Manoj Bajpayee: బతికి ఉన్న మా నాన్నను ఈ లోకం విడిచి వెళ్లిపో అన్నాను - తండ్రి మృతిపై మనోజ్ బాజ్‌పాయి ఎమోషనల్
Manoj Bajpayee: నటుడు మనోజ్ భాజ్‌పాయి తన తండ్రి మృతిపై ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రి బెడ్‌పై చివరి క్షణాల్లో ఉన్న మా నాన్నతో శరీరం విడిచి వెళ్లిపో నాన్న అని చెప్పాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
Manoj Bajpayee emotional on His Father Death: మనోజ్ బాజ్‌పాయి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతగా సినీ ఇండస్ట్రీలో తనదైన నటన, విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకున్నారు. పాత్ర ఏదైనా 100 శాతం న్యాయం చేస్తారు. ఇందులో నో డౌట్ అంటారు ఆయనతో కలిసి చేసిన ఏ దర్శక నిర్మాతలైన. అంతగా తన నటనతో మనోజ్ బాజ్‌పాయి మెస్మరైజ్ చేస్తుంటారు. దీంతో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఆయనకు ఆఫర్స్ క్యూ కడుతుంటాయి. ఆయన కూడా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ స్పేషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
ప్రస్తుతం హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో చోటుచేసుకున్న విషాద సంఘటను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అది ఆయన తండ్రి మరణం. ఏడాది వ్యవధిలోనే మనోజ్ భాజ్‌పాయి తన తల్లిదండ్రులను కొల్పోయిన సంగతి తెలిసిందే. 2021 ఆయన తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన చివరిలో రోజుల్లో చాలా వేదన పడ్డారని, బెడ్‌పై ప్రాణాలు విడిచిపెట్టలేక నొప్పితో విలవిల్లాడినట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.."నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది నా తండ్రి మరణం. అదీ కూడా ఓ కొడుకుగా నా తండ్రిని నేనే వెళ్లిపో అనడం అనేది మరింత హృదయ విదాకరమన్నారు.
Father’s Day 🙏🙏 pic.twitter.com/SMScmr038r
— manoj bajpayee (@BajpayeeManoj) June 18, 2023
చివరిగా ఫోన్ మాట్లాడుతూ..
అప్పుడు నేను కిల్లర్ సూప్ షూటింగ్‌లో ఉన్న. మా నాన్న, నాకు మధ్య ఎక్కువ అప్యాయత ఉండేది. ఒక రోజు నా సోదరి నుంచి ఫోన్ వచ్చింది. నాన్న ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. కానీ డాక్టర్స్ ఇంకా ఆయన ఈ ప్రపంచలోనే ఉన్నారంది. కొన ఊపిరితో కొట్టుకుంటున్నారనిచ ఆయనకు విముక్తి నువ్వే ఇవ్వాలని నా సోదరి నాతో చెప్పింది" అంటూ కన్నీరు పెట్టుకున్నారు. "ఆ తర్వాత నేను క్యారవాన్‌లో మా నాన్నతో ఫోన్ మాట్లాడాను. అప్పుడు ప్రొడక్షన్ బాయ్ నా పక్కనే ఉన్నాడు. 'నాన్న ఇక నువ్వు వెళ్లిపోయే సమయం వచ్చింది. ఇక నువ్వు బాధ, నొప్పి భరించింది చాలు. అన్ని బంధాలు వదిలేసి వెళ్లు' అంటూ ఫోన్‌లో మాట్లాడాను.
అలా మాట్లాడుతుంటే నా మనసు ఎంతగానో కుంగిపోయింది. నా మాటలు విని పక్కనే ఉన్న బాయ్ అయితే ఏడ్చేశాడు. ఆ క్షణం ఎంత కష్టంగా గడిచాయి. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ, వేదన నాకు మాత్రమే తెలుసు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నా గొంతు వినగానే ఆయన మనసు తెలియపడిందని, మరుసటి రోజు తెల్లవారు జామునే ఆయన చనిపోయారని మా సోదరి నుంచి ఫోన్ వచ్చిందన్నారు. అంటే నన్ను చూడాలి, మాట్లాడాలనే కోరికతోనే ఆయన తన శరీరాన్ని వదిలి వెళ్లిపోలేదంటూ మనోజ్ భాజ్‌పాయి భావోద్వేగానికి లోనయ్యారు. ఇక తండ్రి మరణవార్త వినగానే తనకు కన్నీళ్లు ఆగలేదంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.