Seethe Ramudi Katnam Serial Today December 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అయ్యే సీన్ ఇదే.. మిస్ ఇండియా అంటూ ఫ్లర్ట్ చేసిన రాకేశ్!
Seethe Ramudi Katnam Today Episode సీత ఆఫీస్‌కి వెళ్లి రామ్ మీద ఆజమాయిషీ చేయడం, మహాలక్ష్మీ సీత బండి మీద వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
Seethe Ramudi Katnam Serial Today Episode అర్చన కూతురు ఉష రోడ్డు మీద నడిచి వెళ్తుంటే రాకేశ్ ఉషని కలుస్తాడు. మన పెళ్లి గురించి మాట్లాడాలి అంటాడు. మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు కదా అని ఉష అంటే దానికి రాకేశ్ అప్పుడు నేను మంచోడిని కాదని అనుకున్నారు కానీ ఇప్పుడు నేను మారిపోయాను మంచోడిని అని అంటాడు. నేనుగా మారిన విషయం మీ పెద్దమ్మకి తెలిసే ప్రీతిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారని చెప్తాడు.
ఉష: ఒకే కానీ మా అమ్మానాన్నలకు ఇష్టం లేదు నేను వెళ్తా.
రాకేశ్: నీ మీద నా ఒపీనియన్ చెప్పనా మీ ప్రీతి అక్కకంటే నువ్వు చాలా సూపర్. ప్రీతి లోకల్ బ్యూటీ అయితే నువ్వు మిస్ ఇండియాలా ఉంటావ్. మన పెయిర్ చాలా బాగుంటుంది. ఆలోచించు ఉష అని ఫోన్ తీసుకొని తన నెంబరు టైప్ చేసి చెప్పి వెళ్లిపోతాడు.
మహాలక్ష్మీ: ఉష నీతో రాకేశ్ మాట్లాడింది అంతా విన్నాను తన మాటలు వింటుంటే నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది. నాకు అయితే రాకేశ్ నీకు పెరెఫెక్ట్ అనిపిస్తుంది.. నువ్వు కూడా రాకేశ్ నీకు నచ్చాడని చెప్తే మీ పెళ్లి బాధ్యత నాది.
ఉష: మీ ఇష్టం పిన్ని.
మహాలక్ష్మీ: సరే అయితే మీ పెళ్లి ఎప్పుడు చేయాలి అనేది నేను చూసుకుంటా. నువ్వు వెళ్లు.
ఉదయం మహాలక్ష్మీ చీరలు అమ్మడానికి రిచ్‌గా రెడీ అవుతుంది. దాంతో అర్చన వచ్చి చీరలు అమ్మడానికి ఇలా రెడీ అయ్యావేంటి అని అడుగుతుంది. నువ్వు చీరలు అమ్మగలవా అని అంటుంది. దానికి మహాలక్ష్మీ అన్నింటికీ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదని చెప్తూనే నువ్వు నాతో పాటు రావాల్సిందే అని అర్చనను అంటుంది. అర్చన తప్పదా అనుకొని బయల్దేరుతుంది. ఇక మహాలక్ష్మీ మ్యానేజర్‌కి ఫోన్ చేసి ఈ రోజు మా కోడలు సీత ఆఫీస్‌కి వస్తుందని వారం రోజులు తనే ఆఫీస్ చూసుకుంటుందని చెప్తుంది. సీత రాగానే వర్క్ గురించి అడిగి ఉక్కిరిబిక్కిరి చేయమని సీత పారిపోయేలా చేయమని చెప్తుంది.
ఇక మహాలక్ష్మీకి కిందకి వెళ్తే చలపతి చీరలు అమ్మడానికి రెడీ అయిపోయావా చెల్లాయి అంటాడు. మరోసారి ఆలోచించు అని జనార్థన్ అంటాడు. మహాలక్ష్మీ వెనక్కి తగ్గేదే లేదని అంటుంది. ఇక సీత స్టైల్‌గా రెడీ అయి ఆఫీస్‌కి రెడీ అవుతుంది. నా తెలివితో కంపెనీని లాభాలు తెస్తానని అంటుంది. ఇక మహాలక్ష్మీ రామ్‌తో ఇది ఛాలెంజ్ కాబట్టి సీతకు సాయం చేయొద్దని చెప్తుంది. రామ్ సరే అంటాడు. సీత ఆఫీస్‌కి , మహాలక్ష్మీ చీరలు అమ్మడానికి బయల్దేరుతారు. మహాలక్ష్మీ సీత వ్యాన్ ఎక్కితే సీత కారెక్కుతుంది. ఏంటీ ఖర్మ అనుకొని అర్చన తల పట్టుకుంటుంది. సీత జైలుకి వెళ్లి విద్యాదేవిని కలుస్తుంది. పందెం గురించి చెప్తుంది. ఛాలెంజ్ చాలా రిస్క్‌గా ఉందని విద్యాదేవి అంటే సీత గెలుస్తానని ధైర్యం ఉందని చెప్పి విద్యాదేవి దీవెనలు తీసుకుంటుంది.
సీత ఆఫీస్‌కి వెళ్లగానే స్టాఫ్ మీటింగ్ పెడతానని చెప్తుంది. మేనేజర్‌కి మీటింగ్ ఏర్పాట్లు చేయమని చెప్తుంది. రామ్ సీతని పలకరించబోతే సీత ముఖం తిప్పుకుంటుంది. సీత చాలా ఓవర్ చేస్తుందనుకొని రామ్ సీత క్యాబిన్‌కి వెళ్తాడు. సీత మహాలక్ష్మీ ఛైర్ మీద కూర్చొని రంగుల రాట్నంలో తిరిగినట్లు తిరుగుతుంది. రామ్ రావడంతో రామ్ రామ్ అని మాట్లాడుతుంది. నేను నీ బాస్‌ని ఇలాగే పిలుస్తానని అంటుంది. ఫైల్స్ తీసుకొని రమ్మని ఆర్డర్ వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: చెల్లిని అడ్డు పెట్టుకొని జీవన్‌ని కట్టడి చేసిన రాజు, రూపలు.. చివరి నిమిషంలో శ్వేత ఎంట్రీ!