Satyabhama Serial Today May 21st: సత్యభామ సీరియల్ : ఎన్ని చేసినా ఓపికతో భరిస్తానని నందినితో చెప్పిన హర్ష.. మహదేవయ్యను చంపడానికి నర్సింహ కుట్ర!
Satyabhama Serial Today Episode : రెండు జంటలు హనీమూన్‌కి రావడంతో చక్రవర్తి వాళ్లకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode : హనీమూన్‌కి రెండు జంటలు బయల్దేరుతారు. హర్ష బట్టల బ్యాగ్‌ను సంధ్య, విశాలాక్షి రెడీ చేస్తారు. ఇంతలో సత్య వాళ్లు వస్తారు. సంధ్య సెటైర్లు వేస్తుంది. దీంతో క్రిష్ సంధ్యకి తొందరగా పెళ్లి చేసేస్తే ఇలాంటి సైటర్లు మాని వాస్తవాలు తెలుసుకుంటుంది అని అంటాడు. నందిని గురించి అడుగుతారు. నందినితో మాట్లాడుతాను అని విశాలాక్షి వెళ్తుంది.
విశాలాక్షి నందిని దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. నందిని ప్రతీ దానికి చిరాకు పడుతుంది. లోపలికి రమ్మని విశాలాక్షి పిలిస్తే వీధిలో అందరూ చూడాలి అని డ్రామాలు వద్దు అని నందిని అంటుంది. లోపలికి వెళ్లి సత్యతో ముచ్చట్లు పెట్టుకోమని అంటుంది. ఇక హనీమూన్‌లో హర్షని తనని కలిసి ఉండమని విశాలాక్షి చెప్తే అది జరిగే పని కాదు అని నందిని అత్తతో అంటుంది. దీంతో విశాలాక్షి కళ్లలో నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందని హర్ష అడిగితే కళ్లలో దుమ్ము పడిందని అంటుంది.
ఇక రెండు జంటలు హనీమూన్‌కి బయల్దేరుతారు. ఇక కొబ్బరి బోండాంల దగ్గర క్రిష్ కారు ఆపుతాడు. ఒకే బొండంలో రెండు స్ట్రాలు అని అంటే సత్య వద్దు అంటుంది. ఇక క్రిష్ బామర్ది మీ సంగతి ఏంటి అని అడుగుతాడు. దానికి హర్ష మీ చెల్లి ఇష్టం అని అంటాడు. దానికి నందిని ఇష్టాలేమీ లేవు ఎవరి బొండం వాళ్లదే అని అంటుంది. దీంతో నలుగురు ఎవరికి వాళ్లు బొండాలు తాగుతారు.
ఇక రాత్రి సత్య, హర్షలు కారులో వెనక్కి కూర్చొంటారు. సత్య క్రిష్ భుజం మీద పడుకుంటుంది. ఇక క్రిష్ ఫోటోలు తీసుకుంటాడు. మరోవైపు నర్శింహ మహాదేవయ్య మీద పగ తీర్చుకోవడం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఒక వ్యక్తి శ్రేయాభిలాషి అంటూ నర్శింహకు కాల్ చేసి మహదేవయ్య రేపు ఒంటరిగా దొరుకుతాడు అని పిల్లలు ఇద్దరూ లేరు అని అంటాడు.
క్రిష్, హర్ష జంటలు హనీ మూన్ దగ్గరకు వచ్చేస్తే చక్రవర్తి గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాటు చేస్తాడు. క్రిష్ బాబాయ్ అనుకుంటూ చక్రీని హగ్ చేసుకుంటాడు. సత్యని పరిచయం చేస్తాడు.
క్రిష్: బాబాయ్ ఈ హడావుడి ఏంటి.
చక్రవర్తి: రాకరాక మీరు నా రిసార్ట్‌కి వచ్చారు. ఈ మాత్రం హడావుడి లేకపోతే ఎలా. ఎలాగూ మీ పెళ్లికి రాలేకపోయాను. మీ హనీమూన్‌ని అయినా దగ్గరుండి గ్రాండ్‌గా చేద్దామని. నందిని దగ్గరకు వెళ్లి.. వసపిట్టలా వాగుతూ ఉండేదానికి ఎవరి మీదో అలిగినట్లు సైలెంట్ అయిపోయావు ఏంటి.
సత్య: రాత్రంతా జర్నీ కదా అంకుల్ అలిసిపోయినట్లు ఉంది.
చక్రవర్తి: అర్థమైంది. అయినా మీ ఆయన్ను పరిచయం చేయవేంటి.
నందిని: పరిచయం చేయాల్సినంత స్పెషాలిటీ ఏం లేదులే బాబాయ్.
