Karthika Deepam 2 Serial Today May 1st: కార్తీకదీపం 2 సీరియల్: మల్లేశ్ విషయంలో కార్తీక్‌ని అసహ్యించుకున్న దీప.. నిజం తెలుసుకున్న జ్యోత్స్న!
Karthika Deepam 2 Serial Today Episode : ఇంటి నుంచి బయటకు వచ్చేసిన దీపని మల్లేశ్ దగ్గర అప్పుల గురించి కార్తీక్ ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : పారిజాతం దీపని ఇంటికి వెళ్లిపోమని చెప్తుంది. ఇంట్లో వాళ్లే డబ్బు ఇచ్చారని పంపేమన్నారని అంటుంది. దీప పారిజాతం తనకు ఇచ్చిన డబ్బులు తన చేతిలో పెట్టేసి వెళ్లమని అంటుంది. ఇక దీప పారిజాతం మాటలు తలచుకొని బాధ పడుతుంది. తన బ్యాగ్ సర్దేసి సౌర్యతో సైకిల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అని అంటుంది.
సౌర్య మెడలోని చేయి తీసి అక్కడే ఉన్న బీరువాలో పెట్టేస్తుంది. ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోవాలి అనుకుంటున్నామని తనని క్షమించమని అని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఇక దీప, సౌర్యలను కార్తీక్ చూస్తాడు. వాళ్లకి ఎదురుగా వెళ్తాడు.
కార్తీక్: ఏమే రౌడీ ఎక్కడికి వెళ్తున్నావ్.
సౌర్య: నా సైకిల్ తెచ్చుకోవడానికి ఊరు వెళ్తున్నాం.
కార్తీక్: మరి నాతో చెప్పకుండా వెళ్తున్నావ్ ఏంటి.
సౌర్య: అమ్మ మీతో చెప్పింది కదా.
కార్తీక్: సరే నీకు ఐస్‌క్రీమ్ కొని పెడతా రా కారులో కూర్చో..
దీప: ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు.
కార్తీక్: ఎండగా ఉంది పర్లేదు లెండీ.. పాపని కారులో కూర్చొపెట్టి వచ్చి.. నడుచుకుంటూ వస్తున్నారు అంటే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వస్తున్నారు అని అర్థమైంది. మార్నింగ్ వచ్చిన న్యూస్ గురించి ఇంట్లో ఎవరైనా మీతో ఏమైనా అన్నారా.
దీప: ఎవరైనా ఏమైనా అంటేనే వెళ్లిపోవాలా. నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. అందుకే వెళ్లిపోతున్నా.
కార్తీక్: పాప దృష్టిలో నాన్న అయితే ఇంకా దొరకలేదు కదా.
దీప: ఆ నాన్న ఇంక ఎప్పటికీ దొరకడు బాబు. ఎందుకంటే ఆ నాన్న లేడు కాబట్టి. అది కోరుకున్న మంచి నాన్నని నేను ఎప్పటికీ తీసుకురాలేను. అలా అని ఆ నీచుడిని నాన్న అని చెప్పలేను.
కార్తీక్: ఏదో ఒకరోజు నాన్న కోసం పాప నిలదీస్తే అప్పుడేం చెప్తారు.
దీప: మీ నాన్న చచ్చిపోయాడు అని చెప్తాను. నాన్న చచ్చిపోయాడు అంటే ఏ గుండె తట్టుకోలేదు బాబు. నాన్న చేతుల మీద పెరిగే నాన్న తప్ప ఎవరూ లేని నేనే నా కళ్ల ముందే నాన్న చనిపోతే.. కాదు మీరు చంపేస్తే.. నాన్నతో పాటే నేను చనిపోలేదు కదా తట్టుకొని బతికాను కదా. నేనే ఇలా ఉంటే దానికి అసలు నాన్న ఎలా ఉంటాడో తెలీదు. అద్దంలో చూపించి దానిలా ఉంటాడు అంటే మురిసిపోయింది. అది ఊహించి మురిసి పోతున్న నాన్న కళ్లముందుకు వస్తే బూచోడు అని భయపడుతుంది. ఆ బూచోడే మీ నాన్నా అని చెప్తే అసహ్యించుకుంటుంది. నన్ను ఎవడో ఏదో అన్నాడు అని కాదు బాబు. నా బిడ్డ గురించి ఆలోచించి ఇలా దొంగలా వెళ్లిపోతున్నారు.
కార్తీక్: ఇలా వెళ్లడానికి కారణం ఏంటి.
