అన్వేషించండి

Satyabhama Serial Today May 1st: సత్యభామ సీరియల్: క్రిష్‌ని రెచ్చగొట్టిన నందిని.. భర్త నుంచి విడిపోమని సత్యకు అన్న సలహా.. పిల్లల దుస్థితికి తలపట్టుకున్న విశ్వనాథం!

Satyabhama Serial Today Episode : సత్య భార్యగా గౌరవం ఇవ్వడం లేదని అలాంటి భార్య నీకు అవసరం లేదని నందిని క్రిష్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode నందిని తన తల్లికి కాల్ చేసి ఇంట్లో తాను రేపిన రచ్చ గురించి చెప్తుంది. అయితే తాను కొంచెం ఎక్కువ చేశానని అది తండ్రికి తెలిస్తే ఏమవుతుందా అని భయపడుతుంది. ఈ గొడవ పెద్దది అవ్వకుండా తన విడాకులు వరకు వెళ్తే చాలు అని అంటుంది. 

భైరవి: అట్లా ఎట్లా కుదురుతుందే మీది కుండ మార్పిడి పెళ్లి. ఒక కుండ పగిలితే ఇంకో కుండా పగలకుండా ఆగుతుందా. నేను అయితే అన్నీ ఆలోచించా బిడ్డా. చిన్నా గాడు వాడి కాపురం గురించి ఆలోచించుకుంటాడు. నాకు కావాల్సింది నువ్వు. నువ్వు పుట్టింటికి తిరిగిరావడం.

నందిని: ఇప్పుడు నా పరిస్థితి ఏంటే.. ఎవరూ నాతో మాట్లాడటం లేదు. 

భైరవి: చిన్నా అక్కడే ఉన్నాడు కదా నీ జోలికి ఎవరూ రారు. చూస్తూ ఉండూ చిన్నాగాడే రేపు వాళ్లతో నిన్ను తీసుకొస్తాడు. 

మరోవైపు సంధ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక సత్య అక్కడికి వెళ్తుంది. ఏడుస్తున్న చెల్లిని ఓదార్చుతుంది. ఇక సంధ్య తన వల్ల తన తండ్రికి అవమానం జరిగింది అని ఏడుస్తున్నా అని చెప్తుంది. తండ్రి దగ్గరకు వెళ్లలేకపోతున్నా అంటుంది.  

నందిని: ఆరు బయట ఉన్న క్రిష్ దగ్గరకు వెళ్తూ.. ఇంత జరిగినా వీడు ఇంకా ఆలోచిస్తున్నాడు ఏంటి. వీడి కాపురం కూలితే కానీ నాది కూలదు. లాభం లేదు వీడికి బ్రెయిన్ వాష్ చేయాల్సిందే. అన్నా చేతకాని వాడు, చేవలేని వాడు, తప్పు చేసిన వాడు తల దించుకుంటాడు. నువ్వేంటి అన్న తలదించుకున్నావ్. బాధగాఉంది. ఈ ఘోరం చూడలేకపోతున్నా ఏం జరుగుతుంది అన్న. అయినా తప్పులన్నా నీ వైపే ఉన్నాయ్. అర్హత లేని మనిషిని ప్రేమించావ్. బాపు నెత్తినోరు మొత్తుకున్నా వినకుండా పెళ్లి చేసుకొని అందరి నెత్తిమీద కూర్చొపెట్టావ్. ప్రతీ దానికి సపోర్ట్ చేసుకొని నీ విలువ పోగొట్టుకున్నావ్. ఇప్పుడు అసలు రంగు చూపిస్తుంది. నాకు ఇష్టం లేకపోయినా హర్షని పెళ్లి చేసుకున్నా. నా బతుకు పోయినా పర్లేదు కానీ నువ్వు బాగుండాలి అని ఇక్కడ సర్దుకుపోతున్నా. చెప్పన్నా నువ్వు సంతోషంగా ఉన్నావా.. పెళ్లం చేతిలో చెంప దెబ్బతిని బయట కూర్చొని ముఖం దాచుకొని బాధ పడుతున్నావ్. నువ్వేంటి అన్న రోషం ఉందని మర్చిపోయావ్. పోనీ ఆవేశంలో కొట్టిందే అనుకుందాం తర్వాత వచ్చి సారీ చెప్పిందా.. అది నీ సంపంగి. నువ్వు దిగజారుడే కాకుండా మన ఫ్యామిలీ పరువు తీసేస్తున్నావ్. ఒక్క విషయం అన్న నీకు సత్య సరిపోదు.. నాకు హర్ష సరిపోడు..

