Trinayani Serial Today January 15th: ‘త్రినయని’ సీరియల్ : తిలొత్తమ్మ చావును కోరుకున్న వల్లభ – విశాలాక్షిని తిట్టిన రత్నాంభ
Trinayani Today Episode: స్వామిజీ చేసిన సాయం గురించి మాట్లాడుకుంటుంటే హాసిని వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Trinayani Serial Today Episode: వల్లభ వచ్చి ఏంటి మమ్మీ సొంత చెల్లి ముందు అక్కను చంపేస్తానంటున్నావు అంటాడు. ఆస్థులు వస్తాయంటే సొంత అక్క లేదు.. సొంత చెల్లి లేదురా అంటుంది తిలొత్తమ్మ.. సుమన కూడా అవును నాకు అప్పనంగా ఆస్తి వస్తే అక్కేంటి అంటుంది. అమ్మా డబ్బులు అంటే ఎంత పిచ్చి సుమన నీకు అంటాడు వల్లభ.
సుమన: డబ్బు లేని వాళ్లను ఈ లోకం పిచ్చొళ్లలా చూస్తుంది బావగారు.. అత్తయ్యా మీ ఐడియా ఏంటో చెప్పండి.
తిలొత్తమ్మ: త్రినేత్రి, నయనిలా నటించి ఎంత ఆస్తిని వెనకేసుకుందో కనుక్కుందాం. అలాగే దాన్ని పట్టుకుని పోలీసులకు పట్టించుకుండా దోచుకున్న దాంట్లో కాస్త వాటా ఇస్తామని చెప్పి త్రినయనిలా మార్చేసి మన వాటాలు పంచుకుందాం.
అని తిలొత్తమ్మ చెప్పగానే మీ ఐడియా బాగుంది అత్తయ్యా.. నేను వెళ్లి కాపీ తీసుకొస్తాను అంటూ వెళ్లిపోతుంది. మరోవైపు గురువు గారితో నయని, దురందర, విక్రాంత్ మాట్లాడుతుంటారు.
దురందర: గురువు గారు మీరు మా వదిన వాళ్ల మాటలు నమ్మి నయని కోమాలో ఉన్న నిజాన్ని చెప్తారని చాలా కంగారు పడ్డాం.
గురువు: అలా ఎలా చేస్తాను దురందర. ఆ నేత్రి ఎంతో పుణ్యం చేసుకుంది. తన ప్రాణం కాళికాదేవి అమ్మవారిలో ఐక్యం అయినా ఇంకా ఆ శరీరం సత్ కార్యాలు చేస్తుంది.
నయని: మీరు గాయత్రి పాపను తీసుకుని వెళ్లినప్పుడే మాకు అర్థం అయింది స్వామి..
గురువు: నాదేం ఉంది నయని నువ్వు సమయస్పూర్తితో వ్యవహరిస్తావని నాకు తెలుసు
ఇంతలో హాసిని వస్తుంది.
హాసిని: ఈరోజు నా జీవితంలో గుర్తు పెట్టుకునే స్పెషల్ డే చెల్లి. అవును నాకో సందేహం ఇన్నాళ్లు త్రినేత్రియే నయనిలా నటించింది అనుకుందాం.. ఆరోజు వైకుంఠం పాలలో విషం కలిపితే ఎలా కనిపెట్టింది.
గురువు: చాలా తెలివిగా ఆలోచించావు హాసిని
నయని: నా ఆత్మ ఈ ఇంట్లోనే తిరిగేది నా వాళ్లకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటూ ఉండేదాన్ని.. ఆరోజు త్రినేత్రి లోకి దూరి నిన్ను కాపాడాను అక్క.
హాసిని: ఇదేదో సినిమా కథలా ఉంది.
విక్రాంత్: కథలా ఉన్నా నమ్మాలి వదిన.. ఎందుకంటే ఆరోజు అద్దంలో కూడా వదిన ఆత్మ కనిపించింది కదా
అని విక్రాంత్ చెప్పగానే అవును నిజమే కదా అంటుంది హాసిని. తర్వాత రత్నాంభ ఇంటికి వస్తుంది. మళ్లీ ఎందుకు వచ్చావని సుమన తిడుతుంది. ఇంతలో తిలొత్తమ్మ వచ్చి నువ్వు నీ మనవరాలు చేసిన గూడు పుఠాణి అందరికీ తెలిసిపోయింది అంటుంది. అయితే నాటకం మొత్తం మీకు తెలిసిపోయిందా అని రత్నాంభ అడుగుతుంది. అవునని వల్లభ చెప్తాడు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఇంటికి వచ్చావు అని తిలొత్తమ్మ కోపంగా రత్నాంభను తిడుతుంది. ఇంతలో నయని వచ్చి తిలొత్తమ్మను తిడుతుంది. వాళ్ల మాటలకు రత్నాంభ కన్పీజ్ అవుతుంది. ఇంతలో విశాలాక్షి వస్తుంది. ఎందుకు వచ్చావని వల్లభ అడిగితే మీకు సాయం చేయడానికే వచ్చానని చెప్తుంది.
వల్లభ: ఏ సాయం చేస్తావు..
విశాలాక్షి: ఈ ఇంట్లో ఒకరు అర్దాంతరంగా కళ్లు మూస్తారు. అది చెప్పడానికే వచ్చాను. అది ఎవరో కాదు మీ అమ్మ తిలొత్తమ్మ.
తిలొత్తమ్మ: సాయం చేయడానికి వచ్చానని చెప్పి నన్ను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావా గారడి పాప
విశాలాక్షి: నేను ఉండకూడదు అంటే వెళ్లిపోతాను.
వల్లభ: వద్దులే గారడి పాప నువ్వుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది
హాసిని: అత్తయ్యా చూశారా మేం కాదు మీ కొడుకే మీరు ఎప్పుడెప్పుడు పోతారో అని ఎదురుచూస్తున్నాడు.
అంటూ హాసిని చెప్పగానే వల్లభ కంగారుపడతాడు. మమ్మీ నేను అలా అనలేదు అంటాడు. తిలొత్తమ్మ వల్లభను తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















