Trinayani Serial Today May1st: 'త్రినయని' సీరియల్ : గోడ మీద గాయత్రీ దేవి ఛాయ.. ఎమోషనల్ అయిన నయని, లలితాదేవి!
Trinayani Serial Today Episode : గాయత్రీ పాప నీడను గోపికమ్మ రూపంలో గోడ మీద పడేలా హాసిని చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode : హాసినిని ఎక్కువ మాట్లాడొద్దు అని లలితాదేవి చెప్తుంది. అయినా సరే మాట్లాడనూ అంటూనే హాసిని మాట్లాడటంతో గాయత్రీ చెల్లి జాడ తెలియగానే నిన్ను పిలుస్తాను అంత వరకు వెళ్లి పిల్లల పనులు చూసుకో అని చెప్తుంది. దీంతో హాసిని అలా అంటారు ఏంటి అత్తయ్య అని ఫీలవుతుంది.
నయని: అయ్యో పాపం తనకి కూడా గాయత్రమ్మగారి ఛాయ చూడాలి అని ఉంటుంది కదా అమ్మగారు.
విశాల్: లేదు లేదు వదిన ఇక్కడి నుంచి వెళ్తేనే మంచిది.
వల్లభ: చూశావా తమ్మికి కూడా విసుగు వచ్చింది.
విశాలాక్షి: నువ్వు వెళ్తేనే ఇక్కడ పని జరుగుతుంది.
హాసిని: సరే నేను వెళ్తాను కానీ గాయత్రీ దేవి జాడ తెలిస్తే నన్ను పిలవండి.
లలితాదేవి: ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను పిలుస్తాను.
విశాల్: మనసులో.. ప్లాన్ ప్రకారం హాసిని వదిన ఎక్కువ వాగేసి ఇక్కడి నుంచి వెళ్లగలిగింది. మిగతా తతంగాన్ని మెసేజ్ ద్వారా నడపొచ్చు.
నయని: స్వామి అమ్మగారి నీడ ఎప్పుడు కనిపిస్తుంది.
గురువుగారు: మరో రెండు నిమిషాల్లో అమృత ఘడియలు ప్రారంభమవబోతున్నాయి.
లలితాదేవి: అంతా అమ్మవారి దయ. తన లీల ఎలా ఉంటే అలా జరుగుతుంది.
విక్రాంత్: పెద్దమ్మ చిన్న ఆధారం దొరికితే చాలు గాయత్రీ పెద్దమ్మ ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చేస్తాం.
లలితాదేవి: నీకు ఆ సమర్థత ఉందని నా తెలుసు విక్రాంత్.
మరోవైపు హాసిని గాయత్రీ పాపని గోపికమ్మలా చున్నీ చుడుతుంది. పాపని తీసుకొని మేడ మీదకు వెళ్తుంది. లైట్ సెట్టింగ్స్‌ను విశాల్ ఏర్పాటు చేస్తాడు. పాప కనిపించకుండా నీడ పడేలా ఏర్పాట్లు చేస్తారు. గురువుగారు మూటని తీస్తారు. అందులో ఉన్న వస్తువుల మీద చంద్రుడి వెన్నెల పడితే గాయత్రీ దేవి జాడ తెలుస్తుందని అంటారు. ఇక హాసిని గాయత్రీ పాపని లైట్ ముందు పెడుతుంది. హాసిని విశాల్ ఫోన్లు పట్టుకొని రెడీగా ఉంటారు. విశాల్ హాసినికి మెసేజ్ చేస్తాడు.
మరోవైపు ఇళ్లంతా చీకటి కాగానే చంద్రుడి వెలుగు ఇంటిలోకి వస్తుంది. అప్పుడు మూట లోని వస్తువులు బయటకు లేచి గాల్లో తేలుతాయి. అందులోని బొమ్మ చుట్టూ గుర్రపునాడ తిరుగుతుంది. మరోవైపు హాసిని పాప మీద లైటింగ్ వేస్తుంది. దీంతో గోడ మీద పాప నీడ కనిపిస్తుంది. అయితే చున్నీ కప్పినట్లు కనిపిస్తుంది. అందరూ వండర్ అనుకుంటూ షాక్ అయిపోతారు. నయని, లలితాదేవి చాలా ఎమోషనల్ అయిపోతారు.
