Trinayani Serial Today December 9th: 'త్రినయని' సీరియల్: ఫ్రింగర్ ఫ్రింట్స్‌తో పట్టించే ప్రయత్నం.. చిట్టి పాప రాకతో ఏదో జరిగిందే?
Trinayani Today Episode నయని, త్రినేత్రి ఒకటి కాదని నిరూపించడానికి తిలోత్తమ అఖండ స్వామితో కలిసి ముద్రలు సేకరించి సరిచూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode వల్లభ నయని వేలిముద్రలు ఉన్న పేపర్‌ని తీసుకొచ్చి అఖండ స్వామికి ఇస్తారు. అఖండ స్వామి వాటిని తీసుకొని అందరి దగ్గరకు వస్తారు. అఖండ స్వామి అందరికీ ఆ పేపర్ మీద ఉన్న నయని అరచేతి అచ్చు చూపిస్తారు. దాని ఆధారంగా నిజం నిరూపిస్తానని చెప్తారు. అందరూ షాక్ అవుతారు. ఇక వల్లభ మరో పేపర్ అందులోకి నీలం రంగు పట్టుకొని వస్తాడు.
త్రినేత్రితో ఆ రంగును చేతికి అత్తుకొని రెండు చేతులతో పేపర్ మీద అచ్చులు వేయమని అఖండ స్వామి చెప్తారు. అలా ఎందుకు అని అందరూ అడిగితే దసరా రోజు నయని వేసిన అచ్చులకు ఇప్పుడు త్రినేత్రి అచ్చులకు సరి చూసి అది నయనినా కాదా అని తేల్చుకుందామని అంటారు అఖండ స్వామి. విశాల్, హాసిని తను నయనినే అని నమ్మకంతో రంగులు వేయమని అచ్చులు తేడా రావని చెప్తారు. ఇదే చివరి పరీక్ష అని మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని విశాల్ చెప్తాడు. దాంతో తిలోత్తమ ఈ ఒక్క పనితో మరో పరీక్ష చేసే అవసరమే రాదని తిలోత్తమ అంటుంది. ఇక త్రినేత్రి రంగుతో పేపర్ల మీద తన చేతి ముద్రలు వేస్తుంది. వల్లభ బూతద్ధంతో రెండు పేపర్లను పరీక్షగా చూస్తుంటారు. ఇక గాయత్రీ పాప అక్కడికి వస్తుంది. ఇక త్రిలోత్తమ వాటిని తీసుకొని పోలిక చూడటానికి రెడీ అవుతుంది. ఇక గాయత్రీ పాప వచ్చి అఖండ స్వామి దగ్గర ఉన్న పేపర్ తీసుకోబోతుంది. ఇంతలో అఖండ స్వామి తీసుకుంటారు.
అఖండ: నువ్వు చూడు తిలోత్తమ త్రినేత్రి ముద్రలకు శంఖం ఉందా చక్రం ఉందా.
తిలోత్తమ: శంఖం ఉంది స్వామి.
అఖండ: నయని ముద్రలకు కూడా శంఖం ఉంటే అనుమానించాల్సిన పనే లేదు అలా కాకుండా చక్రం ఉంటే ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.
తిలోత్తమ: చక్రం ఉంది స్వామి.
హాసిని: చెల్లి బొటను వేలికి కూడా శంఖమే కదా ఉండేది చక్రం ఎలా ఉంటుంది అత్తయ్య.
తిలోత్తమ: అదే నాకు అర్థం కావడం లేదు.
సుమన: రెండు మ్యాచ్ అవ్వాలి అవ్వలేదు అంటే.
విక్రాంత్: అవ్వలేదు కాదు పిచ్చి మొఖమా వదిన బొటను వేలికి శంఖం ఉంటుంది. దసరా రోజు వేసిన అచ్చులకు కూడా శంఖమే ఉండాలి కదా చక్రం ఉండటం ఏంటి.
విశాల్: అంటే అమ్మ వాళ్లే ఎవరో వేసిన అచ్చులున్న పేపర్లు తీసుకొచ్చి గొడవ చేయాలి అనుకున్నారన్నమాట. అది నయని వేసిన అచ్చు కాదు. అది మా అమ్మది నన్ను కన్న తల్లిది. తన చేతికి చక్రం ముద్రలు ఉండేవి. ఇక చాలు మీ ప్రయత్నాలు ఇక వెళ్లండి తను నయని కాకపోయినా ఏం పర్లేదు మీరు ముందు వెళ్లండి స్వామి.
తిలోత్తమ: అయినా గాయత్రీ అక్క అచ్చ ఎప్పుడు వేసింది ఇది పాత పేపర్ కూడా కాదే.
త్రినేత్రి: గాయత్రీ పాప పేపర్ పట్టుకున్నప్పుడు ఏదో చేసింది ఏం చేసింది.
విక్రాంత్, సుమన ఇద్దరూ నయని, త్రినేత్రి గురించి మాట్లాడుకుంటారు. అత్తయ్య వాళ్ల ప్రయత్నాలు కూడా బాగానే ఉన్నాయని సుమన విక్రాంత్‌తో అంటుంది. వేలి ముద్రల్లో నిజం బయట పడిపోతుందని అనుకున్నా అని మా అక్క కూడా టెన్షన్ పడటం చూశానని సుమన అంటుంది. ఇలా ఏం మాట్లాడొద్దని నయని వేరు అని అంటే విశాల్, హాసిని కొడతారని అంటాడు. నాకెందుకు ఈ గొడవ అని సుమన వెళ్లిపోతుంది. ఇక విశాల్ త్రినేత్రితో నువ్వు నయని కాదని అంటున్నారు కదా బాధ పడుతున్నావా అని అంటాడు. దానికి త్రినేత్రి ఎవరు ఏమనుకున్నా మీకు ప్రాబ్లమ్ లేదు అందరికీ మెత్తగా కాకుండా ఒక్కటిచ్చి గట్టిగా చెప్తే మీ మాట వింటారని అంటుంది. అన్నీ కరెక్ట్ చెప్పే నువ్వు నీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నావని విశాల్ చెప్తాడు. అవును బాబు గారు నేను తెలుసుకోవాల్సినది ఏదో ఉందని చెప్పి వెళ్లిపోతుంది. ఇక తన ప్లాన్ వేస్ట్ అయిందని తిలోత్తమ వల్లభని చితక్కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆదికేశవ్ ఇంట్లో లక్ష్మీని చూసేసిన సహస్ర ఫ్యామిలీ.. విహారి పెళ్లి విషయం బయట పడిపోతుందా!