దీప: కారణం మీరే బాబు. అవును బాబు మీరు పాపకి బాగా దగ్గరైపోతున్నారు. అది నా దగ్గరే ఉన్నా మీ గురించే మాట్లాడుతుంది. నిజం దానికి తెలీదు కదా మీరు దాని మీద చూపిస్తున్న ప్రేమ నటన అని. నా కూతురు ద్వారా నా దృష్టిలో మంచోడు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అంత శ్రమ అవసరం లేదు. ఎందుకంటే నా తండ్రి తిరిగి రాడు అనేది ఎంత నిజమో నేను మిమల్ని క్షమించను అనేది కూడా అదే నిజం. ఇక్కడే ఉంటే మీరే దానికి నాన్నని చూపిస్తారేమో. లేక అందరూ అనుకున్నట్లు తను నన్ను తప్పుగా అనుకుంటుందేమో.. దానికి అమ్మానాన్న రెండు నేనే. ఎప్పటికీ నేనే ఉంటాను దానికి.
కార్తీక్: దీప నీకు ఓ నిజం చెప్పాలి ఆ కారు యాక్సిడెంట్.
దీప: మరేం చెప్పకండి బాబు. నాకు అవన్నీ గుర్తు చేయకండి. నన్ను ఇంటికి వెళ్లనివ్వండి.
కార్తీక్: ఊరిలో మీ ఇంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు.
దీప: అలాంటి ఇళ్లు వంద ఉన్నాయ్.
కార్తీక్: కానీ అందరికీ ఆ వడ్డీ మల్లేశ్ దగ్గర అప్పు లేదు కదా. ఆ రోజు మీ ఇంటి దగ్గరకు నేను వచ్చా వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. లాగిపెట్టి కొట్టాను. ఆ రోజే నాకు అర్థమైంది ఊరిలో మీ పరిస్థితి ఏంటో.
దీప: మీకు ఎలా అభినందనలు చెప్పాలో నాకు తెలీడం లేదు. నాకు ఇప్పుడే అంత అర్థమవుతుంది. నన్ను ఒక మాట అన్నాడని మీరు వాడిని చెంప మీద కొట్టారు. కానీ మీరు అన్న మాటకి వాడు నన్ను ఎక్కడ కొట్టాడో తెలుసా. నా గుండెల మీద కొట్టాడు. నా ఆడతనాన్నే ఎగతాళి చేశాడు. నా పరువుని పంచాయితీ పెద్దల ముందు పెట్టాడు. ఏమీ తెలీని నేను మగ తోడు లేని దిక్కుతోచని పరిస్థితలో కూతుర్ని పట్టుకొని మొగుడిని వెతుక్కొని రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. మీరు మల్లేశ్‌ని కొట్టిన ఒక్క దెబ్బ నన్ను ఈ రోజు నడిరోడ్డు మీద నిలబెట్టింది. లేదంటే ఎప్పటిలా సర్దిచెప్పుకునేదాన్ని. ఇంత తెలిసిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటే మీరు నా కూతుర్ని కూడా దూరం చేస్తారు. వదిలేయండి బాబు మేం వెళ్లిపోతాం. అక్కడ నాకోసం ఎదురు చూసే అత్తయ్య ఉంది. ఇన్నాళ్లు బతికాం కదా ఇకపై కూడా బతుకుతాం. మేం మీకు కనిపించిన సంగతి కూడా ఎవరికీ చెప్పకండి. అని సౌర్యని తీసుకొని వెళ్లిపోతుంది.
కార్తీక్: నువ్వు చెప్పింది విన్న తర్వాత నిన్ను ఆపే అధికారం నాకు లేదు అనిపించింది దీప. ఇప్పుడు నీకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నాకు. ఇక ఈ బాధ జీవితాంతం మోయాల్సిందేనా.
సుమిత్రను కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టడం కోసం కొందర్ని తీసుకొని పోలీసులు ఇంటికి వస్తారు. దీపని పిలవమంటారు. జ్యోత్స్న దీప ఉన్న ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇంటికి గడియ పెట్టడం చూస్తుంది. లోపలికి వెళ్లి బట్టలు లేవు అనుకుంటుంది. ఇక దీప అక్కడ పెట్టిన గొలుసు చూస్తుంది. అది తీసుకొని దీప వెళ్లిపోయింది అనుకుంటుంది. ఆ విషయం బయటకు వచ్చి తల్లివాళ్లతో చెప్తుంది.
చైను వదిలేసి వెళ్లింది అంటే దీప ఇళ్లు వదిలి వెళ్లిపోయిందని అంటుంది. ఇక పోలీసులు దీపని మీరే పంపేశారా అని ప్రశ్నిస్తాడు. సుమిత్ర కేసు, జ్యోత్స్న యాక్సిడెంట్ కేసు రెండింటిలోనూ దీపే సాక్షి అని అందుకే తనని పంపేశారని అడుగుతాడు. ఇక పోలీసు అధికారి సుమిత్ర వాళ్లని అంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి అడ్డుకుంటాడు. దీపని ఎవరూ పంపించలేదని తానే వెళ్లిపోయిందని అంటాడు. దీపని తీసుకొస్తాను అని కార్తీక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Also Read: 'త్రినయని' సీరియల్ : గోడ మీద గాయత్రీ దేవి ఛాయ.. ఎమోషనల్ అయిన నయని, లలితాదేవి!