Mukku Avinash: అప్పుల వల్ల ఆత్మహత్యకు యత్నించా, 'గెటప్' శ్రీనుకి చెబితే చచ్చిపో అన్నాడు! - అప్పుడు పూరీ గారికి ఫోన్ చేస్తే ఇలా అన్నారు
Mukku Avinash on Financial Problems: లాక్‌డౌన్ వచ్చింది. షోలు లేవు. అకౌంట్ మొత్తం జీరో అయ్యింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. బ్యాంక్ ఈఎంఐలు కూడా కట్టలేకపోయాను.
Mukku Avinash Open up on Financial problems: ముక్కి అవిషనాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌తో లైమ్ లైట్లోకి వచ్చాడు. ఇక బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటి సంపాదించుకున్నాడు. అయితే బిగ్‌బాస్ షో వల్ల అవినాష్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ మాలో 'ఆదివారం స్టార్ పరివార్' షోలో ఎంటర్‌టైన్ చేస్తున్న అవినాష్ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ తన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ షాకింగ్ విషయాలు చెప్పాడు.
లైఫ్ అంతా సాఫీ సాగుతుంది..
"జబర్దస్త్ షో వల్ల లైఫ్ సెట్ అయ్యింది. అప్పటి వరకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. ఏ బాధ లేదు. లైఫ్ సాఫిగా సాగుతుంది. అయితే అప్పుడే ఇల్లు కొన్నాను. ఉన్న డబ్బులు మొత్తం తీసి ఇల్లుకు పెట్టాను. అప్పుడే లాక్‌డౌన్ వచ్చింది. షోలు లేవు. అకౌంట్ మొత్తం జీరో అయ్యింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. బ్యాంక్ ఈఎంఐలు కూడా కట్టలేకపోయాను. ఒక్కసారిగా అప్పులు మీద పడ్డాయి. అప్పటి వరకు ఆకలి బాధలు చూసిన నాకు అప్పుల వల్ల మెంటల్ ప్రెషర్ పెరిగింది.బాగా ఆలోచించాను. నాకు ఈ దారి దొరకలేదు. ఇక మా ఊళ్లో బావి దగ్గరికి వెళ్లి తొంగి చూశాను. దుకాలా? వద్దా? దుకాలా? వద్దా? చాలా సేపు ఆలోచించుకుంటు బావి ముందే నిలబడ్డాను. అయితే చివరి సారిగా నాకు గెటప్ శ్రీను కాల్ చేయాలనిపించింది.
గెటప్ శ్రీను దూకేయ్ అన్నాడు
గెటప్ శ్రీను ఫోన్ చేశా. అన్న ఎలా ఉన్నావ్, ఇక నీతో ఇదే చివరి సారి మాట్లాడటం అని అసలు విషయం చెప్పి.. ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పా. సరే దూకేయ్ కానీ, ఒకసారి నన్ను కలిసి దూకు అన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు. "ఆ తర్వాత గెటప్ శ్రీను కలిశా. వెంటనే తను డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి కాల్ చేసి మాట్లాడించాడు. అప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ మూవీలో చేస్తున్నాడు. దాంతో పూరి జగన్నాథ్ గెటప్ శ్రీను మంచి క్లోజ్ అయ్యారు. ఇక ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడించారు. పిచ్చోడన్న అప్పులు ఉన్నాయట.. చచ్చిపోతాడట అంటున్నాడంటూ అసలు విషయం ఆయనకు చెప్పారు. దీంతో నాతో పూరి గారు ఒక పది నిమిషాలు మాట్లాడారు. 'జీవితం అనేది ఒక సినిమాలాంటింది అవినాష్. నీ జీవితంలో జరిగేవన్ని సీన్లు. అందులో అన్ని సీన్లు వర్క్ అవుట్ అవ్వాలని లేదు. ఏదోక సీన్ ప్లాప్ అవుతుంది. నీ లైఫ్‌లో ఒక సీన్ హిట్ అవ్వలేదేమో.
కానీ, నెక్ట్స్ సీన్ వర్క్ అవుట్ అవుతుంది కావచ్చు. వెయిట్ చేయ్. ఏదోక రోజు ఈ సీన్ పెలుతుంది. హిట్ కొడుతుంది. ఆలోచించుకో. సమస్యకి ఆత్మాహత్య పరిష్కారం కాదు. అలా అంటే మరి నేను ఏమైపోవాలి. నాకు జరిగిన దానికి నేను ఎప్పుడో చచ్చిపోవాలి' అని పూరి జగన్నాథ్ అన్నారు. అప్పుడు ఆయన మాటలు నాకు చాలా ధైర్యం ఇచ్చాయి. ఆ రోజు ఆయనతో మాట్లాడకుంటే ఏదోక రోజు ఆత్మహత్య చేసుకునేవాడినేమో" అంటూ చెప్పుకొచ్చాడు. ఇల్లు కోసం మల్లెమల వాళ్లు ముందుగా అడ్వాన్స్ ఇస్తారనుకున్నా. నేను అడిగితే ఇవ్వమన్నారు. వాళ్లు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటే అదృష్టం కొద్ది బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిందని చెప్పాడు. ఇక తన ఫ్రెండ్, యాంకర్ శ్రీముఖి గురించి చెబుతూ బిగ్‌బాస్ వెళ్తున్నప్పుడే శ్రీముఖి రూ.5 లక్షలు ఇచ్చిందని, ఇంకా కొందరు రెండు రెండు లక్షల ఇచ్చారని చెప్పాడు. వాటిని మల్లెమలకు కట్టేసి బిగ్‌బాస్ వెళ్లాను. వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక శ్రీముఖి పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తని ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, సెట్ అయితే ఈ ఏడాదిలో పెళ్లి అవుతుందేమో చూడాలి అన్నాడు.
Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడు జీవితం' - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!