మరోవైపు విశ్వనాథం తన బాధను విశాలాక్షికి చెప్పుకొని బాధ పడతాడు. అల్లుడిని ఎలా కొట్టిందని అసలు మనసు ఎలా ఒప్పిందని సత్య గురించి అంటాడు. దానికి విశాలాక్షి సత్యకు మీరు అంటే ప్రాణం. అల్లుడు మిమల్ని తోసేశాడు అన్న కోపంతో కొట్టేసింది.

విశ్వనాథం: అతను ఊరుకుంటాడా. ఎంత సత్యని ప్రేమిస్తే మాత్రం జరిగిన అవమానం తట్టుకుంటాడా. క్షమిస్తాడా..

విశాలాక్షి: అది మీ చేతిలో ఉంది. కన్యాదానం చేసేటప్పుడే కాదు కూతురు తప్పు చేసినప్పుడు కూడా కాలు పట్టుకోవాలి తప్పదు. వియ్యాల వారికి కూడా విషయం తెలిసినట్లు లేదు. లేదంటే ఈ పాటికి తుపాకీలతో దిగేవారు.

హర్ష: సత్య నువ్వు క్రిష్ సంతోషంగా ఉన్నారని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. అది నిజమేనా.. నువ్వు క్రిష్‌ని కొట్టడం చూస్తే అదేదో ఆవేశంలో కొట్టినట్లు లేదు. ఇన్నాళ్లు నీ లోపల దాచుకున్న కోపం, ద్వేషం కట్టలు తెంచుకున్నట్లు ఉంది. 

సత్య: దానికి గురించి మాట్లాడే ఆసక్తి నాకు లేదు అన్నయ్య కాసేపు నన్ను వదిలేయ్.

హర్ష: అతన్ని వదిలించుకుంటేనే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా. ఏ అన్నయ్య చెల్లికి ఇలాంటి సలహా ఇవ్వడు. భర్తని వదిలేయమని చెప్పడు. చెల్లిబావ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. నిజానికి నేను అదే కోరుకుంటాను కానీ అది ఎప్పటికైనా జరుగుతుందా.. నీ కాపురం సరిగా జరగనప్పుడు, జరగదు అని తెలిసినప్పుడు నీకు ఆ నరకంలో ఉండటం అవసరమా.. మొండిగా తన చెల్లి వైపు నిల్చొన్నాడు కానీ మంచీ చెడు ఆలోచించలేదు. ఈ గొడవ ఇక్కడితో ఆగదు. నిన్ను ప్రశాంతంగా ఉంచడు. నా ఫ్యామిలీకి నా చెల్లికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ అన్నయ్య చూసుకుంటాడు. అంతే కాదు నందినిని నా భార్యగా నా బాధ్యతగా చూసుకుంటా. నాకు అనుగుణంగా మార్చేసుకుంటా. కాబట్టి ఏ నిర్ణయం అయినా నువ్వు స్వేచ్ఛగా తీసుకో.

క్రిష్ గదిలో బెడ్ మీద మందు తాగుతూ ఉంటాడు. అది చూసి సత్య షాక్ అవుతుంది. గుడిలా చూసుకునే ఇంట్లో తాగడం ఏంటని బెడ్ దిగమని తిడుతుంది. దీంతో క్రిష్ కొడతావా అని అడుగుతాడు. తన మీద అధికారం చలాయిస్తున్నావని అంటాడు. అందరి ముందు ఎందుకు తనని కొట్టావ్, తనని ఎందుకు అవమానిస్తున్నావ్ అని అడుగుతాడు. ఇద్దరూ గొడవ పడతారు. ప్రేమించాను కాబట్టి ఆగిపోయాను. తిరిగి కొట్టాను అంటే నీ పరువు ఏమయ్యేది అని క్రిష్ అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 
 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కోడలు నెల తప్పిందని హడావుడి చేసేసిన అత్తలు.. కుమిలికుమిలి ఏడ్చిన కృష్ణ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!ఎద్దుపై పులి దాడి, రెండ్రోజులు అదే ఫుడ్.. వణికిపోతున్న ప్రజలుఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Embed widget