Krishna Mukunda Murari Serial Today January 24th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్ రాకతో భవాని ఇంట్లో సందడి, మురారికి ఇచ్చిన మాటకు ముకుంద కట్టుబడి ఉంటుందా!
Krishna Mukunda Murari Serial Today Episode: ఇంటికి వచ్చిన ఆదర్శ్ ముకుంద అంటే తనకు చాలా ఇష్టమని ముకుందతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode: ముకుంద మీద మధుకి అనుమానం వస్తుంది. ఆదర్శ్ వస్తాడని తెలియడంతో ముకుంద టెన్షన్ పడటం చూసిన మధు ముకుంద ఇంకా మారలేదు అనుకుంటాడు. తన మీద మధుకి అనుమానం వచ్చింది అని ముకుంద కూడా గుర్తిస్తుంది. అందుకే ఆదర్శ్ రావడం తనకు ఇష్టమే అన్నట్లు ప్రవర్తిస్తుంది. కానీ లోలోపల ప్రేమించిన వాడు ఎదురుగా ఉంటే ఇంకో వ్యక్తితో ఎలా కలిసి ఉండాలి అని బాధపడుతుంది. ఇంతలో ముకుందకి వాళ్ల నాన్న ఫోన్ చేస్తాడు.
శ్రీనివాస్: మీ అన్న నన్ను బంధించాడు కదా ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చేశానమ్మ. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా.. ముకుంద నిన్నే మాట్లాడవేంటి. ఎక్కడున్నావ్..
ముకుంద: ఎక్కడుంటాను నాన్న. మా ఇంట్లోనే ఉన్నాను. ఆదర్శ్ వస్తున్నాడు నాన్న. కృష్ణ, మురారి వెళ్లి తీసుకొస్తున్నారు.
శ్రీనివాస్: అవునా వాళ్లు పిలిస్తే ఆదర్శ్ రావడానికి ఒప్పుకున్నాడా.. నిజమే చెప్తున్నావా.. ముకుంద ఫోన్ కట్ చేసేస్తుంది.
మరోవైపు నందూకి కృష్ణ వాళ్లు ఫోన్ చేసి వచ్చేస్తున్నాం అని చెప్పడంతో తెగ హడావుడి చేస్తుంది. భవానితో పాటు మిగతా అందరూ హాల్‌లో ఎదురు చూస్తూ ఉంటారు.
భవాని: ఆదర్శ్ వస్తున్నాడు అని అందరూ సంతోషంగా ఉంటే తన మొఖంలో మాత్రం ఎలాంటి ఆనంద ఛాయలు కనిపించడం లేదు ఏంటి.
ముకుంద: ఎక్కడ వరకు వచ్చారు. ఫోన్ చేశారా..
ప్రసాద్: వచ్చేస్తున్నారు అంట పక్కనే ఉన్నారు.
మధు: అదిగో వచ్చేశారు.
మురారి: రేయ్ పదరా నేను లగేజ్ తీసుకొస్తాను. ఏంట్రా అలా ఉండిపోయావు తమరి రాక కోసం ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్.. నందూ మధు చేసిన డెకరేషన్ చూపించి.. ఇక ఆదర్శ్‌ని చూసి భవాని ఎమోషనల్ అవుతుంది. మధు వచ్చి హగ్ చేసుకొని ఆదర్శ్ నడుచుకుంటూ వస్తే స్వాగతం అంటూ పూలు వేస్తాడు. మరోవైపు ముకుంద ఆదర్శ్‌ని చూసి అలాగే ఉండిపోతుంది. నందూ, సుమలత, ప్రసాద్ అందరూ ఆదర్శ్ దగ్గరకు వెళ్లి బాగోగులు అడుగుతారు. రేవతి హారతి తీసుకొచ్చి ఆదర్శ్‌కి దిష్టి తీస్తుంది.
ఆదర్శ్: ఎలా ఉన్నావ్ అమ్మా..
రేవతి: ఇప్పుడు బాగోగులు అడుగుతున్నావారా.. ఇన్నాళ్లు ఎక్కడున్నావు ఏమైపోయావు. ఎలా ఉన్నావో తెలీదు..
సుమలత: ఒక ఫోన్ చేస్తే నీ సొమ్ము ఏం పోతుందిరా..
కృష్ణ: ఇప్పుడు మనిషి వచ్చేశాడుగా లేనప్పుడు సంగతి ఇప్పుడు ఎందుకు.
భవాని: ఆదర్శ్‌ని చూసి హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఆదర్శ్ ఇన్నిరోజులు పట్టిందా ఈ ఇంటికి రావడానికి.. ఎవరో పిలిస్తే కానీ రాకూడదు అని నువ్వు ఫిక్స్ అయిపోయావా..
ఆదర్శ్: అదేం లేదు అమ్మా.
భవాని : అయితే మరెందుకు రాలేదురా..
మధు: నేను చెప్తా పెద్ద పెద్దమ్మ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని వెళ్లిపోయాడు. కానీ తన కోసం కూడా ఎదురుచూసే మనసు ఉందని తిరిగి వచ్చాడు. అంతే కదా బ్రో.
