Trinayani Serial Today December 3rd: 'త్రినయని' సీరియల్: నయని రాసిన క్యారెక్టర్ ఛేంజ్ స్లిప్పులు చూసి బిత్తరపోయిన ఫ్యామిలీ.. కుడి ఎడమైందిగా!
Trinayani Today Episode విశాలాక్షి చేతులు తాకగానే త్రినేత్రి నయనిలా మారిపోవడం త్రినేత్రిగా మారిన తర్వాత తాను చేయాల్సిన పనులను పేపర్ మీద రాసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode విశాలాక్షి చేతులు తాకగానే త్రినేత్రి త్రినయనిలా మారిపోతుంది. నయనిలా మాట్లాడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. హాసిని టైం 10 అయిందని చెల్లి ఎప్పటి వరకు ఇలా ఉంటుందో గమనించాలని అనుకుంటుంది. ఇక విశాలాక్షి నయనితో అమ్మ నాన్న ఈ బిల్లని నీ మెడలో పెట్టారని అంటుంది.
చిన్నప్పుడు నుంచి ఆ బిల్ల నా మెడలోనే ఉందని నాలుగు రోజులు లేకపోయే సరికి ఏదో పొగొట్టుకున్నట్లుందని నయని అంటుంది. విక్రాంత్ విశాల్ సెల్ ఫోన్ అడిగి బ్రో పాస్ వర్డ్ చెప్పు వదినా అని అడుగుతాడు. నయని చెప్తుంది. విశాల్ నయనిని ఎవరూ అనుమానించి ఇలాంటి పరీక్షలు చేయొద్దని చెప్తాడు. ఒక్కోసారి అన్నీ తెలిసినట్లు మరోసారి ఏమవుతుంది త్రినేత్రి అని ఏం తెలీనట్లు ఉంటావని విక్రాంత్ అడుగుతాడు. దానికి విశాలాక్షి నయనమ్మ చెప్పదు చెప్పలేదు కార్యం అలాంటిదని చెప్తుంది.
తిలోత్తమ: వల్లభతో.. ఆ దారం కట్టిన తర్వాతే నయని మామూలుగా మారింది అంటావా.
వల్లభ: అవునమ్మా ఆ దారానికి పెద్ద మరదలికి గారడీ పిల్లకి ఏదో సంబంధం ఉంది.
తిలోత్తమ: ఆలోచించాల్సిన విషయమే వల్లభ.
వల్లభ: ఇంకో విషయం అమ్మ ఆ అమ్మవారి బిల్లను విశాలాక్షి హాస్పిటల్‌కి వెళ్లి తీసుకురావడం ఏంటి.. తను అక్కడికి ఎలా వెళ్లింది. యాక్సిడెంట్ విషయం బయటకు రాకుండా మీడియాని మ్యానేజ్ చేశాం కదా.
తిలోత్తమ: ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ విశాలాక్షి చాలా కూల్‌గా చిరునవ్వుతో మాట్లాడింది. నయని, విశాలాక్షి ఇంతకు ముందే బయట కలిసి వచ్చారని అనిపిస్తుంది. ఒకరు గారడీ, మరొకరు మోసం చేయాలని చూస్తున్నారు నేను రివర్స్‌లో చేస్తాను.
నయని గదిలో రెడీ అవుతుంటే విశాల్, గాయత్రీ పాపని తీసుకొని వెళ్లి నయనితో మాట్లాడుతాడు. ఎవరు గుర్తు పట్టినా పట్టకపోయినా నా బిడ్డ నన్ను గుర్తు పడుతుందని నయని అంటుంది. మెడలో ఆ తాడు కట్టడం వల్ల అయినా నువ్వు నయని కాదని మర్చిపోతే బెటర్ అని విశాల్ అంటే నయని కష్టం అని అంటుంది. విశాల్ ఎందుకు అని అడుగుతాడు.
నయని: ఏం మర్చిపోయినా ఏంటి బాబు గారు మిమల్ని అయితే మర్చిపోను కదా.
విశాల్: ఏం గుర్తుండటమో ఏంటో కానీ త్రినేత్రి అయితే నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చానని అంటుంది.
నయని: త్రినేత్రి మమల్ని పెళ్లి చేసుకోవడమా మిమల్ని ఎప్పుడు చూసింది బాబుగారు.
విశాల్: అలా అడుగుతావేంటి నయని త్రినేత్రి అంటే నువ్వే కదా నువ్వు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది.
నయని: బాబుగారు మీరు దేవీపురంలో ఏ ఆడపిల్లతోనైనా మాట్లాడారా.
విశాల్: లేదు.
నయని: మనసులో మరి త్రినేత్రి ఎలా ఇష్టపడ్డానని చెప్పింది.
విక్రాంత్ హాస్పిటల్‌కి కాల్ చేసి నయని మెడలోని దేవుడి బిల్ల ఎవరికి ఇచ్చారని అడుగుతాడు. వాళ్లు అది కనిపించడం లేదని అంటారు. ఇంతలో సుమన వచ్చి విషయం అడిగితే నయని వదిన మెడలో లాకెట్ లాకర్‌లో పెట్టి ఉంచారని ఎవరికి లాకెట్ ఇవ్వలేదని కానీ లాకర్ తెరచి చూస్తే కనిపించలేదని విక్రాంత్ సుమనతో చెప్తాడు. సుమన షాక్ అయిపోతుంది. దాంతో విక్రాంత్ ఇప్పుడు అర్థమైందా విశాలాక్షి పవర్ అని అంటాడు. హాల్‌ని పెన్నూ పేపరుతో ఏవో రాసుకుంటుంది. హాసిని ఏంటని ప్రశ్నిస్తే విశాలాక్షి కాసేపటిలో మర్చిపోతుందని రాసుకుంటుందని చెప్తుంది. విక్రాంత్ నయని వదినను ప్రశ్నించమని విశాల్‌ని అంటాడు. దానికి విశాల్ రెండు గంటల్లో అన్నీ చక్కబెట్టేసింది ఇంక ఎందుకు అంటాడు.
ఇక నయని ఏం రాసిందో అని అందరూ అడుగుతారు. నయని వద్దన్నా విశాలాక్షి ఇవ్వమని అంటుంది. అందరూ ఒక్కో పేపర్ పంచుకుంటారు. వాటిని చూసి షాక్ అయిపోతారు. గానవికి మందు వేయాలి.. విశాల్ మీటింగ్ ఉంది.. త్రినేత్రి అన్నా నయని అన్నా ఒకేలా రెస్పాండ్ అవ్వాలని.. పావనా బాబాయ్ మందు బాటిల్ పిన్ని తీసిందని చెప్పాలి.. తను విశాల్ భార్య అని ఇద్దరు పిల్లలని.. వీలైనన్ని సార్లు గాయత్రీ పాపని ఎత్తుకోవాలని టైం అయిపోతుందని రాసుంటుంది. అందరూ వాటిని చూసి షాక్ అయిపోతారు. నయనిని ఎందుకు అలా రాశావో అని అడుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.