల్లభ: అరేయ్ ఒక్క నిమిషం కూడా కాదురా జస్ట్ అలా అంతే..
విశాల్: అలాగే.. కానివ్వండి అన్నయ్య.
నయని: బాబుగారు..
విశాల్: పర్వాలేదు లే నయని.. అమ్మా చీర పాప మీద ఎక్కువ సేపు ఉంచకండి.
తిలోత్తమ: గాయత్రీ పాప ఇలా చూడుమ్మ.. మా అక్క చీర నీ వంటి మీదకు ఎలా వస్తుందో చూడు చూడు.. అని తిలోత్తమ చీర వేయడానికి వెళ్తుంటే గురువుగారు హాసినికి సైగ చేస్తారు. దీంతో హాసిని అమ్మవారు పూనినట్లు నటిస్తుంది. తిలోత్తమ గొంతు పట్టుకొని హల్ చల్ చేస్తుంది. దీంతో గాయత్రీ పాప మీద చీర వేయడం పోస్ట్ పోన్ అవుతుంది.  
గురువుగారు: శుభం భుయాత్..
తిలోత్తమ: అశుభం గురువుగారు కొంచెం ఉంటే నా ఊపిరి ఆగిపోయేది.
విశాల్: చీర కావాలా అమ్మా.
తిలోత్తమ: ఏ చీరా వద్దు. కొన్నాళ్లు కొత్త చీర కూడా కొనను. పెట్టెలో పెట్టు. 

విశాల్: నయని ఈ బాక్స్ స్టోర్ రూంలో పెట్టకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం.
విక్రాంత్: నేనే తీసుకురమ్మన్నాను బ్రో.
విశాల్: ఎందుకు.
నయని: ఈ ప్రశ్న తిలోత్తమ అత్తయ్యని ఎందుకు అడగలేదు మీరు. గాయత్రీ అమ్మ జ్ఞాపకాల్ని హాల్‌లోకి తీసుకురమ్మన్నప్పుడు.
విశాల్: స్టోర్‌ రూం తాళాలు వల్లభ అన్నయ్య వాళ్లు దొంగతనంగా తీసుకెళ్లారు కానీ అక్కడి నుంచి ఏ వస్తువు పోలేదు. మనకి డౌట్ వచ్చాక అమ్మ వచ్చి ఈ బాక్స్ ఒకసారి తీసుకొస్తావా అని అడిగింది. 
విక్రాంత్: తిరిగి ఎందుకు ప్రశ్నించలేదు బ్రో.
విశాల్: విక్రాంత్ అమ్మ కేసు క్లోజ్ అయిపోయాక మళ్లీ ఈ చీరని బయటకు తీస్తే ప్రాబ్లమ్ వస్తుంది అని తెలుసు.
నయని: ఎవరికి ప్రాబ్లమ్ వస్తుంది. 
విశాల్: మా అమ్మని హత్య చేసినవాళ్లకి.. 
నయని: ఎవరు హత్య చేశారు అనుకుంటున్నారు.
విశాల్: అనుమానం ఉంటే ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చేవాడిని కదా నయని. 
విక్రాంత్: బ్రో నీకు ఎంత తెలుసో వదినకు కూడా అంతే తెలుసు అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే ఇద్దరూ మాట్లాడుకోండి. లేదంటే ఒకరికి ఒకరు తెలియకుండా అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్లినప్పుడు అనుకోని పరిణామాలు జరగొచ్చు.
విశాల్: అర్థమవుతుంది. 
నయని: అత్తయ్య అమ్మగారి చీరను చేతుల్లోకి తీసుకొని గాయత్రీ పాప మెడలో ఎందుకు వేయాలి అనుకుందో అర్థం కావడం లేదు. 
విశాల్: అమ్మ పేరు ఉంది కదా..
విక్రాంత్: బ్రో పెద్దమ్మ పేరు ఉన్న పాపని ఇనాళ్లు ఎగతాళి చేసేవారు ఇప్పుడు ఎందుకు చీరను కప్పి సన్మానించబోయారు అని వదిన ప్రశ్న.
విశాల్: రేయ్ సడెన్‌గా ఇలా అడిగితే నేను అయినా సమాధానం చెప్పాలి కదా..
నయని: సరే బాబుగారు ఈ విషయం వదిలేయండి.. హాసిని అక్క ఎందుకు అమ్మవారు పూనినట్లు ఊగిపోయింది. 
విక్రాంత్: హాసిని అక్కకి అమ్మవారు తన మీదకు వచ్చినట్లు నటించాల్సిన అవసరం ఏంటి బ్రో.
విశాల్: నటించాలే ఉంటే చేతులతో అమ్మ గొంతు ఎందుకు బిగిస్తుంది.
నయని: నటించకపోతే అత్తయ్య ప్రాణాలను అమ్మగారు ఎందుకు తీస్తారు. అవునా బాబుగారు. అంటే ఇక్కడ హాసిని అక్క మనసులో ఏం ఆలోచించి అలా చేసిందో.. అత్తయ్య ఈ చీర ఎందుకు బయటకు రప్పించిందో గాయత్రీ పాప మీదనే ఎందుకు ఈ చీర వేయాలి అనుకున్నారో ఈ మూడు విషయాలు లోతుగా ఆలోచించాలి. 
విక్రాంత్: వదినా వాళ్లు వీళ్లు కాదు కానీ బ్రోనే చాలా విషయాలు మనతో చెప్పాలి అనుకుంటా.. చీర ఇవ్వండి స్టోర్ రూంలో పెడతా అని చీర తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 24th: ఆదర్శ్ రాకతో భవాని ఇంట్లో సందడి, మురారికి ఇచ్చిన మాటకు ముకుంద కట్టుబడి ఉంటుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Embed widget