అన్వేషించండి

 Trinayani Serial Today January 17th: ‘త్రినయని’ సీరియల్ : విశాలాక్షిని తిట్టిన వల్లభ – నిజం తెలుసుకున్న రత్నాంభ

Trinayani Today Episode: త్రినేత్రి చనిపోయిందని దురందర, నయని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రత్నాంభ వెళ్లి వింటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Trinayani Serial Today Episode: తిలొత్తమ్మ చనిపోతుందని చెప్పిన విశాలాక్షిని ఇంకా ఎన్నాళ్లు బతుకుతుంది అని విక్రాంత్ అడుగుతాడు. ఎన్నాళ్లు కాదు చిన్నాన్న నాలుగు రోజుల్లో చనిపోతుందని విశాలాక్షి చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. తర్వాత రూంలో కూర్చుని ఆలోచిస్తున్న నయని దగ్గరకు దురందర వెళ్తుంది.

దురందర: నువ్వు చెప్పిన విషయం నిజమైతే ఎంత బాగుండేదో కదా నయని

నయని: నిజం పిన్ని త్రినేత్రి దేవీపురం వెళ్లి కాళికాదేవి అమ్మవారి పూజ చేస్తూ ఎప్పట్లా తన జీవితాన్ని సుఖసంతోషాలతో జీవిస్తే బాగుండు కదా

దురందర: అమ్మవారి దగ్గరకే వెళ్లి అక్కడే తను అమ్మవారిలో ఐక్యం అయిందన్న  విషయం బామ్మ గారికి తెలియదు పాపం

ఇంతలో రత్నాంభ  వస్తుంది.

రత్నాంభ: తెలుసు.. నాకు అంతా తెలుసు.. ఎంటమ్మా అలా చూస్తున్నారు. నా మనవరాలు మా ఊరికే వెళ్లి ఉంటుందని నాకు తెలుసు.. చూశావా నయని మీ పిన్ని నన్ను ఆట పట్టించి కంగారు పెట్టిద్దామనుకుంటుంది.

దురందర: బామ్మ గారు మీరు ఎలా అనుకుంటే అలా

నయని: మనవరాలు ఊరు వెళ్లిందని చెప్పగానే బామ్మ ముఖంలో వెలుతురు వచ్చింది చూడు

రత్నాంభ: ఎందుకు రాదమ్మా  నా మనవరాలు అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసి వస్తే మరుసటి రోజు వరకు నా మనవరాలి చుట్టు కాంతి వలయం ఉండేది అది చూసిన ఊరి జనం నోరు వెళ్లబెట్టేవారు

నయని: అది చూసే భాగ్యం మనకు లేదు అత్తయ్యా

దురందర: ఈసారి వెళ్లి చూద్దాం నయని

రత్నాంభ: బాగా చెప్పావు దురందర. మాఘమాసంలో రండి మా ఊర్లో అమ్మవారికి ఉత్సవాలు ఉంటాయి

అని చెబుతూ రత్నాంభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వల్లభ లెక్కలు వేస్తుంటే తిలొత్తమ్మ వెళ్లి ఏం చేస్తున్నావు వల్లభ అని అడుగుతుంది. వల్లభ పలకకుండా లెక్కలు వేస్తుంటే.. చెవి పట్టుకుని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.

వల్లభ: ఈ నాలుగు రోజులు నీకు కష్టం ఎప్పుడొస్తుందోనని లెక్కలు వేస్తున్నాను మమ్మీ.

తిలొత్తమ్మ: అరేయ్‌ నీకు జ్యోతిష్యం తెలిస్తే నువ్వు ఎప్పుడో బాగుపడేవాడివి

వల్లభ: ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఎలాగూ ఈ శుక్రవారం పోతున్నావు కాబట్టి   నీ కొడుకుల యోగక్షేమాలు కోరుకుంటున్నావు అంతే కదా మమ్మీ.

తిలొత్తమ్మ: నేను కచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో పోతానని మీ అందరికీ నమ్మకం కుదిరింది. ఎందుకంటే గాయత్రి పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. అయితే నా జాగ్రత్తలో నేను ఉంటే గనక అయిదో రోజులోకి అడుగుపెట్టడం జరగుతుంది. అప్పుడు విశాలాక్షి అన్నది అబద్దం అని తేలుతుంది.

వల్లభ: ఈ గండం గట్టెక్కితే ఇక నీకు తిరుగుండదు మమ్మీ

అని వల్లభ అనగానే అవును అంటుంద తిలొత్తమ్మ..   మరుసటి రోజు వల్లభ ఇల్లంతా తిరుగుతూ విశాలాక్షిని పిలుస్తుంటాడు.

హాసిని: ఏంటి చెప్పండి

వల్లభ: ఏయ్‌ నీ పేరు విశాలాక్షా..?

హాసిని: కట్టుకున్న పెళ్లాం పేరే మర్చిపోయావా

వల్లభ: ఏయ్‌ విశాలాక్షి.. ఎక్కడున్నావు..?

నయని: బావగారు పేరుకు ముందు ఏయ్‌ ఏంటి గౌరవంగా పిలవకూడదా..?

విశాలాక్షి: ఎవరో నన్ను పిలుస్తు్న్నారా ఇక్కడ

తిలొత్తమ్మ: చూశారా ఎంత పొగరు.. సరే కానీ నేను చనిపోతాను అన్నావు కదా ఎలా చనిపోతానో చెప్పలేదు.

విశాలాక్షి:  మీ ప్రాణం తీసేది గాయత్రి అమ్మగారే అని అందరికీ తెలుసు కదా

అని విశాలాక్షి చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రత్నాంభ అంత చిన్న పిల్ల గాయత్రి..  తిలొత్తమ్మ ప్రాణాలు హరిస్తుందా..? ఆశ్చర్యంగా ఉందే అంటుంది. ఇంతలో నయని మా అత్తయ్య ప్రాణం పోతే మోక్షం లభిస్తుందా..? అని అడిగితే లభించదని తిలొత్తమ్మ చనిపోయి దురందర కడుపులో పుడుతుందని చెప్తుంది. దీంతో అందరూ మళ్లీ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
Karthika Deepam 2 Serial Today May 23rd: కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
Godavari Serial Today May 23rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
Nindu Noorella Saavasam Serial Today May 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
IPL 2026 Mohammed Shami: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
Honda City Facelift News: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే
Embed widget