Krishna Mukunda Murari Serial Today May 1st : కృష్ణ ముకుంద మురారి సీరియల్: కోడలు నెల తప్పిందని హడావుడి చేసేసిన అత్తలు.. కుమిలికుమిలి ఏడ్చిన కృష్ణ!
Krishna Mukunda Murari Serial Today Episode : కృష్ణ ప్రెగ్నెంట్ అయిందని భవాని, రేవతిలు సంతోషం పడటం చూసి కృష్ణ చాలా బాధ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : కృష్ణ, మురారిలు కారులో వెళ్తూ రోడ్డు మీద ఓ ముసలావిడ మామిడి కాయలు పెట్టుకొని కూర్చొంటుంది. అది మురారి చూసి మండుటెండలో ఆమెని చూసి జాలిపడతాడు. ఆమెను ఇంటికి పంపాలి అని కాయల్నీ కొనేద్దామని కృష్ణతో చెప్తాడు. కృష్ణ సరే అని భర్త మంచితనానికి కన్నీరు పెట్టుకుంటుంది.
మరోవైపు కృష్ణ, మురారిలకు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసి పార్టీ ప్రారంభిస్తుంది. అందరూ కృష్ణ కోసం ఎదురు చూస్తారు. ఇంతలో కృష్ణ, మురారిలు వస్తారు. చేతిలో మామిడికాయల బుట్ట పట్టుకొని మురారి రావడం అందరూ చూస్తారు. భవాని ప్రేమగా కృష్ణని దగ్గరకు తీసుకుంటుంది.
భవాని: కృష్ణ నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా ఏంటి. నిన్ను చూసి మేం సర్‌ఫ్రైజ్ అవ్వాలి అనుకున్నావ్. కానీ మేం నిన్ను సర్‌ఫ్రైజ్ చేయాలని ఈ పార్టీ ఏర్పాటు చేశాం.
కృష్ణ: ఏం మాట్లాడుతున్నారు పెద్దత్తయ్య నాకేం అర్థం కావడం లేదు.
భవాని: అర్థం కావడం లేదా మరి ఇదేంటి. మీరు చెప్పకపోయినా మీరు తెచ్చుకున్న మామిడికాయలే చెప్తున్నాయి. నువ్వు తల్లివి కాబోతున్నావని. ఎప్పుడెప్పుడు ఈ శుభవార్త చెప్తావా అని మేం ఎదురు చూస్తుంటే నా దగ్గరే దాచేస్తావా. నీ వాలకం చూసి అనుమానం వచ్చి హాస్పిటల్‌కి కాల్ చేశాను. గైనకాలజిస్ట్ దగ్గర ఉన్నారు. ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.
కృష్ణ: అది కాదు అత్తయ్య.
భవాని: నువ్వేం చెప్పకు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్. ఇప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా.
రజిని: కృష్ణ ఏదో చెప్తుంది కదా వదినా విను. వీళ్ల వాలకం చూస్తుంటే అక్కడేం లేదు. నువ్వే ఏదో ఊహించుకుంటున్నావ్ అనిపిస్తుంది.
భవాని: నోరు మూస్తావా.. నీకు ఎన్ని సార్లు చెప్పాను అపశకునం మాటలు మాట్లాడొద్దు అని. నేను హాస్పిటల్‌కి కాల్ చేసి కన్ఫామ్ చేసుకున్నా. ఇప్పుడు వీళ్లు తెచ్చుకున్న మామిడి కాయలే అందుకు సాక్ష్యం.
మురారి: మనసులో.. ఏదో ముసలావిడకు సాయం చేద్దామనుకుంటే పెద్దమ్మ ఇలా ఊహించుకుంటుంది.
ఫ్రెష్ అవ్వడానికి గదికి వెళ్లిన కృష్ణ భవాని మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. మురారి కృష్ణని ఓదార్చుతాడు.
కృష్ణ: ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా నా వల్ల కావడం లేదు ఏసీపీ సార్. అత్తయ్య, పెద్దత్తయ్య నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చూశారా.. నేను నెల తప్పాను అని సంబరాలు చేసుకుంటున్నారు. కాదని తెలిస్తే ఏమైపోతారో. కానీ ప్రతిక్షణం నిజాలు దాస్తూ అబద్ధాలు చెప్తూ నా వల్ల కావడం లేదు ఏసీపీ సార్. మోసం చేస్తున్నాను అన్న అపరాధ భావం ఎక్కువైపోతుంది.
మురారి: మనం ఎవర్ని మోసం చేయడం లేదు. బాధని భరిస్తున్నాం. దాన్ని సంతోషంగా మార్చి అందరికీ పంచాలి అని చూస్తున్నాం.
కృష్ణ: నా పరిస్థితి పగ వాడికి కూడా రాకూడదు ఏసీపీ సార్. అసలేం చేయాలో అర్థం కావడం లేదు.
మురారి: ఏం చేయలేం కృష్ణ. అబద్ధాన్ని కంటిన్యూ చేయడం తప్ప ఏం చేయలేం. ఇంత దురదృష్టంలో కూడా మనకు అదృష్టం ఉంది. ఒక ఆశ ఉంది. అదే సరోగసి. మనం ఆ ధైర్యంతో ముందుకు వెళ్దాం. మనం ఎప్పుడు సరోగసికి వెళ్లాలి అనుకుంటున్నామో ఆ క్షణమే నువ్వు తల్లివి అయినట్లు.
ఇంతలో రేవతి ఇద్దరి కోసం మజ్జిగ తీసుకొని వస్తుంది. అత్తగా కాకుండా తల్లిగా ఫ్రెండ్‌గా చూసుకునే నాకు కూడా చెప్పలేదు ఏమని రేవతి అడుగుతుంది. దీంతో కృష్ణ ఎమోషనల్ అయిపోతుంది. రేవతి వెళ్లిపోయిన తర్వాత కృష్ణ భర్తని పట్టుకొని చాలా ఏడుస్తుంది. మరోవైపు ముకుంద సంతోషంగా ఇంటికి వస్తుంది. తాను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని.. మురారి, కృష్ణలు సరోగసీ ప్రాసెస్ పేపర్ల మీద సంతకాలు పెట్టేస్తే తాను సక్సెస్ అయినట్లే అని అనుకుంటుంది. ఇంతలో ఆదర్శ్ ఎదురవుతాడు. ఆదర్శ్‌ని చూసిన మురారి తిట్టుకుంటుంది. ఇక ఇంటిలో హడావుడి ఏంటని ముకుంద అడుగుతుంది. దీంతో కృష్ణ నెలతప్పిందని చెప్తాడు. ఇక భవాని కృష్ణ నెల తప్పింది అన్న సంతోషంతో నగలన్నీ తీసుకొచ్చి కృష్ణకు అలంకరిస్తుంది. పాపం కృష్ణ అత్త ప్రేమకు కుమిలిపోతుంది. కృష్ణను రెడీ చేసి సీమంతంలా అందరూ ఆశీర్వదిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మల్లేశ్ విషయంలో కార్తీక్‌ని అసహ్యించుకున్న దీప.. నిజం తెలుసుకున్న జ్యోత్స్న!