నయని: అచ్చం గోపికలా ఉంది నా అమ్మగారు. నా పెద్ద కూతురు. పెద్దమ్మ గారు చూడండి.
లలితాదేవి: చూస్తున్నా నయని.. చిన్నప్పుడు తనని గోపికలా ఉండే ముద్దు గుమ్మలా ఉంటావు అని అనేదాన్ని. అందుకే.. అందుకే ఇవాళ తన ఛాయ కూడా ఇలా కనిపిస్తుందన్నమాట.
వల్లభ: ఏంటి మమ్మీ ఏం జరుగుతుంది.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్యని బాగా చూడు వల్లభ.
సుమన: నేను చూస్తున్నా అత్తయ్య.
హాసిని కూడా చూడాలి అని లలితాదేవి తనని పిలుస్తుంది. ఇక హాసిని కిందకి వచ్చి నేను చూడలేకపోయాను అని ఫీలైనట్లు యాక్టింగ్ చేస్తుంది. మరోవైపు అందరూ గాయత్రీదేవి గోపికలా ఉంటుందని దాని బట్టి కనిపెట్టొచ్చని అనుకుంటారు.
మరోవైపు తిలోత్తమ, వల్లభలు తెగ ఆలోచిస్తుంటారు. నీడ వల్ల ఎలా కనిపెట్టగలమని ఆలోచిస్తారు. ఇంతలో అక్కడికి హాసిని వస్తుంది. ఛాయ తాను చూడలేకపోయాను అని అంటుంది. హాసిని వచ్చి గోపిక వేషంలో ఉంది అంటే గోశాల దగ్గర వెతికితే దొరుకుతుందని అంటుంది. ఇక తిలోత్తమ కూడా ఐడియా బాగుంది అనుకుంటుంది. హాసిని చెప్పినట్లు తిలోత్తమ వెతకాలి అనుకుంటుంది. ఇక హాసినిని పొగిడేస్తుంది.
సుమన: నవ్వుతూ ఉన్న విక్రాంత్‌ని చూసి.. తెగ సంతోషపడిపోతూ మంచాన పడ్డటున్నారు.
విక్రాంత్: మంచాన పడటం అంటే రోగగ్రస్తులు అవ్వడం.
సుమన: మంచిగా మంచానికి అతుక్కుపోయారు కారణం ఏంటో తెలుసుకోవచ్చా.
విక్రాంత్: గాయత్రీ దేవి ఛాయ కనిపించిన తర్వాత నయని వదిన చాలా సంతోషపడింది. విశాల్ బ్రో కూడా రిలాక్స్‌గా అనిపించాడు. వాళ్లు బాగుంటే మనందరం బాగుంటామ్ సుమన.
సుమన: ఆనందించడం అయిపోయింది లేచి దిండు, చాప పట్టుకొని వెళ్లండి. మీ పెద్దమ్మ నీడ కనిపించింది కాబట్టి రేపటి నుంచి వెతకడం ప్రారంభిస్తారు. వారం పదిరోజుల్లో దొరికిందే అనుకోండి. అప్పుడు గాయత్రీ పాప పేరిట రాయించిన ఆస్తిని అటు ఇటూ చేసి రాయించేస్తారు. అప్పటి వరకు ఉన్న ప్రేమ కాస్త తగ్గించి గాయత్రీ పాపని గుడికి పంపించిన కన్నబిడ్డని ఒడికి తీసుకుంటారు. అసలు నీడ ఎలా వచ్చిందా తెలుసుకుందామని సీసీ టీవీ ఫుటేజ్ అడిగితే సాయంత్రం నుంచి ఇంట్లో సీసీ కెమెరాలు అన్నీ ఆగాయంట.. అంటే ఇందాక జరిగిన దృశ్యాన్ని కెమెరాల్లో బంధించకూడదు అని అలా చేశారు అన్నమాట. నాకు అయితే డైటే.. మీ పెద్దమ్మ ప్రాణాలతో లేదు అని సుమన అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఘనంగా 'దేవత' నటి వైష్ణవి రామిరెడ్డి గృహప్రవేశం - ఇల్లు చూశారా? ఎంత లగ్జరీగా ఉందో!