అన్వేషించండి

Guppedanta Manasu Serial Today May 21st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: అగ్రిమెంట్ పేపర్స్ చించేసిన మను – మను, వసు, మహేంద్రలకు వార్నింగ్ ఇచ్చిన శైలేంద్ర

Guppedanta Manasu Today Episode : శైలేంద్రను ఎండీగా ప్రకటించకపోవడంతో మను, వసు, మహేంద్రలకు అంతు చూస్తానని శైలేంద్ర వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: మనుకు ఫోన్‌ చేసిన శైలేంద్ర.. మహేంద్ర, వసుధారతో మాట్లాడొద్దని వీలైతే అక్కడ ఉండొద్దని చెప్తాడు. ఎందుకు అని మను అడుగుతే తర్వాత చెప్తాను నువ్వు త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయ్‌ అంటాడు. నువ్వు ఉండటానికి హోటల్‌లో రూం బుక్‌ చేస్తానని.. లేదంటే విల్లా బుక్‌ చేస్తానని చెప్తాడు. దీంతో మను మీరేదో కంగారులో ఉన్నట్లున్నారు తర్వాత మాట్లాడుదాం అంటూ  ఫోన్‌ కట్‌ చేస్తాడు. దీంతో శైలేంద్ర షాక్‌ అవుతాడు. అయినా డీల్‌ ప్రకారం మనుని జైలు నుంచి బయటకు తీసుకొచ్చాను. రేపు కాలేజీ ఎండీ సీటు నాదే అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటాడు. తర్వాత మహేంద్ర రెడీ అయి రాగానే వసుధార వస్తుంది.

వసు: ఏంటి మామయ్యా ఇవాళ త్వరగా రెడీ అయ్యారు. ఉదయాన్నే కాలేజీకి వెళ్దాం అంటున్నారు.

మహేంద్ర:ఈరోజు కాలేజీ వాడి సొంతం అవుతుందన్న భ్రమతో శైలేంద్ర ముఖం వెలిగిపోతుందమ్మా..

వసు: అవును మామయ్యా కానీ కథలోని ట్విస్ట్‌ తెలిస్తే గుండె ఆగిపోతుందేమో..?

అంటూ ఇద్దరూ కలిసి శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. ఎండీ అయ్యే అర్హత కూడా వాడికి లేదు అని మహేంద్ర అంటాడు. జగతి చావుకు కారణం అయిన వెధవ వాడు అలాంటి వాడిని అసలు  వదలకూడదు. వాణ్ని ఎండీ సీటుకే కాదు కాలేజీకే దూరంగా ఉంచాలని వసు అంటుంది. మరోవైపు కాలేజీలో కూర్చున్న మను దగ్గరకు హడావిడిగా శైలేంద్ర వచ్చి అంతా ఓకే కదా అని అడుగుతాడు. రాత్రి సడెన్‌గా ఫోన్‌ కట్‌ చేశావు కదా మనసు మార్చుకున్నావేమో అనుకున్నాను అంటాడు. దీంతో ఈ మను ఒక్కసారి ఫిక్స్‌ అయితే ఇచ్చిన మాట తప్పడు అంటాడు.  ఇంతలో వసుధార వస్తుంది.

శైలేంద్ర: ఏంటి వసుధార కాబోయే ఎండీ ఇక్కడ కూర్చుని ఉంటే పర్మిషన్‌  తీసుకుని లోపలికి రావాలని తెలియదా?

వసు: ఇప్పుడు ఇంకా నేనే ఎండీ.. నువ్వు ఇంకా కాలేదు.

శైలేంద్ర: ఇంకో పది నిమిషాల్లో నేను ఎండీ కాబోతున్నాను. ఎంటీ నేను ఎండీ సీటులో ఎలా ఉంటానని ఊహించుకుంటున్నారా? ఈ శైలేంద్ర ఎండీ సీటులో కూర్చుంటే ఆ ఠీవియే వేరు.

అనగానే ఇంతలో అటెండర్‌ వచ్చి బోర్డు మీటింగ్‌కు  అంతా రెడీ అని చెప్తాడు. అయితే శైలేంద్ర.. వసు, మనులను మీటింగ్‌కు వెళ్లమని నేను చిన్న ఫోన్‌ కాల్‌ మాట్లాడి వస్తానని చెప్పడంతో వసు, మను వెళ్లిపోతారు. శైలేంద్ర దేవయానికి ఫోన్‌ చేసి పదిన్నరకు కాలేజీకి రమ్మని చెప్తాడు. దీంతో దేవయాని నువ్విలా మాట్లాడుతుంటే నాకెందుకో భయంగా ఉందని అనడంతో శైలేంద్ర అదేం లేదని ఫోన్‌ కట్‌ చేసి బోర్డు మీటింగ్‌ హాల్‌లోకి వెళ్తాడు. అక్కడ అందరూ కూర్చుని ఉంటారు. ఇంతలో ఒక బోర్డు మెంబర్‌ మను గారు పంపించిన నోటీసు గురించి అడిగితే ఇప్పుడు ఆ యాభై కోట్లు మను గారు మాఫీ చేశారు అని వసుధార చెప్పడంతో శైలేంద్ర షాక్‌ అవుతారు.

అసలు  విషయం చెప్పకుండా ఏదో మాట్లాడుతున్నారు అంటూ నిలదీస్తాడు. దీంతో వసుధార మీటింగ్‌ ఈజ్‌ ఓవర్‌ అనడంతో శైలేంద్ర పిచ్చిపిచ్చిగా మాట్లాడతాడు. దీంతో ఫణీంద్ర, శైలేంద్రను తిడతాడు. అయితే ఫణీంద్రను అక్కడి  నుంచి వెళ్లిపోమ్మని చెప్పి మనం రాసుకున్న అగ్రిమెంట్‌  మర్చిపోయావా అంటూ మనును నిలదీస్తాడు శైలేంద్ర. అగ్రిమెంట్‌  పేపర్స్‌ చూపించమని మను అడగ్గానే పేపర్స్‌ మనుకు ఇస్తాడు శైలేంద్ర ఆ పేపర్స్‌ తీసుకుని చించిపారేస్తాడు మను. దీంతో కోపంగా శైలేంద్ర మీ అంత చూస్తానని వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిసొచ్చారే - ముంబైలో పోలింగ్ బూత్ దగ్గర బాలీవుడ్ స్టార్స్ సందడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Devara Collection Worldwide: దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Mahabubabad News: సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం
సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం
Rapaka Varaprasad: జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?
జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?
Embed widget