చక్రవర్తి: స్పెషాలిటీ అంటే గొప్పతనం కాదు అమ్మ. మంచితనం కూడా. ఆ ఓపిక, ఒద్దిక, బుద్ధిమంతుడిలా ఉన్నాడు.
క్రిష్: కరెక్ట్‌గా చెప్పావు బాబాయ్. మా బామ్మర్ది బాగా చదువుకున్నాడు. బ్యాంక్‌లో ఉద్యోగం. సత్యకు సొంత అన్నయ్య.
చక్రవర్తి: మనసులో.. అన్నయ్య చెప్పినట్లు మొండి కేసులే దారిలో పెట్టడానికి చాలా కష్టపడాలి. మా అన్నయ్య ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి హనీమూన్‌కి పంపాడు. జాగ్రత్తలు చెప్పిమరి నన్ను చూసుకోమన్నాడు.
క్రిష్: అంటే మా మీద సీఐడీ పెట్టాడన్నమాట.
ఇక క్రిష్ చక్రవర్తిని నమ్మించడానికి సత్యను దగ్గరకు తీసుకుంటాడు. ఇక సంబంధం వాళ్లకి రూమ్‌లు చూపిస్తాడు. ఇక చక్రవర్తి సంబంధంతో రెండు జంటల మీద కన్నేసి ఉంచమని అంటాడు. క్రిష్ ఓవర్ యాక్షన్ చూసి డౌట్ వస్తుందని వాళ్లని ఓ కంట కనిపెట్టమని చెప్తాడు. ఇక హర్ష, నందినిలను ఒకటి చేయాలని అంటాడు.
హర్ష: మీ బాబాయ్ అంత మంచిగా మాట్లాడాడు నువ్వు కూడా మాట్లాడొచ్చు కదా. నీకు నేను ఇష్టం లేదు. నాతో హనీమూన్‌కి రావడం ఇష్టం లేదు. మన ఇద్దరి సమస్య మన మధ్య ఉంటే అయ్యేది కదా ముఖం చిరాకుగా పెట్టి అందరికీ తెలియాలా.
నందిని: తెలిస్తే నష్టం ఏముంది. లోపల ఒక ఫీలింగ్ పెట్టుకొని ఇష్టం లేనట్లు నటించడం నాకు చేతకాదు. ఇష్టం లేదు.
హర్ష: అలాంటప్పుడు మీ నాన్న గారినే ఎదురించి ఇంట్లోనే ఆగిపోవాల్సింది.
నందిని: నాలో మొండితనం ఉంది కానీ బాపుని ఎదురించే ధైర్యం లేదు. ఆ బలహీనతే నా జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజంగా నీకు నా మీద జాలి ఉంటే ప్రేమ ఉంటే నీకు నా కూతురు అంటే ఇష్టం లేదు వదిలేస్తా అని మా బాపుతో చెప్పొచ్చు కదా. నా జీవితం బాగు పడుతుంది.
హర్ష: నాకు ఇష్టం లేనిది నువ్వు కాదు నీ ప్రవర్తన. నేను నిన్ను వదులు కోవాలి అనుకోవడం లేదు మార్చుకోవాలి అనుకుంటున్నా.
నందిని: నేను మారను అంటున్నా కదా అర్థం కావడం లేదా. పిచ్చొడి లెక్క ఎందుకు నా వెంట తిరుగుతున్నావ్. ఎందుకు సతాయిస్తున్నావ్. ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావ్.
హర్ష: నేను టైం మాత్రమే వేస్ట్ చేసుకుంటున్నా. నువ్వు జీవితాన్నే వేస్ట్ చేసుకుంటున్నావ్ అది అర్థమవుతుందా నందిని. కారణం ఏదైనా మనిద్దరికి ఒంటరిగా ఉండే టైం దొరికింది. కోపాలు తాపాలు పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడుకుందాం. గతం గురించి మర్చిపోయి భవిష్యత్ గురించి ఆలోచిద్దాం.
నందిని: ఓ పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్లు ఉన్నావ్. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోక చెరో వైపు ముఖం పెట్టుకొని పడుకొని బ్యాగ్ సర్దుకొని పోయామా ఇదే లెక్క.
హర్ష: ప్రతీ విషయంలో నన్ను రెచ్చగొట్టాలి అన్నదే నీ ప్లాన్ కానీ నేను రెచ్చిపోను. ఓపికగా భరిస్తాను. నీ చేతుల్లో ఓడిపోవడానికి అయినా తగ్గడానికి అయినా నేను రెడీ. నా మనసు ఏదో ఒక రోజు అర్థం చేసుకోకపోవు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.