Pavithra Jayaram: అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలనుకున్నా - ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ చివరి ఇంటర్వ్యూ
Pavithra Jayaram: ‘త్రినయని’లో విలన్‌గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు పవిత్ర జయరామ్. ఇటీవల రోడ్ యాక్సిడెంట్‌లో మరణించిన తర్వాత ఆమె పాత ఇంటర్వ్యూలో ఒకటి వైరల్ అవుతోంది.
Pavithra Jayaram: ఎంతోమంది కన్నడ నటులు.. తెలుగు బుల్లితెరపై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో బిజీగా వెలిగిపోతున్న నటీనటులు చాలామంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. అందులో ఒకరు పవిత్ర జయరామ్. ‘త్రినయని’ సీరియల్‌లో మెయిన్ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్న పవిత్ర.. తాజాగా కార్ యాక్సిడెంట్‌లో మృతిచెందారు. దీంతో ఆవిడ పాత ఇంటర్వ్యూలు, అందులో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా..
కన్నడలో ఎన్నో సీరియల్స్ చేసినా ‘త్రినయని’లో తిలోత్తమ పాత్రే తనకు ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు పవిత్ర జయరామ్. ఇండస్ట్రీలో తన కష్టాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకంటే ఎక్కువ కష్టపడినవారు ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా కష్టాలు చాలా చిన్నవి అనిపిస్తాయి. నేను ఎక్కువ పాజిటివ్‌గా ఆలోచిస్తాను అందుకే ఇలా ఉన్నాననుకుంటా’’ అని అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టింగ్ చేయాలి అని తనేం కలలు కనలేదని, ఒక పని చేస్తే అది తిండి పెడితే చాలు అనుకునేదాన్నని బయటపెట్టారు. అందుకే తను మొదటి సీరియల్‌లో నటిస్తున్నప్పుడు యాక్టింగ్ రాక డైరెక్టర్ చేత తిట్లు తిన్నానని అన్నారు. ముందుగా అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన పవిత్ర.. ఇప్పటికీ డైరెక్షన్ అంటేనే ఇష్టమని తెలిపారు.
అమ్మే ధైర్యం..
ఒకసారి తన జీవితం తనకు నచ్చక ఆత్మహత్యాయత్నం కూడా చేశానని షాకింగ్ విషయాలు బయటపెట్టారు పవిత్ర జయరామ్. ‘‘సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే ఏం తప్పు చేయకపోయినా కూడా తను తప్పు చేసింది అంటుంటారు. అలాంటివి మొదటిసారి విన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అవి వినలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను. అప్పుడు అమ్మే నాకు ధైర్యం చెప్పింది’’ అని చెప్పుకొచ్చారు. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి రావడం, తనే సొంతంగా అద్దం ముందు నిలబడి యాక్టింగ్ నేర్చుకోవడం.. ఇదంతా గుర్తుచేసుకుంటే తనే తనకు స్ఫూర్తిగా అని అన్నారు పవిత్ర. ఒకప్పుడు తన పిల్లలకు ఇష్టమైన పండ్లు కూడా కొనిచ్చే పరిస్థితిలో తాను లేనని తన జీవితంలోని బాధాకరమైన రోజుల గురించి గుర్తుచేసుకున్నారు.
ఛాలెంజ్‌గా తీసుకున్నాను..
మొదట్లో తనకు తెలుగు రాదని కొందరు హేళన చేశారని దానిని ఛాలెంజ్‌గా తీసుకున్నానని గుర్తుచేసుకున్నారు పవిత్ర జయరామ్. ఇప్పుడు తనకు తెలుగు చదవడం, రాయడం కూడా వచ్చని గర్వంగా చెప్పుకున్నారు. తన సంపాదనతో మొదటి కారు తీసుకున్నది తన జీవితంలో మర్చిపోలేని సంతోషరకమైన విషయం అని అన్నారు. తనకు సినిమాల్లో నటించాలనే కల ఉందని బయటపెట్టారు పవిత్ర. కానీ సీరియల్స్‌లో నటించేవారికి డేట్స్‌తో సమస్య ఉంటుందని తెలిపారు. కానీ ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినా అది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదని ఫీల్ అయ్యారు. తన జీవితంలో డైరెక్షన్ చేయాలన్నదే అతిపెద్ద కల అని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా డైరెక్టర్ పవిత్ర జయరామ్ అనిపించుకుంటానని తెలిపారు. కానీ ఆ కల నెరవేరక ముందే ఆమె మరణించారు.
Also Read: బతికి ఉన్న మా నాన్నను ఈ లోకం విడిచి వెళ్లిపో అన్నాను - తండ్రి మృతిపై మనోజ్ బాజ్‌పాయి ఎమోషనల్