Trinayani september 4th: కొడుకు చెంప పగలగొట్టిన తిలోత్తమ.. విశాల్ శాపానికి సుమన ప్రసవనే కారణమా?
విశాల్ఇం ముసలివాడిగా మారడం, సుమనకు పాము పుట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani September 4th: తిలోత్తమ తలకి గన్ గురి పెట్టుకోవడంతో వల్లభ వచ్చి నువ్వు చచ్చిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను అమ్మ అని అరుస్తాడు. నేను చచ్చిపోవడం కాదు నాయని నా తల మీద గన్ పెడితే అందరి ముందు నా పరువు పోయినట్టు అయింది. సిగ్గుతో చచ్చిపోతున్నాను. అయినా ఇందులో బుల్లెట్లు లేవులే అని తిలోత్తమ అంటుంది. నేను నిన్నే బుల్లెట్లు పెట్టాను మమ్మీ అని వల్లభ అనగా చెంప మీద గట్టిగా వాయించి ఈ విషయం ముందే చెప్పాలి కదా పొరపాటున నేను ట్రిగ్గర్ నొక్కుకుంటే ప్రాణం పోయేది అని అంటుంది తిలోత్తమా.
దానికి వల్లభ సారీ చెప్తాడు. అందరి ముందు నన్ను అవమానించింది తిరిగి తగిన శాస్తి జరిగేలా చేస్తాను ప్రస్తుతానికి అందరి దగ్గర దోషిగా ఉన్నాను కాబట్టి సైలెంట్ గా ఉండాలి సరైన టైంలో తిరగబడాలి అని అంటుంది తిలోత్తమా. ఆ తర్వాత సీన్లో సుమన పాపని ఉయ్యాలలో పడుకోబెట్టి తను మంచం మీద దొర్లుతూ ఫోన్ చూస్తుంది. పాపను అలాగ పక్కన పెట్టి ఫోన్ చూసుకోకపోతే వెళ్లి పాపని లాలించొచ్చు కదా. అయినా నా మాట ఎందుకు వింటావు? నిజాలు చెప్పే మా మాటలు కాదు అబద్ధాల దగ్గర ఉండే అమ్మ మాటలే నువ్వు ఎక్కువ నమ్ముతావు. నీకు మంచి ఎవరో చెడ్డ ఎవరో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు అని అంటాడు విక్రాంత్.
నీకే మంచి ఎవరో చెడు ఎవరో తెలియడం లేదు అయినా ఆస్తి ఒక్కసారి నా చేతికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని. పాపకి నీకు సంబంధం లేదన్నావు కదా మరి పాప గురించి నీకెందుకు అని అంటుంది సుమన. నీకు ఆస్తి రాకూడదు అని ఆ దేవుడిని మొక్కుతాను ఎలాగైనా నీకు ఆస్తి రాకుండా చేస్తాను అని విక్రాంత్ అనగా అది నీ తరం కాదు అని అంటుంది సుమన. ఆ తర్వాత సీన్లో నయని, గాయత్రి ఫోటో దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో హాసిని అక్కడికి వచ్చి నయని కి ధైర్యం చెప్తుంది.
పెద్ద అత్తయ్య కాని ఇక్కడ ఉండుంటే నీకు ఎంతో ధైర్యంగా నిలిచేవారు అని అనగా అమ్మగారు వచ్చినా రాకపోయినా అమ్మవారిని మాత్రం తెప్పిస్తాను. రేపు మంగళ గౌరీ వ్రతం చేస్తాను. బాబు గారు శాపానికి విముక్తి కలగడానికి రేపే నాంది పలికిస్తాను అని అంటుంది నయని. నేను నీకు తోడుగా ఉంటాను అని హాసిని అనగా దానికి నయని ఎల్లప్పుడూ నాకు తోడుగానే ఉండే తోటి కోడలు దొరకడం నా అదృష్టం అని అంటుంది.ఆ తర్వాత రోజు కుటుంబంలో అందరూ పూజకి ఏర్పాట్లు చేస్తారు. దురంధర పూజ చేస్తూ సుమనకి ఆస్తి వచ్చేటట్టు ముందుగానే లక్ష్మీదేవిని కూడా ఇక్కడ అమర్చాను అని అంటుంది. ఇంతలో పూజారి గారు వస్తారు.
చూడండి పూజారి గారు మా అక్క మొగుడికి యవ్వనం అయిపోయింది ముసలితనం కూడా వచ్చేసింది మీకు తెలుసు అనుకుంటా అని సుమన అంటుంది. మరి ముసలివాడు అయితే తన అసలు ఎలా తీరుతాయో అని తిరిగి యవ్వనంలోకి తన భర్త రావాలని పూజలు చేయిస్తున్నట్టు ఉన్నది అని తిలోత్తమ అంటుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా సరే బాబు గారిని నేను ఇంకొక పిల్లాడిలా చూస్తాను తప్ప మీరు ఆలోచించే విధంగా ఎన్నటికీ చూడను అని నయని అంటుంది. అయినా మావయ్య గారు ఇంట్లో లేరు కదా ఆవిడ అలాగా అనుకోవడంలో తప్పేం లేదు అని హాసిని అంటుంది. అలా మాట మాట పెరుగుతూ వస్తోంది.
ఇంతలో పూజారి గారు విశాల్ కి శాపం రావడానికి కారణం సుమన ప్రసవనే అని అంటారు. దానికి అందరూ ఆశ్చర్యపడతారు. సరిపోయింది అందరూ కలిసి నన్నే దోషిని చేస్తున్నారు నేనేం చేశాను మధ్యలో అని సుమన అనగా, కారణం నీ ప్రసవన అన్నాను కానీ నువ్వు కాదు కదా అని పూజారి గారు అంటారు. మీకు ఎలా తెలుసు పూజారుగారు అని అనగా 20 ఏళ్ల క్రితమే నేను ఇదంతా చూశాను అని పూజారుగారు అంటారు.
Join Us on telegram : https://t.me/abpdesamofficial