కృష్ణ: కరెక్ట్ చెప్పావు మధు. ఆ ఎదురు చూసే మనసు అక్కడ ఉంది చూడు ఆదర్శ్. ఇంకా ఇక్కడే నిల్చొంటావ్ ఏంటి ఇన్నాళ్ల దూరం సరిపోలేదా వెళ్లు. అని ముకుంద మీదకు తోస్తుంది. ముకుంద, ఆదర్శ్ ఒకర్ని ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు.
ముకుంద: మనసులో.. భగవంతుగా ఈ పరిస్థితిని ఎదుర్కొవడం చాలా కష్టంగా ఉంది. నన్ను కాపాడు.
కృష్ణ: అయ్యో తల దించుకుంటావ్ ఏంటి ముకంద. ఏంటి ఇదంతా సిగ్గే.
నందూ: ఈరోజు అన్నీ ఆదర్శ్ అన్నయ్యకి నచ్చిన వంటలే చేశాం నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి మురారి.
మధు: ఆదర్శ్ అన్నయ్య కోసం మురారి లవ్‌లోనే కాంప్రమైజ్ అయ్యాడు వంటల్లో అవ్వలేడా..
రేవతి: ఇప్పుడు అవన్నీ ఎందుకురా ఎవరి కోసం ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎవరికి రాసిపెట్టిన వాళ్లు వాళ్ల జీవితంలోకి వచ్చారు.
భవాని: ఆదర్శ్ నీతో మాట్లాడాలి. అందరూ వెళ్లిపోతారు. ముకుంద ఉంటుంది. అప్పుడు భవాని ఆదర్శ్ నీతో మాత్రమే మాట్లాడాలి అంటుంది. దీంతో ముకుంద వెళ్లిపోతుంది.
ఆదర్శ్: ఏంటి అమ్మా..
భవాని: ఇన్నాళ్లు నువ్వు దూరంగా ఉన్నా ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉన్నానో తెలుసా దగ్గరగా ఉంటూ మానసిక క్షోభ అనుభవించడం కంటే దూరంగా ఉన్నాగాని మనస్ఫూర్తిగా ఉంటావు అనే నమ్మకంతో.
ఆదర్శ్: అమ్మా జరిగిపోయిన వాటి గురించి ఎందుకు ఇప్పుడు.
భవాని: జరగబోయేది మంచిగా ఉండాలి అంటే జరిగిన దాని గురించి తెలుసుకోవాలి నాన్న. నువ్వు ఇక్కడ లేని సమయంలో ఈ ఇంట్లో చాలా జరిగాయి.
ఆదర్శ్: అమ్మా కృష్ణ, మురారి కథ అంతా చెప్పారు.
భవాని: అయితే నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే ఇక్కడికి వచ్చావు కదా..
ఆదర్శ్: ఇష్టపడే వచ్చాను అమ్మా. అసలు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిందే ముకుంద మారలేదు అని ఇక మారదు అని.. ఇప్పుడు తను మారింది అని తెలిశాక నాకోసం ఎదురుచూస్తుంది అని తెలిశాక రాకుండా ఎలా ఉంటాను చెప్పు. మళ్లీ ఏమైనా జరుగుతుందేమో.. మళ్లీ వెళ్లిపోతాను ఏమో అని అస్సలు భయపడకు అమ్మా. మిమల్ని ఈ ఇంటిని, ముకుందని వదిలి పెట్టి అస్సలు నేను ఎక్కడికి వెళ్లనమ్మ.
భవాని: సరే సరే నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి రా.. మనసులో.. ఆదర్శ్, ముకుంద సంతోషంగా ఉంటే.. కృష్ణ, మురారిలు సంతోషంగా ఉంటారు. అంతకన్నా కావాల్సింది ఏముంది. కానీ ముకుందలో నిజంగా మార్పు వచ్చిందా.. మురారిని పూర్తిగా మర్చిపోయి వీడితో సంతోషంగా ఉంటుందా. అలా అని ముకుంద మారిందని కచ్చితంగా చెప్పలేం ఏం ఆధారం లేదు. తన మనసులో ఏముందో కాలమే నిర్ణయించాలి.
ముకుంద: నా పరిస్థితి ఏంటి.. నేను ఇప్పుడు ఏం చేయాలి. మురారికి మాటిచ్చాను కాబట్టి ఆదర్శ్‌కి నో చెప్పలేను కానీ కలిసి ఉండటం ఎలా సాధ్యం. ఆదర్శ్ రాడు అనే నమ్మకంతో మాటిచ్చేశాను. నా కళ్లముందే కృష్ణ, మురారిలు సంతోషంగా ఉన్నా సరే భరిస్తూ బతికేస్తాను అని నమ్మకంతో మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పగలనా.. నన్ను అందరూ ఇంటి నుంచి తరిమేస్తుంటే కృష్ణ అడ్డుపడింది. మళ్లీ తనకి అన్యాయం చేస్తే నేను మనిషిని అనిపించుకుంటానా. అలాగని ఆదర్శ్‌తో జీవితం పంచుకోవడం ఈ జన్మలో కుదరదు.
ఆదర్శ్: సారీ ముకుంద..
ముకుంద: ఎందుకు.
ఆదర్శ్: నిన్ను అపార్థం చేసుకున్నందుకు. అవును ముకుంద నీ మనసు ఏంటో సరిగా అర్థం చేసుకోకుండా నేనే అపార్థం చేసుకొని ఆవేశంతో వెళ్లిపోయాను. నేను నిన్ను ప్రేమించాను ముకుంద. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని ఆదర్శ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.